రోటర్‌డామ్: ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు నెదర్లాండ్స్ జట్టు అర్హత పొందింది. యూరోపియన్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నార్వే జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 2–0తో గెలిచింది. తద్వారా గ్రూప్ ‘జి’లో నెదర్లాండ్స్ 23 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచి 2022 ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది.
మరోవైపు మాజీ చాంపియన్ అర్జెంటీనా దక్షిణ అమెరికా జోన్ నుంచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. బ్రెజిల్‌తో జరిగిన మ్యాచ్‌ను అర్జెంటీనా 0–0తో ‘డ్రా’ చేసుకుంది. పది జట్లున్న గ్రూప్‌లో 29 పాయింట్లతో అర్జెంటీనా రెండో స్థానంలో నిలిచి మరో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
చదవండి: IND Vs NZ: టీ20ల్లో అరుదైన రికార్డు సాధించిన రోహిత్, రాహుల్ జోడి..
Comments
Please login to add a commentAdd a comment