ఈస్ట్ బెంగాల్ క్లబ్ లో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా | Akshay Kumar, Sonakshi Sinha made life members of East Bengal club | Sakshi
Sakshi News home page

ఈస్ట్ బెంగాల్ క్లబ్ లో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా

Published Fri, Dec 20 2013 10:38 PM | Last Updated on Sat, Sep 2 2017 1:48 AM

ఈస్ట్ బెంగాల్ క్లబ్ లో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా

ఈస్ట్ బెంగాల్ క్లబ్ లో అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా

బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా ఈస్ట్ బెంగాల్ క్లబ్ లో చేరారు. వీరిద్దరికీ శుక్రవారం జీవితకాల సభ్యత్వం ఇచ్చారు.  అక్షయ్, సోనాక్షి ఇద్దరూ సాకర్ అభిమానులు.

ముందస్తు శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకుగాను నగరానికి వచ్చిన బాలీవుడ్ తారలు ఈస్ట్ బెంగాల్ క్లబ్ ను సందర్శించి ఆటగాళ్లతో ముచ్చటించారు. తమకు జీవిత కాల సభ్యత్వం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు అక్షయ్ కుమార్ చెప్పారు. ఈస్ట్ బెంగాల్ క్లబ్ శనివారం సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించే స్టార్ నైట్ కార్యక్రమంలో అక్షయ్, సోనాక్షి పాల్గొంటారు. 2020 నాటికి బెంగాల్ క్లబ్ వందేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇందులో భాగంగా ప్రతి ఏటా ముందస్తు ఉత్సవాలు నిర్వహిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement