కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీకి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ బరిలోకి దిగుతుండగా...నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడుతుంది. ఆదివారం హైదరాబాద్ తమ తొలి పోరులో ముంబై సిటీ జట్టును ఎదుర్కొంటుంది. గత రెండు సీజన్లు కరోనా కారణంగా ఐఎస్‌ఎల్ మ్యాచ్‌లు గోవాకే పరిమితమయ్యాయి.
అయితే ఇప్పుడు 11 టీమ్‌లకు కూడా సొంత వేదికల్లో, ప్రత్యర్థి వేదికల్లో (హోం అండ్ అవే) మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పిస్తుండటం విశేషం. అభిమానులను కూడా ఆయా స్టేడియాల్లో అనుమతిస్తున్నారు. ప్రధానంగా వారాంతాల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ సీజన్ కొనసాగనుంది. లీగ్ దశలో టాప్–2లో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్స్ ద్వారా మరో రెండు స్థానాలను నిర్ణయిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment