దగ్గరి బంధువు చనిపోతే కర్మకాండలకు వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.
శంషాబాద్ రూరల్: దగ్గరి బంధువు చనిపోతే కర్మకాండలకు వచ్చి తిరుగు ప్రయాణంలో ప్రమాదం బారిన పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. మహబూబ్‌నగర్ జిల్లా చటాన్‌పల్లికి చెందిన దేవగిరి శ్రీనివాస్ (40) రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్‌లో బంధువు కర్మకాండలకు ఆదివారం వచ్చాడు. కార్యక్రమం పూర్తయ్యాక తిరుగు ప్రయాణంలో పెద్ద షాపూర్ వద్ద బెంగళూరు రహదారిపై రోడ్డు దాటుతుండగా మారుతి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.