ISL 2022: Kerala Blasters Beat East Bengal FC By 3-1 In Opening Match - Sakshi
Sakshi News home page

ISL 2022: కేరళ బ్లాస్టర్స్‌ విజయం 

Oct 8 2022 11:12 AM | Updated on Oct 8 2022 1:54 PM

ISL 2022: Kerala Blasters beat East Bengal FC by 3-1 in season opener - Sakshi

కొచ్చి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో గత సీజన్‌ రన్నరప్‌ కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌ 3–1 గోల్స్‌ తేడాతో ఈస్ట్‌ బెంగాల్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) జట్టును ఓడించింది. కేరళ తరఫున ఇవాన్‌ కలియుజినీ (82వ, 89వ ని.లో) రెండు గోల్స్‌ సాధించగా ... అడ్రియన్‌ లూనా (72వ ని.లో) ఒక గోల్‌ చేశాడు. ఈస్ట్‌ బెంగాల్‌ జట్టుకు అలెక్స్‌ లీమా (88వ ని.లో) ఏకైక గోల్‌ అందించాడు. బెంగళూరులో నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీతో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ ఎఫ్‌సీ ఆడుతుంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement