Arjentina
-
సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!
సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మాజీ మోడల్ సిల్వినా లూనా కన్నుమూసింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. 79 రోజుల పాటు పోరాడి తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఆమె వయస్సు 43 ఏళ్లు కాగా.. గతంలో ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది వికటించి తీవ్ర అనారోగ్యానికి దారి తీసినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) సర్జరీ వల్ల మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమె జూన్‌లో ఆస్పత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆగస్టు 31నే ఆమె చనిపోగా ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. కాగా.. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానలు షాక్‌కు గురయ్యారు. సిల్వినా మృతి పట్ల పలువురు అర్జంటీనా నటీనటులు సంతాపం తెలిపారు. (ఇది చదవండి: దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే? ) -
Hockey World Cup 2023: భారత్ 9వ స్థానంతో ముగింపు
భువనేశ్వర్: సొంతగడ్డపై జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్ హాకీలో క్వార్టర్ ఫైనల్ కూడా చేరలేక నిరాశపరిచిన భారత జట్టు చివరకు విజయంతో మెగా టోర్నీని ముగించింది. శనివారం 9 నుంచి 12వ స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 5–2తో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. అయితే మరో మ్యాచ్‌లో అర్జెంటీనా 6–0 స్కోరు తేడాతో వేల్స్‌ను చిత్తు చేయడంతో భారత్, అర్జెంటీనాలు సంయుక్తంగా 9వ స్థానంలో నిలిచాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున అభిషేక్ (4వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (11వ ని.), షంషేర్ సింగ్ (44వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (48వ ని.), సుఖ్జీత్ సింగ్ (58వ ని.) తలా ఒక గోల్ చేశారు. సఫారీ జట్టులో సంకెలొ ఎంవింబి (48వ ని.), ముస్తఫా కాసిమ్ (59వ ని.) చెరో గోల్ చేశారు. ఆట ఆరంభమైన నాలుగో నిమిషంలోనే అభిషేక్ ఫీల్డ్‌గోల్‌తో భారత్‌కు శుభారంభమిచ్చాడు. ఈ క్వార్టర్‌లోనే హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2–0తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. ఇదే స్కోరుతో తొలి అర్ధభాగాన్ని (రెండు క్వార్టర్లు) ముగించిన భారత్ ఆఖరి క్వార్టర్లో మరో రెండు ఫీల్డ్ గోల్స్‌ను ఆకాశ్‌దీప్, సుఖ్జీత్ సాధించడంతో విజయం సులువైంది. ► నేడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల ఫైనల్ ► జొకోవిచ్ ( సెర్బియా) X సిట్సిపాస్ ( గ్రీస్) ► మ.గం. 2 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం -
హాకీ ప్రపంచకప్ చాంపియన్ అర్జెంటీనా.. కాంస్య పతక పోరులో భారత హాకీ జట్టుకు నిరాశ..
భువనేశ్వర్: సొంతగడ్డపై జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో కనీసం కాంస్య పతకమైనా సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. మూడో స్థానం కోసం ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఫ్రాన్స్ ఆటగాడు క్లెమెంట్ టిమోతి హ్యాట్రిక్ గోల్స్ (26, 34, 47వ నిమిషాల్లో)తో భారత్‌కు చెక్ పెట్టాడు. టీమిండియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సుదీప్ (42వ నిమిషంలో) సాధించాడు. చాంపియన్ అర్జెంటీనా టైటిల్ పోరులో ఆరుసార్లు చాంపియన్ జర్మనీకి అర్జెంటీనా షాక్ ఇచ్చింది. ఫైనల్లో అర్జెంటీనా 4–2 తో జర్మనీపై గెలిచింది. జూనియర్ ప్రపంచకప్‌ను అర్జెంటీనా గెలవడం ఇది రెండోసారి. 2005లో తొలిసారి అర్జెంటీనా విజేతగా నిలిచింది. చదవండి: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే.. -
ఎనిమిదేళ్ల తర్వాత ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్..
రోటర్‌డామ్: ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్ జట్టు అర్హత పొందింది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నార్వే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచింది. తద్వారా గ్రూప్ ‘జి’లో నెదర్లాండ్స్ 23 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి 2022 ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. మరోవైపు మాజీ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 0–0తో ‘డ్రా’ చేసుకుంది. పది జట్లున్న గ్రూప్‌లో 29 పాయింట్లతో అర్జెంటీనా రెండో స్థానంలో నిలిచి మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చదవండి: IND Vs NZ: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్, రాహుల్ జోడి.. -
వైరల్ : వారెవ్వా! క్యా గోల్ హై..
తిరువనంతపురం : ఫుట్‌బాల్ ఆట తెలిసినవారికి లియోనెల్ మెస్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జెంటీనాకు చెందిన మెస్సీ ప్రపంచంలో అత్యంత పాపులర్ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. క్రిస్టియానో రొనాల్డొ, బెక్‌హమ్, రొనాల్డినో లాంటి ఆటగాళ్లతో పోటీ పడుతూ తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్నాడు. ముఖ్యంగా ఫుట్‌బాల్‌లో ఫ్రీకిక్‌ను మెస్సీ వాడుకున్నంతగా ఎవరు వాడుకోరనే చెప్పాలి. ఎందుకంటే ఫ్రీకిక్లో పుట్‌బాల్‌ను తన్నాడంటే బంతి వెళ్లి గోల్‌పోస్ట్‌లో పడాల్సిందే. ఆ విషయంలో అతని టైమింగ్ అంత కచ్చితంగా ఉంటుంది. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. (కిచెన్‌లో గోడలు లేని బాత్రూం.. నెటిజన్లు ఫైర్) కేరళకు చెందిన 12 ఏళ్ల కుర్రాడు ఒక వీడియోలో అచ్చం మెస్సీని దించేశాడు. ఆ వీడియోలో మెస్సీ జెర్సీ నెంబర్ 10ని ధరించి అచ్చం మెస్సీలా నిలబడి బంతిని దగ్గరకు తెచ్చుకొని తన చేత్తో హెయిర్ నిమురుకున్నాడు. తర్వాత బంతిని తన్నగానే ఎదురుగా ఉన్న గోల్కోస్ట్కు ఏర్పాటు చేసిన టైర్ మద్యలో నుంచి బంతి వెళ్లింది.అనంతరం ఆ కుర్రాడు అచ్చం మెస్సీలా మొకాళ్ల మీద నిల్చుని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ వీడియోనూ కేరళకు చెందిన ఆల్ కేరళ సెవెన్స్ ఫుట్‌బాల్ అసోసియేషన్ తన ఫేస్బుక్ పేజీలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. భారతదేశంలో మరో మెస్సీ పుట్టాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 52 ఏళ్ల మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్లో 697 గోల్స్ చేశాడు. -
జీ20 సదస్సుకు ప్రధాని మోదీ
బ్యూనస్ ఎయిర్స్: జీ–20 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ఎయిర్స్ చేరుకున్నారు. నేడు, రేపు జరిగే ఈ సమ్మిట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్సహా పలువురు నేతలు పాల్గొననున్నారు. వచ్చే పదేళ్లలో ప్రపంచం ఎదుర్కోనున్న సవాళ్లు, వాటిని ఎదుర్కొనే మార్గాలపై వివిధ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలతో కలిసి మోదీ చర్చించనున్నారు. వచ్చే 48 గంటల్లో ఆయన జీ–20 సమ్మిట్‌తోపాటు ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చల్లో మోదీ పాలుపంచుకుంటారని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు. -
ఫిఫా ఫీవర్: వీడియో వైరల్
ఫుట్‌బాల్ ప్రపంచకప్. ఇది ఓ ఆట... ఒక మెగా ఈవెంట్... ఇది ఒక ఫీవర్. ఖండాంతరాలను దాటే వైరల్. ఆడటానికి 32 జట్లు... కదంతొక్కే స్ట్రయికర్ల గోల్స్‌తో జగమంతటిని ఓ ఫుట్‌బాల్ కుటుంబంగా మార్చే క్రీడ. ప్రస్తుతం ఇదే ఫీవర్‌లో అభిమానులు మునిగి తేలుతూ ప్రతీ మ్యాచ్‌ను ఆస్వాదిస్తుంటే, పారిస్‌కు చెందిన ఒక వ్యక్తి పిల్లర్‌పై నిల్చుని ఫుట్‌బాల్‌తో ఆడేసుకుంటూ అభిమానులకు కనువిందు చేయడం స్టార్ ప్లేయర్లకు సవాల్ విసిరినట్లుగా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. -
ఫిఫా ఫీవర్: పిల్లర్‌పై నిల్చుని
-
‘ఫిఫా’లో భారత బాలిక అరుదైన ఘనత
సెయింట్ పీటర్స్బర్గ్: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భారత బాలిక నథానియా జాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అధికారిక మ్యాచ్ బాల్ క్యారియర్ (ఓఎంబీసీ)గా వ్యవహరించిన తొలి భారత బాలికగా నథానియా చరిత్ర సృష్టించింది. ఫిఫా కప్‌లో భాగంగా శుక్రవారం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో బ్రెజిల్- కోస్టారికాల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌కు నథానియా ‘బాల్‌గర్ల్’గా వ్యవహరించింది. మాజీ చాంపియన్, ఈసారి వరల్డ్‌కప్ టైటిల్ రేసులో ఒకటైన మేటి జట్టు బ్రెజిల్‌ను సగర్వంగా మైదానంలోకి తోడ్కొని వచ్చింది. తమిళనాడులోని నీలగిరికి చెందిన నథానియా స్వతహాగా ఫుట్‌బాలర్. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలోగల రిషి వ్యాలీ స్కూల్ లో ఆమె ఆరో తరగతి చదువుతోంది. ఫిఫా స్పాన్సర్ కియా మోటార్స్ నిర్వహించిన దేశవ్యాప్త పోటీలో నెగ్గిన నథానియా ఈ గౌరవం దక్కించుకుంది. తనకు దక్కిన గౌరవంపై నథానియా సంతోషం వ్యక్తం చేసింది. ఆమెతో పాటు కర్ణాటకకు చెందిన 10 ఏళ్ల రిషీ తేజ్ కూడా బాల్‌బాయ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 64 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేస్తే మన దేశం నుంచి వీళ్లిద్దరూ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
మెస్సీ భార్య పోస్ట్‌పై విమర్శలు..!
నిజ్నీ నొవొగొరొడ్: ఫిఫా ప్రపంచకప్‌లో లియనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా.. క్రొయేషియా చేతిలో దారుణంగా ఓడిపోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. గురువారం రాత్రి క్రొయేషియా 3-0తో అర్జెంటీనాను మట్టికరిపించిన తర్వాత మెస్సీపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు...ఇప్పుడు అతని భార్య అంటోనెల్లా రోకుజ్జోను సైతం వదల్లేదు. ఇందుకు కారణం అంటోనెల్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేయడమే. క్రొయేషియాతో మ్యాచ్‌కు ముందు వోమెస్‌పాపి(గోడాడీ) అనే క్యాప్షన్‌ను జోడించిన అంటోనెల్లా తన మూడేళ్ల కుమారుడితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్యాలో జరిగే ప్రపంచకప్‌కు హాజరుకాని అంటోనెల్లా.. ఇన్స్టాగ్రామ్ ద్వారా భర్తకు చీర్స్ తెలిపింది. అయితే క్రొయేషియాతో మ్యాచ్‌లో అర్జెంటీనా ఘోరంగా వైఫల్యం చెందిన క్రమంలో మెస్సీ భార్య పోస్ట్‌పై విమర్శలు సెటైర్లు గుప్పిస్తున్నారు. ఆ క్యాప్షన్‌ను ఉద్దేశిస్తూ.. ‘ మీ నాన్న ఒక లూజర్’ అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, త్వరలోనే మీ ‘పాపి’(నాన్న) స్వదేశానికి వచ్చేస్తాడులే’ అని మరో నెటిజన్ చమత్కరించాడు. ‘టోర్నీ నుంచి నిష్క్రమించడానికి అర్జెంటీనా చాలా దగ్గరలో ఉంది.. మెస్సీ ఇంటిలో కూర్చొని మ్యాచ్‌లు చూడొచ్చు’ అని మరొక అభిమాని విమర్శించాడు. ఇదిలా ఉంచితే, నైజీరియాతో జరిగే తదుపరి మ్యాచ్‌లో మెస్సీ రాణిస్తాడని పలువురు మద్దతుగా నిలిచారు. -
ఫిఫా ప్రపంచకప్: అర్జెంటీనాకు షాక్
నిజ్నీ నొవొగొరొడ్: ఫిఫా ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్లలో ఒకటైన అర్జెంటీనాకు షాక్ తగిలింది. గ్రూప్ డిలో భాగంగా క్రొయేషియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా చిత్తుగా ఓడిపోయింది. క్రొయేషియాకు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన మెస్సీ అండ్ గ్యాంగ్ 0-3తో ఓటమి పాలైంది. క్రొయేషియా పోటీ పడి గోల్స్ చేయగా మెస్సీ సేన ఒక్క గోల్ కూడా నమోదు చేయలేక చతికిలబడింది. ప్రధానంగా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ ఈ మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఓటమితో అర్జెంటీనా నాకౌట్ ఆశలు సంక్లిష్టం చేసుకుంది. ఇరు జట్లు ప్రథమార్థంలో గోల్స్ చేయడంలో విఫలమైతే, ద్వితీయార్థం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకే అంటీ రెబిక్ క్రొయేషియాకు తొలి గోల్‌ను అందించాడు. అనంతరం అర్జెంటీనా-క్రొయేషియాలు గోల్ కోసం తీవ్రంగా శ్రమించాయి. కాగా, ఆట 80వ నిమిషంలో క్రొయెషియా ఆటగాడు బ్రొజోవిక్ అందించిన సహకారంతో లుకా మాడ్రిక్ అద్భుత గోల్ అందించాడు. దీంతో 2-0తో ఆధిక్యంలోకి వచ్చిన క్రొయేషియా ప్రత్యర్థి అర్జెంటీనాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే గోల్ పోస్ట్‌పై దాడి చేసినా క్రొయేషియా రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయారు. ఎక్సట్రా ఇంజూరి టైమ్ (90+1)లో ఇవాన్ రాకిటిక్ క్రొయేషియాకు మూడో గోల్ అందించాడు. ఇక ఆట ముగిసేసరికి మరో గోల్ నమోదు కాకపోవడంతో క్రొయేషియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అరెంటీనా 14 అనవసర తప్పిదాలు చేయగా, క్రొయేషియా 19 తప్పిదాలు చేసింది. అర్జెంటీనా గోల్ పోస్ట్‌పై ఏడు సార్లు దాడి చేయగా, క్రొయేషియా తొమ్మిది సార్లు దాడి చేసింది. ఈ మ్యాచ్‌లో నలుగురు క్రొయేషియా ఆటగాళ్లకు, ముగ్గురు అర్జెంటీనా ఆటగాళ్లుకు రిఫరీలు ఎల్లో కార్డు చూపించారు. రికార్డులు.. ప్రపంచకప్‌లో క్రొయేషియా చేతిలో 1998లో ఏకైకసారి ఆడి ఓడిపోయిన అర్జెంటీనాకు ఈసారి ఏదీ కలిసిరాలేదు. తొలి మ్యాచ్‌లో 1-1తో ఐస్‌లాండ్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్న అర్జెంటీనా.. సాకర్ ప్రపంచకప్‌లో లీగ్‌లో ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవకపోవటం 44 సంవత్సరాల తర్వాత ఇదే కావడం విశేషం. ఫుట్‌బాల్ సంగ్రామంలో ఓటమి పరంగా 1958లో ఛెకోస్లోవేకియాపై 1-6 తేడాతో ఓటమి తర్వాత రెండో అతి పెద్ద ఓటమి కావడం గమనార్హం. ఇక నాకౌట్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలంటే జూన్26న నైజీరియాతో జరిగే మ్యాచ్‌లో అర్జెంటీనా తప్పక గెలవాల్సిన పరిస్థితి. -
నిరాశపరిచిన మెస్సీ.. మ్యాచ్ డ్రా
మాస్కో : టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లోనే నిరాశపర్చింది. గ్రూప్ డిలో భాగంగా అర్జెంటీనా, ఐలాండ్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. అందివచ్చిన పలు పెనాల్టీ కిక్‌లను గోల్‌గా మలచటంలో అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ పూర్తిగా విఫలమయ్యాడు. మరో వైపు ఐలాండ్ గోల్‌కీపర్ హానెస్ హాల్డోరసన్ కళ్లు చెదిరే రీతిలో డైవ్లతో అర్జెంటీనా మరో గోల్ చేయకుండా అడ్డుకున్నాడు. మ్యాచ్ ప్రారంభమైన 19వ నిమిషంలో కున్ అగురో గోల్ చేసి అర్జెంటీనాకు తొలి గోల్ అందించాడు. ఈ ఆనందం ఎంతో సేపు నిలువలేదు, 23వ నిమిషంలో ఫిన్బోగ్సన్ ఐలాండ్‌కు గోల్ అందించి స్కోర్ సమం చేశాడు. ప్రథమార్ధం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. అనంతరం ద్వితీయార్దంలో మరింత దూకుడు ప్రదర్శించినా గోల్ సాధించండంలో మాత్రం అర్జెంటీనా విఫలమైంది. పదేపదే వచ్చిన అవకాశాలను అర్జెంటీనా ఆటగాళ్లు, ముఖ్యంగా స్టార్ ఫుట్‌బాలర్ మెస్సీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో బంతి పూర్తిగా అర్జెంటీనా ఆధీనంలో ఉంది. అర్జెంటీనా చేసిన ఏడు గోల్ ప్రయత్నాలను ఐలాండ్ గోల్ కీపర్ విజయవంతంగా అడ్డుకున్నాడు. అంతేకాక అర్జెంటీనాకు వచ్చిన 15 ఫ్రీకిక్లను ఉపయోగించుకోవడంలో విఫలం అయింది. ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 4 అనవసర తప్పిదాలు చేయగా, ఐలాండ్ 9 తప్పిదాలు చేసింది. -
ఫుట్‌బాల్ ప్రపంచ కప్: సెమీస్‌లో అర్టెంటీనా
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2014లో టైటిల్ ఫేవరెట్ అర్టెంటీనా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్స్‌లో అర్టెంటీనా 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. అర్జెంటీనా ఆటగాడు హిగైన్ గోల్ కొట్టాడు. కాగా బెల్జియం బోణీ కొట్టలేకపోయింది.