వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలి హిందీ చిత్రానికి ‘ఆపరేషన్ వాలెంటైన్’ టైటిల్ ఖరారు చేశారు. అంతేకాదు.. ఈ మూవీని డిసెంబర్ 8 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా, రాడార్ ఆఫీసర్ పాత్రలో మానుషి చిల్లర్ నటిస్తున్నారు.
సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. ‘‘వాస్తవ ఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలను చూపే యాక్షన్ మూవీ ఇది. శక్తి ప్రతాప్ సింగ్, అమిర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ ఈ చిత్రకథ రాశారు. హిందీ, తెలుగులో రూపొందిస్తున్నాం’’ అని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నందకుమార్ అబ్బినేని.
ఆపరేషన్ డేట్ ఫిక్స్
Published Tue, Aug 15 2023 1:22 AM | Last Updated on Tue, Aug 15 2023 1:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment