వైరల్‌ : వారెవ్వా! క్యా గోల్‌ హై.. | Kerala Boy Scores Lionel Messi Like Free Kick Became Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌ : అచ్చం మెస్సీని దింపేశాడు..

Published Thu, May 7 2020 10:51 AM | Last Updated on Thu, May 7 2020 12:04 PM

Kerala Boy Scores Lionel Messi Like Free Kick Became Viral - Sakshi

తిరువనంతపురం : ఫుట్‌బాల్‌ ఆట తెలిసినవారికి లియోనెల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జెంటీనాకు చెందిన మెస్సీ ప్రపంచంలో అత్యంత పాపులర్‌ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. క్రిస్టియానో రొనాల్డొ, బెక్‌హమ్‌, రొనాల్డినో లాంటి ఆటగాళ్లతో పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నాడు. ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో  ఫ్రీకిక్‌ను మెస్సీ  వాడుకున్నంతగా ఎవరు వాడుకోరనే చెప్పాలి. ఎందుకంటే ఫ్రీకిక్‌లో పుట్‌బాల్‌ను తన్నాడంటే బంతి వెళ్లి గోల్‌పోస్ట్‌లో పడాల్సిందే. ఆ విషయంలో అతని టైమింగ్‌ అంత కచ్చితంగా ఉంటుంది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. (కిచెన్‌లో గోడలు లేని బాత్రూం.. నెటిజన్లు ఫైర్)

కేరళకు చెందిన 12 ఏళ్ల కుర్రాడు ఒక వీడియోలో అచ్చం మెస్సీని దించేశాడు. ఆ వీడియోలో మెస్సీ జెర్సీ నెంబర్‌ 10ని ధరించి అచ్చం మెస్సీలా నిలబడి బంతిని దగ్గరకు తెచ్చుకొని తన చేత్తో హెయిర్‌ నిమురుకున్నాడు. తర్వాత బంతిని తన్నగానే ఎదురుగా ఉన్న గోల్‌కోస్ట్‌కు ఏర్పాటు చేసిన టైర్‌ మద్యలో నుంచి బంతి వెళ్లింది.అనంతరం ఆ కుర్రాడు అచ్చం మెస్సీలా మొకాళ్ల మీద నిల్చుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.  ఈ వీడియోనూ కేరళకు చెందిన ఆల్‌ కేరళ  సెవెన్స్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశంలో మరో మెస్సీ పుట్టాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.  52 ఏళ్ల మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 697 గోల్స్‌ చేశాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement