India Footballer Sahal Abdul Samad Marries Badminton Player Reza Farhat - Sakshi
Sakshi News home page

బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ను పెళ్లాడిన భారత ఫుట్‌బాల్‌ స్టార్‌.. ఫొటోలు వైరల్‌

Jul 13 2023 3:38 PM | Updated on Jul 13 2023 4:22 PM

India Football Star Sahal Abdul Samad Marries Badminton Player Reza Farhat - Sakshi

Sahal Abdul Samad Married Reza Farhat: భారత ఫుట్‌బాల్‌ స్టార్‌ సాహల్‌ అబ్దుల్‌ సమద్‌ వైవాహిక బంధంలో అడుగుపెట్టాడు. కేరళ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి రెజా ఫర్హత్‌ను పెళ్లిచేసుకున్నాడు. గతేడాది జూలైలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట గురువారం నిఖా చేసుకుంది. కేరళలోని కన్నూర్‌లో వీరి వివాహ వేడుక జరిగింది.

సమద్‌ సహచర ఆటగాళ్లు, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ కేరళ బ్లాస్టర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ప్లేయర్లు పెళ్లికి హాజరయ్యారు. సచిన్‌ సురేశ్‌, రాహుల్‌ కేపీ తదితరులు సమద్‌- రెజా వివాహ వేడుకలో సందడి చేశారు.

కాగా 26 ఏళ్ల సమద్‌ భారత ఫుట్‌బాల్‌ జట్టులో కీలక సభ్యుడు. మిడ్‌ఫీల్డర్‌ అయిన సమద్‌.. 2017లో కేరళ​ బ్లాస్టర్స్‌కు తొలిసారి ఆడాడు. ఇప్పటి వరకు మొత్తంగా 92 మ్యాచ్‌లలో భాగమై 10 గోల్స్‌ సాధించాడు. భారత్‌ తరఫున 30 మ్యాచ్‌లు ఆడి మూడు గోల్స్‌ చేశాడు. ఇటీవల SAFF Championship గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు.

ఇక ఆటగాళ్ల బదిలీల క్రమంలో సమద్‌ కేరళ బ్లాస్టర్స్‌ను వీడి మోహన్‌ బగన్‌ సూపర్‌ జెయింట్‌కు ఆడనున్నాడు. అతడి కోసం  ఈ ఫ్రాంఛైజీ ఏకంగా రికార్డు స్థాయిలో 1.5 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇదిలా ఉంటే.. సమద్‌ భార్య రెజా కేరళ తరఫున పలు బ్యాడ్మింటన్‌ ఈవెంట్లలో పాల్గొంది. ఈ క్రీడా జంట నిఖాకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement