
కేరళతో పుణే మ్యాచ్ ‘డ్రా’
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో పుణే ఎఫ్‌సీ తొలి ‘డ్రా’ నమోదు చేసుకుంది. కేరళ బ్లాస్టర్స్‌తో సోమవారం జరిగిన మ్యా చ్‌ను పుణే జట్టు 1-1తో ‘డ్రా’గా ముగించిం ది. ఆట మూడో నిమిషంలోనే హెంగ్‌బార్ట్ గోల్‌తో కేరళ బ్లాస్టర్స్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 68వ నిమిషంలో సిస్‌సోకో గోల్‌తో పుణే స్కోరును 1-1తో సమం చేసింది.
ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ కోసం ప్రయత్నించినా సఫలం కాలేకపోయాయి. ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న కేరళ బ్లాస్టర్స్ ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో ఉం డగా... నాలుగు మ్యాచ్‌లు ఆడిన పుణే నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్‌తో ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడుతుంది.