సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి! | Sakshi
Sakshi News home page

Silvina Luna: సర్జరీ ఎఫెక్ట్‌.. చికిత్స పొందుతూ నటి కన్నుమూత!

Published Sat, Sep 2 2023 6:38 PM

Actress Silvina Luna Dies At 43 After Botched Brazilian Butt Lift Surgery - Sakshi

సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మాజీ మోడల్ సిల్వినా లూనా కన్నుమూసింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. 79 రోజుల పాటు పోరాడి తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఆమె వయస్సు 43 ఏళ్లు కాగా.. గతంలో ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది వికటించి తీవ్ర అనారోగ్యానికి దారి తీసినట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!)

సర్జరీ వల్ల మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమె జూన్‌లో ఆస్పత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది.  ఆగస్టు 31నే ఆమె చనిపోగా ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. కాగా.. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానలు షాక్‌కు గురయ్యారు. సిల్వినా మృతి పట్ల పలువురు అర్జంటీనా నటీనటులు సంతాపం తెలిపారు. 

(ఇది చదవండి: దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే? )

Advertisement
 
Advertisement
 
Advertisement