Indian Super League football tournament
-
ISL 2022: నేటినుంచి ఐఎస్ఎల్–9
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీకి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ బరిలోకి దిగుతుండగా...నేడు జరిగే తొలి మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడుతుంది. ఆదివారం హైదరాబాద్ తమ తొలి పోరులో ముంబై సిటీ జట్టును ఎదుర్కొంటుంది. గత రెండు సీజన్లు కరోనా కారణంగా ఐఎస్ఎల్ మ్యాచ్‌లు గోవాకే పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు 11 టీమ్‌లకు కూడా సొంత వేదికల్లో, ప్రత్యర్థి వేదికల్లో (హోం అండ్ అవే) మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పిస్తుండటం విశేషం. అభిమానులను కూడా ఆయా స్టేడియాల్లో అనుమతిస్తున్నారు. ప్రధానంగా వారాంతాల్లోనే మ్యాచ్‌లు నిర్వహిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఈ సీజన్ కొనసాగనుంది. లీగ్ దశలో టాప్–2లో నిలిచిన రెండు జట్లు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ప్లే ఆఫ్స్ ద్వారా మరో రెండు స్థానాలను నిర్ణయిస్తారు. -
Indian Super League 2021: పరాజయంతో మొదలు
బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ తాజా సీజన్‌ను హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) ఓటమితో ఆరంభించింది. ఇక్కడి జీఎంసీ అథ్లెటిక్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 0–1 గోల్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీ చేతిలో పరాజయంపాలైంది. చెన్నైయిన్ తరఫున వ్లాగిమిర్ కొమన్ (66వ నిమిషంలో) పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ను హైదరాబాద్ జట్టు దూకుడుగా ఆరంభించింది. ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదిస్తూ చెన్నైయిన్ ‘డి’ బాక్స్‌లోకి పదే పదే చొచ్చుకొచ్చింది. అయితే గోల్ చేయడంలో మాత్రం సఫలం కాలేదు. చెన్నైయిన్ గోల్ కీపర్ విశాల్ కెయిత్ హైదరాబాద్ దాడులను సమర్థంగా అడ్డుకున్నాడు. అదే క్రమంలో గోల్ చేసే అవకాశాలను హైదరాబాద్ ఆటగాడు ఒగ్బెచె జారవిడిచాడు. అదే సమయంలో చెన్నైయిన్ పూర్తి రక్షణాత్మకంగా ఆడటంతో తొలి అర్ధ భాగం గోల్ లేకుండానే ముగిసింది. రెండో అర్ధ భాగంలో చెన్నైయిన్ జట్టుకు అదృష్టం కలిసొచ్చింది. హైదరాబాద్ ‘డి’ బాక్స్‌లో ఆ జట్టు ఆటగాడు హితేశ్ శర్మ ప్రత్యర్థి ప్లేయర్ అనిరుధ్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడంతో రిఫరీ చెన్నైయిన్ జట్టుకు పెనాల్టీని కేటాయించాడు. ఇక్కడ ఎటువంటి పొరపాటు చేయని కొమన్ పెనాల్టీని గోల్‌గా మలిచి జట్టుకు 1–0 ఆధిక్యాన్నిచ్చాడు. అనంతరం గోల్ కోసం హైదరాబాద్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. -
సూపర్ ఫుట్‌బాల్
కళ్లు చెదిరే ఫ్రీ కిక్‌లు... కళాత్మకమైన పాస్‌లు... మతి పోగొట్టే హెడర్స్... ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే డిఫెండర్ల విన్యాసాలు... వెరసి ప్రేక్షకుల్ని అలరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సిద్ధమైంది. కరోనా నేపథ్యంలో కట్టు బాట్ల నడుమ బుడగలో కాలికి, బంతికి జరిగే ఈ పోరాటంలో గెలిచేందుకు 11 జట్లు రె‘ఢీ’ అయ్యాయి... మనల్ని ఉత్సాహపరిచేందుకు ఫుట్‌బాల్ పండుగను తీసుకొచ్చాయి. పనాజీ: నాలుగు నెలల పాటు భారత ఫుట్‌బాల్ అభిమానులను అలరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) వచ్చేసింది. నేడు కేరళ బ్లాస్టర్స్, ఏటీకే మోహన్ బగాన్ మ్యాచ్‌తో ఏడో సీజన్‌కు తెర లేవనుంది. కరోనా విరామం అనంతరం దేశంలో జరగనున్న తొలి క్రీడా ఈవెంట్ ఇదే కావడం విశేషం. దాంతో టోర్నీని ఒకే చోట నిర్వహించడానికి సిద్ధమైన లీగ్ నిర్వాహకులు... అందుకోసం గోవాను ఎంచుకున్నారు. అక్కడే ‘బయో సెక్యూర్ బబుల్’ను ఏర్పాటు చేశారు. మొత్తం మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. క్వారంటైన్ నిబంధనలు ఉండటంతో టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు నెల రోజులు ముందుగానే గోవాకు చేరుకున్నారు. ఇక టైటిల్ కోసం పోటీ పడే జట్ల సంఖ్య ఈ సారి పెరిగింది. లీగ్‌లోకి కొత్తగా స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ వచ్చి చేరడంతో... జట్ల సంఖ్య 11కు చేరింది. టైటిల్ ఫేవరెట్లుగా డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్, మాజీ చాంపియన్ బెంగళూరు ఎఫ్‌సీ కనిపిస్తున్నాయి. తమ తొలి సీజన్ (2019–20)లో అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన కనబరచని హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ)... ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది. ఇందుకోసం స్పెయిన్‌కు చెందిన మాన్యుయెల్ మార్కజ్‌ను తమ హెడ్ కోచ్‌గా కూడా నియమించింది. గత సీజన్లో హైదరాబాద్ ఎఫ్‌సీ... రెండు విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన జరిగే ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీ ఫైనల్స్ జరుగుతాయి. కరోనా ఉండటంతో ఈ సారి ఇంటా, బయట పద్ధతిలో కాకుండా ఒకే చోట సెమీస్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు లీగ్ తొలి అంచె మ్యాచ్ తేదీలను మాత్రమే నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్లో రెండో అంచె పోటీలతో పాటు సెమీస్, ఫైనల్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. సబ్స్టిట్యూట్ల సంఖ్య పెరిగింది కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ‘ఐదుగురు సబ్‌స్టిట్యూట్’ నిబంధన ఐఎస్ఎల్లో కొనసాగనుంది. దాంతో మ్యాచ్ మధ్యలో ఒక జట్టు గరిష్టంగా ఐదుగురు సబ్స్టిట్యూట్లను ఆడించవచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే వీరిని బరిలోకి దించాలి. అంతేకాకుండా సబ్‌స్టిట్యూట్ బెంచ్‌ను ఏడుగురి నుంచి తొమ్మిదికి పెంచారు. హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు: గోల్ కీపర్లు: లాల్బియాక్లువా జోంగ్టే, లక్ష్మీకాంత్, మానస్ దూబే, సుబ్రతా పాల్. డిఫెండర్లు: ఆకాశ్ మిశ్రా, ఆశిష్ రాయ్, చింగ్లెన్సనా సింగ్, డింపిల్ భగత్, కిన్‌సైలాంగ్ ఖోంగ్సిట్, నిఖిల్ ప్రభు, ఒడి ఒనైందియా, సాహిల్ పన్వార్. మిడ్ ఫీల్డర్లు: అభిషేక్ హల్దార్, ఆదిల్ ఖాన్, సాహిల్ తవోరా, హలిచరన్ నర్జారీ, హితేశ్ శర్మ, జావో విక్టోర్, లల్దాన్‌మవియా రాల్టే, లూయిస్ సస్ట్రే, మార్క్ జొతాన్‌పుయా, మొహమ్మద్ యాసిర్, నిఖిల్ పూజారి, సౌవిక్ చక్రవర్తి, స్వీడెన్ ఫెర్నాండెస్. ఫార్వర్డ్స్: సాంటాన, సాండ్రెజ్, ఇషాన్ డే, జోల్ చియానీస్, లాలాంపుయా, లిస్టన్ కొలాకో, రోహిత్ దను, హెడ్ కోచ్: మాన్యుయెల్ మార్కజ్. -
కోల్‌కతాకే ఐఎస్ఎల్ కిరీటం
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ చరిత్రలో అట్లెటికో డి కోల్‌కతా జట్టు చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఆరో సీజన్ ఫైనల్లో కోల్‌కతా 3–1 గోల్స్ తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. దాంతో ఐఎస్ఎల్ టైటిల్‌ను అత్యధికంగా మూడుసార్లు గెలిచిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు ఆరు సీజన్లు జరగ్గా... అందులో కోల్‌కతా (2014, 2016, 2019–20), చెన్నైయిన్ రెండు సార్లు (2015, 2017–18), బెంగళూరు ఒకసారి (2018–19) విజేతలుగా నిలిచాయి. ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో నిర్వహించిన ఫైనల్లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కోల్‌కతా అందివచ్చిన ఏ అవకాశాన్ని వదల్లేదు. కోల్‌కతా ప్లేయర్ జావీ (10వ, 90+3వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... గార్సియా (48వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. చెన్నైయిన్ తరఫున వాల్‌స్కీస్ (69వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. రెండో అర్ధభాగంలో చెన్నైయిన్ ప్లేయర్లు గోల్ కోసం చేసిన ప్రయత్నాలను కోల్‌కతా గోల్ కీపర్ అరిందామ్ భట్టాచార్య సమర్థవంతంగా అడ్డుకున్నాడు. సీజన్ చాంపియన్ కోల్‌కతాకు రూ. 8 కోట్లు... రన్నరప్ చెన్నైయిన్ రూ. 4 కోట్లు ప్రైజ్‌మనీగా లభించాయి. 15 గోల్స్ సాధించిన చెన్నైయిన్ ఆటగాడు వాల్‌స్కీస్‌కు ‘గోల్డెన్ బూట్’ అవార్డు దక్కింది. గోల్డెన్ గ్లవ్ అవార్డును బెంగళూరు ఎఫ్‌సీ గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు గెల్చుకున్నాడు. ఎమర్జింగ్ ప్లేయర్ సుమీత్ (కోల్‌కతా)... ‘హీరో ఆఫ్ ద లీగ్’గా హ్యూగో బౌమౌస్ (గోవా ఎఫ్‌సీ) నిలిచారు. -
జంషెడ్పూర్ ఎఫ్‌సీపై పుణే సిటీ విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో జంషెడ్పూర్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో పుణే ఎఫ్‌సీ 1–0తో విజయం సాధించింది. ఆదిల్ ఖాన్ (30వ ని.) గోల్ సాధించి ఆ జట్టుకు విజయాన్నందించాడు. మరో మ్యాచ్‌లో ముంబై సిటీ 1–0తో చెన్నయిన్ ఎఫ్‌సీపై గెలుపొందింది. ముంబై తరఫున అచిలె ఎమనా (60వ ని.) ఓ గోల్ చేసి జట్టును గెలిపించాడు. గురువారం జరగనున్న మ్యాచ్‌లో పుణే సిటీతో బెంగళూరు ఎఫ్‌సీ జట్టు తలపడనుంది. -
బెంగళూరు ఎఫ్‌సీ శుభారంభం
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ నాలుగో సీజన్లో తొలిసారి బరిలోకి దిగిన బెంగళూరు ఎఫ్‌సీ జట్టు విజయంతో బోణీ చేసింది. బెంగళూరులో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 2–0తో ముంబై ఎఫ్‌సీపై విజయం సాధించింది. బెంగళూరు తరఫున భారత కెప్టెన్ సునీల్ చెత్రి (90వ ని.లో), ఎడువార్డో మార్టిన్ (67వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. మరోవైపు చెన్నైలో జరిగిన మరో మ్యాచ్‌లో గోవా ఎఫ్‌సీ 3–2తో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టును ఓడించింది. -
చెన్నై, కోల్‌కతా మ్యాచ్ డ్రా
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ ఎఫ్‌సీ, అట్లెటికో డి కోల్‌కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1 స్కోరుతో డ్రా అయింది. అట్లెటికో తరఫున హెల్డెర్ పోస్టిగా (39వ ని.) గోల్ చేయగా, చెన్నైయిన్‌కు డేవిడ్ సుకి (77వ ని.) గోల్ సాధించి పెట్టాడు. తాజా ఫలితంతో కోల్‌కతా 15 పారుుంట్లతో మూడో స్థానంలో... చెన్నైరుున్ 14 పారుుంట్లతో ఆరో స్థానంలో నిలిచారుు. -
కేరళతో పుణే మ్యాచ్ ‘డ్రా’
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పుణే ఎఫ్‌సీ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. కేరళ బ్లాస్టర్స్‌తో సోమవారం జరిగిన మ్యా చ్‌ను పుణే జట్టు 1-1తో ‘డ్రా’గా ముగించిం ది. ఆట మూడో నిమిషంలోనే హెంగ్బార్ట్ గోల్‌తో కేరళ బ్లాస్టర్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 68వ నిమిషంలో సిస్సోకో గోల్‌తో పుణే స్కోరును 1-1తో సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి. ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కేరళ బ్లాస్టర్స్ ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో ఉం డగా... నాలుగు మ్యాచ్‌లు ఆడిన పుణే నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్‌తో ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడుతుంది. -
కొచ్చి ఫ్రాంచైజీ దక్కించుకున్న సచిన్
ముంబై: క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ... ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్(ఐఎస్ఎల్)లో ఫ్రాంచైజీలు దక్కించుకున్నారు. పీవీపీ వెంచర్స్‌తో కలిసి కొచ్చి జట్టును సచిన్ కొనుగోలు చేశాడు. స్పెయిన్ లీగ్ దిగ్గజం అట్లెటికొ మాడ్రిడ్, వ్యాపారవేత్తలు హర్షవర్థన్ నియోటియా, సంజీవ్ గోయంకా కలిసి కన్సర్టియంగా ఏర్పడిన గంగూలీ.. కోల్‌కతా ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, జాన్ అబ్రహం, రణ్‌బీర్ కపూర్ కూడా ఐఎస్ఎల్ ఫ్రాంచైజీలు దక్కించుకున్నారు. పుణే జట్టును సల్మాన్ ఖాన్, గువాహటి టీమ్‌ను జాన్ అబ్రహం, ముంబై ఫ్రాంచైజీని రణ్‌బీర్ కపూర్ వేలంలో దక్కించుకున్నారు. ఢిల్లీ జట్టును సమీర్ మాంచంద, బెంగళూరు టీమ్‌ను సన్ గ్రూపు, గోవా జట్టును వేణుగోపాల్ దూత్ కన్సర్టియం దక్కించుకున్నాయి. సెప్టెంబర్-నవంబర్‌లో ఐఎస్ఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.