నిర్మాతల పాలిట విలన్లు! | Bollywood celebrities and their demands | Sakshi
Sakshi News home page

నిర్మాతల పాలిట విలన్లు!

Published Wed, Mar 16 2016 8:58 AM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

నిర్మాతల పాలిట విలన్లు!

నిర్మాతల పాలిట విలన్లు!

తెర మీద హీరో హీరోయిన్లుగా కనిపించే చాలా మంది స్టార్లు నిర్మాతల పాలిట మాత్రం విలన్లుగా మారుతున్నారు. ఇన్నాళ్లు హీరోయిన్లు మాత్రమే తమ డిమాండ్లతో ఇబ్బంది పెడతారన్న పేరున్నా.. ఇప్పుడు హీరోలు కూడా ఈ లిస్ట్లో చేరిపోతున్నారు. కొంత మంది బాలీవుడ్ స్టార్లయితే తమ తోడు వచ్చే మనుషుల నుంచి హాలిడేస్ వరకు అన్ని విషయాల్లోనూ పట్టుపట్టి మరీ పంతం నెగ్గించుకుంటున్నారు.

బాలీవుడ్ బెబో కరీనా కపూర్ కెరీర్ స్టార్టింగ్ నుంచే ఇలాంటి కండిషన్లు పెడుతూ చాలా సినిమాలను వదులుకుంది. కపూర్ల కుటుంబం నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలినాళ్ల నుంచే చిన్న హీరోలతో సినిమాలు చేయనంటూ మడికట్టుకు కూర్చుంది. దీంతో సక్సెస్ఫుల్ సినిమాలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. అయినా ఇప్పటికే అదే కండిషన్తో నిర్మాలకు షాక్ ఇస్తోంది బెబో.

బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ హీరోగా పేరున్న అక్షయ్ కుమార్ కూడా తన కండిషన్స్తో అప్పుడప్పుడు నిర్మాతలను ఇబ్బంది పెడుతున్నాడు. సినిమా షూటింగ్ ఏ దశలో ఉన్నా.. ఆదివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేసేది లేదంటూ తెగేసి చెబుతున్నాడు అక్షయ్. మామూలు షూటింగ్ సమయంలో పరవాలేదు గానీ, రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న సమయంలో మాత్రం అక్షయ్ కండిషన్ నిర్మాతలకు ఇబ్బందికరంగా మారుతోంది.

మ్యాన్లీ హంక్ హృతిక్ పెడుతున్న కండిషన్ మరింత వింతగా ఉంది. తన షూటింగ్ ఎక్కడ జరుగుతున్నా తనతో పాటు తన వంటమనిషి కూడా రావాలని చెబుతున్నాడీ సూపర్ హీరో. అంతేకాదు అవుట్ డోర్ షూటింగ్లో ఉన్నప్పుడు కూడా తనకు అధునాతన సౌకర్యాలు ఉన్న జిమ్ ఏర్పాటు చేయాల్సిందేనని పట్టుపడుతున్నాడు.

స్టార్ వారసురాలు సోనాక్షి కూడా నిర్మాతలకు సవాలక్ష కండిషన్లు పెడుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో ఎక్స్పోజింగ్, లిప్ లాక్ సీన్స్ కామన్ అయిపోయినా.., సోనాక్షి మాత్రం అలాంటి సన్నివేశాలకు దూరం అంటుందట. ఎట్టి పరిస్థితుల్లోనూ లిప్ కిస్కు అంగీకరించేది లేదని ముందే చెప్పేస్తోంది ఈ బ్యూటీ. వీళ్లే కాదు దాదాపు అందరూ స్టార్లు తమ కోరికలతో నిర్మాతలకు చుక్కులు చూపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement