East Bengal club
-
23 ఏళ్ల తర్వాత మళ్లీ చాంపియన్‌గా.. రికార్డుస్థాయిలో
కోల్‌కతా: ఆసియాలోనే అతి పురాతనమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్‌ను మోహన్ బగాన్ సూపర్ జెయింట్ క్లబ్ జట్టు రికార్డుస్థాయిలో 17వ సారి సొంతం చేసుకుంది. ఫైనల్లో మోహన్ బగాన్ క్లబ్ 1–0తో ఈస్ట్ బెంగాల్ క్లబ్‌ను ఓడించి 23 ఏళ్ల తర్వాత ఈ టోర్నీలో మళ్లీ చాంపియన్‌గా నిలిచింది. ఆట 71వ నిమిషంలో పెట్రాటోస్ చేసిన గోల్‌తో మోహన్ బగాన్ క్లబ్ గెలిచింది. 135 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో మోహన్ బగాన్, ఈస్ట్ బెంగాల్ జట్లు 16 సార్లు చొప్పున విజేతగా నిలిచి అత్యధికసార్లు టైటిల్ నెగ్గిన జట్టుగా సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే తాజా టైటిల్‌తో మోహన్ బగాన్ టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. -
ISL 2022: కేరళ బ్లాస్టర్స్ విజయం
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో గత సీజన్ రన్నరప్ కేరళ బ్లాస్టర్స్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 3–1 గోల్స్ తేడాతో ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టును ఓడించింది. కేరళ తరఫున ఇవాన్ కలియుజినీ (82వ, 89వ ని.లో) రెండు గోల్స్ సాధించగా ... అడ్రియన్ లూనా (72వ ని.లో) ఒక గోల్ చేశాడు. ఈస్ట్ బెంగాల్ జట్టుకు అలెక్స్ లీమా (88వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. బెంగళూరులో నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్‌సీ ఆడుతుంది. -
ISL 2022: నేటినుంచి ఐఎస్ఎల్–9
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీకి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ బరిలోకి దిగుతుండగా...నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడుతుంది. ఆదివారం హైదరాబాద్ తమ తొలి పోరులో ముంబై సిటీ జట్టును ఎదుర్కొంటుంది. గత రెండు సీజన్లు కరోనా కారణంగా ఐఎస్ఎల్ మ్యాచ్‌లు గోవాకే పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు 11 టీమ్‌లకు కూడా సొంత వేదికల్లో, ప్రత్యర్థి వేదికల్లో (హోం అండ్ అవే) మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పిస్తుండటం విశేషం. అభిమానులను కూడా ఆయా స్టేడియాల్లో అనుమతిస్తున్నారు. ప్రధానంగా వారాంతాల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ సీజన్ కొనసాగనుంది. లీగ్ దశలో టాప్–2లో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్స్ ద్వారా మరో రెండు స్థానాలను నిర్ణయిస్తారు. -
తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ తగిలి యువ ఆటగాడి హఠాన్మరణం
కోల్‌కతా: ఆటలోనూ ఎప్పుడు ఏ పరిణామం జరిగిందో చెప్పడం కష్టం. పేదింటి బిడ్డ. ఆటను నమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అలాంటి ఆటగాడి జీవితాన్ని విధి వెక్కిరించింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగాల్ ఫుట్‌బాల్ యువ కెరటం దేబోజ్యోతి ఘోష్(25) మ్యాచ్ మధ్యలో గాయపడి.. ఆపై గుండె పోటుతో కన్నుమూశాడు. ఈ హాఠాత్ పరిణామంతో తోటి ఆటగాళ్లంతా కన్నీరుమున్నీరు అయ్యారు. శనివారం దుబులియా బెల్పుకూర్ గ్రౌండ్లో నబాబ్ద్వీప్ సేవక్ సమితి, కృష్ణానగర్ సెంట్రల్ మధ్య జరిగిన ఫుట్‌బాల్ టోర్నమెంట్ మ్యాచ్‌లో ఘోష్ పాల్గొన్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో దేబోజ్యోతి ఫుట్‌బాల్ బలంగా తాకింది. దీంతో అతడు స్పృహ కోల్పోయి కుప్పకూలాడు. వెంటనే మ్యాచ్ నిర్వహకులు అతడిని స్ధానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా వాంతులు చేసుకున్న అతన్ని.. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కృష్ణానగర్ షక్రిగఢ్ ఆస్పత్రికి తరలించారు. కానీ, ఈ లోపే అతను కన్నుమూశాడు. గుండెపోటుతోనే అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దేబోజ్యోతికి బెంగాల్ ఫుట్‌బాల్ సంచలనంగా ఓ పేరుంది. పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఆ కుటుంబానికి అతనే ఆసరా కూడా. గతంలో సంతోష్ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అదే విధంగా గత ఏడాది కలకత్తా ఫుట్‌బాల్ లీగ్‌లో రైల్వేస్ తరుపున దేబోజ్యోతి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇందుగానూ.. ఈస్ట్ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్ అధికారులు ‘కెనడియన్ ఫుట్‌బాల్ లీగ్-2022’ కోసం అతడిని ఎంపికచేశారు. ఈలోపే అతని జీవితం విషాదంగా ముగిసింది. చదవండి: IPL 2022: ఐపీఎల్ అభిమానులకు బిగ్ షాక్.. ఇక కష్టమే! -
ఈస్ట్ బెంగాల్ క్లబ్ లో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా
బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా ఈస్ట్ బెంగాల్ క్లబ్ లో చేరారు. వీరిద్దరికీ శుక్రవారం జీవితకాల సభ్యత్వం ఇచ్చారు. అక్షయ్, సోనాక్షి ఇద్దరూ సాకర్ అభిమానులు. ముందస్తు శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకుగాను నగరానికి వచ్చిన బాలీవుడ్ తారలు ఈస్ట్ బెంగాల్ క్లబ్ ను సందర్శించి ఆటగాళ్లతో ముచ్చటించారు. తమకు జీవిత కాల సభ్యత్వం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు అక్షయ్ కుమార్ చెప్పారు. ఈస్ట్ బెంగాల్ క్లబ్ శనివారం సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించే స్టార్ నైట్ కార్యక్రమంలో అక్షయ్, సోనాక్షి పాల్గొంటారు. 2020 నాటికి బెంగాల్ క్లబ్ వందేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా ముందస్తు ఉత్సవాలు నిర్వహిస్తోంది.