ఆకాశ వీధుల్లో గగన విహారులుగా మారిన స్టార్స్‌ | Some of the pictures made as Air Force backdrop movies | Sakshi
Sakshi News home page

ఆకాశ వీధుల్లో గగన విహారులుగా మారిన స్టార్స్‌

Published Sun, Apr 9 2023 1:50 AM | Last Updated on Sun, Apr 9 2023 11:06 AM

Some of the pictures made as Air Force backdrop movies - Sakshi

నేల మీద సాగే కథలను మనం వెండితెరపై చాలానే చూశాం.. చూస్తున్నాం. నింగి నేపథ్యంలో సాగే కథలు అరుదుగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో కొన్ని సినిమాల కథలు ఆకాశంలో తిరుగుతున్నాయి. ప్రేక్షకులను అలరించేందుకు ఆకాశ వీధుల్లో గగన విహారులుగా మారిన స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌కుమార్‌ నటించిన ‘ఎయిర్‌లిఫ్ట్‌’, ‘బేబీ’ వంటి సినిమాల్లో విమానంలో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను  ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లనున్న  ‘స్కై ఫోర్స్‌’లో అక్షయ్‌ కుమార్‌ పైలట్‌గా నటించనున్నారు. అక్షయ్‌ కుమార్‌ హీరోగా దినేష్‌ విజన్‌ నిర్మాతగా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాతో సందీప్‌ కెల్వానీ, అభిషేక్‌ కపూర్‌లు దర్శకులుగా పరిచయం కానున్నారనే టాక్‌ బాలీవుడ్‌లో వినిపిస్తోంది.

అలాగే ఎయిర్‌ డెక్కన్‌  వ్యవస్థాపకులు కెప్టెన్‌ జీఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా సూర్య హీరోగా నటించిన చిత్రం ‘శూరరై పో ట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) హిందీ రీమేక్‌లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొన్ని ఎయిర్‌ఫోర్స్‌ సీన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. ఒరిజినల్‌ తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సుధా కొంగరనే హిందీ వెర్షన్‌కూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సహ నిర్మాతగా ఉన్న సూర్య, ఇందులో ఓ గెస్ట్‌ రోల్‌ చేయడం విశేషం. 

♦ ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌’, ‘వార్‌’ వంటి హిట్‌ ఫిల్మ్స్‌ తర్వాత బాలీవుడ్‌ హ్యాండ్‌సమ్‌ హీరో హృతిక్‌ రోషన్, దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ కాంబినేషన్‌లో రూపొం దుతున్న సినిమా ‘ఫైటర్‌’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, డింపుల్‌ క΄ాడియా, అనిల్‌ కపూర్‌ కీ రోల్స్‌ చేస్తున్నారు. దాదాపు యాభై శాతానికిపైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌ జెట్‌ పైలట్‌గా నటిస్తున్నారని సమాచారం. జ్యోతీ దేశ్‌΄ాండే, అజిత్‌ అంధరే, మమతా ఆనంద్, రామన్, అంకు ΄ాండే, సిద్ధార్థ్‌ ఆనంద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 25న విడుదల కానుంది.

♦ పూర్తిగా ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొం దుతున్న  సినిమా ‘ది క్రూ’. ఎయిర్‌లైన్‌ సెక్టార్‌లో ఉద్యోగాలు చేసే ముగ్గురు మహిళల జీవితాల ఆధారంగా రాజేష్‌ కృష్ణన్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టబు, కరీనా కపూర్, కృతీ సనన్‌ లీడ్‌ రోల్స్‌ చేస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఆల్రెడీ మొదలైంది. కాగా ఏక్తా కపూర్, రేఖా కపూర్‌ 
నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. ‘‘ఎయిర్‌లైన్‌ ఇండస్ట్రీలో పని చేసే ముగ్గురు మహిళలు ఊహించని ఘటనలు జరిగినప్పుడు ఎలా రియాక్టయ్యారు? అనే అంశాలను వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

♦ ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫీసర్‌గా ముంబైకి వెళ్తున్నారు హీరో వరుణ్‌ తేజ్‌. శక్తి ప్రతాప్‌ సింగ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాతో హీరోయిన్‌ మానుషీ చిల్లర్‌ తెలుగుకి వస్తున్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ పైలట్‌గా కనిపించనున్నారు.  తెలుగు, హిందీ భాషల్లో సోనీ పిక్చర్స్‌ ఇంటర్‌ నేషనల్‌ప్రొడక్షన్స్‌ సహకారంతో నందకుమార్‌ అబ్బినేని, సందీప్‌ ముద్దా నిర్మిస్తున్నారు. ఇవే కాదు... మరికొన్ని బాలీవుడ్‌ చిత్రాలు ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొం దుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement