
భారత ఫుట్‌బాల్ జట్టు డిఫెండర్ సందేశ్ జింగాన్ కేరళ బ్లాస్టర్స్ క్లబ్‌ను వీడాడు. ఆరేళ్లుగా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో కేరళ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన అతను పరస్పర ఒప్పందం మేరకే తమ జట్టును వీడుతున్నట్లు బ్లాస్టర్స్ అధికారి ఒకరు తెలిపారు. చండీగఢ్‌కు చెందిన 26 ఏళ్ల సందేశ్ డిఫెన్స్‌లో దిట్ట. ఐఎస్‌ఎల్‌లో రెండుసార్లు (2014, 2016) కేరళను ఫైనల్‌కు చేర్చడంతో కీలకపాత్ర పోషించాడు. గాయంతో గత 2019–20 సీజన్‌కు పూర్తిగా దూరం కావడంతో కేరళ బ్లాస్టర్స్ మెరుగైన ప్రదర్శన ఇవ్వడంలో విఫలమైంది. 10 జట్లు తలపడిన ఐఎస్‌ఎల్‌లో కేరళ పేలవమైన ఆటతీరుతో ఏడో స్థానంలో నిలిచింది.