ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అపశ్రుతి.. చూస్తుండగానే కుప్పకూలింది | Over 200 Injured Gallery Collapses Live Football Match Malappuram Kerala | Sakshi
Sakshi News home page

Viral Video: ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అపశ్రుతి.. చూస్తుండగానే కుప్పకూలింది

Mar 20 2022 1:51 PM | Updated on Mar 20 2022 2:09 PM

Over 200 Injured Gallery Collapses Live Football Match Malappuram Kerala - Sakshi

కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్‌ జరుగుతుండగానే ఒక్కసారిగా ప్రేక్షకుల గ్యాలరీ కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మలప్పురం జిల్లాలోని పూంగోడ్‌లో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. కేరళలో ఆల్ ఇండియా సెవెన్స్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి పూంగోడ్‌లోని ఎల్‌పీ స్కూల్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో ప్రేక్షకులు పోటెత్తారు.

సామర్థ్యానికి మించి రావడంతో మైదానంలోని గ్యాలరీలు నిండిపోయాయి. అయితే ప్రేక్షకులు మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఒకవైపు ఉన్న గ్యాలరీ కుప్పకూలిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ఏకంగా 8వేల మంది హాజరైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: Nicholas Pooran: 'ఒక్క సీజన్‌ మాత్రమే చెత్తగా ఆడాను.. నేనేంటో చూపిస్తా'

బీర్‌ బాటిల్‌తో మ్యాచ్‌ రిఫరీ తల పలగొట్టాడు.. అంతటితో ఊరుకోకుండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement