cosmotic surgeries
-
సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!
సినిమా ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అర్జెంటీనాకు చెందిన ప్రముఖ నటి, మాజీ మోడల్ సిల్వినా లూనా కన్నుమూసింది. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. 79 రోజుల పాటు పోరాడి తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఆమె వయస్సు 43 ఏళ్లు కాగా.. గతంలో ఆమె కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే అది వికటించి తీవ్ర అనారోగ్యానికి దారి తీసినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!) సర్జరీ వల్ల మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆమె జూన్‌లో ఆస్పత్రిలో చేరింది. వెంటిలేటర్‌పై చికిత్స అందించినా ప్రయోజనం లేకపోయింది. ఆగస్టు 31నే ఆమె చనిపోగా ఈ విషయం ఆలస్యంగా బయటకొచ్చింది. కాగా.. సిల్వినా లూనా అర్జెంటీనా టీవీ పరిశ్రమలో నటిగా, యాంకర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానలు షాక్‌కు గురయ్యారు. సిల్వినా మృతి పట్ల పలువురు అర్జంటీనా నటీనటులు సంతాపం తెలిపారు. (ఇది చదవండి: దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే? ) -
ఆమెలా ఉంటేనే గుర్తింపా?.. ఈమెకిది పునర్జన్మే!
అందంగా ముస్తాబు కావాలని, స్టయిల్‌గా ఉండాలనే తాపత్రయం ఎవరికి ఉండదు!. అయితే.. ఉన్నదాంతో సరిపెట్టుకునేవాళ్లు కొందరు.. రెట్టింపు చేయాలన్న ఆరాటంతో నానా ప్రయత్నాలు చేసేవాళ్లు మరికొందరు. కానీ, ఇక్కడ ఓ యువతి అలాంటి ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. 12 ఏళ్లుగా.. ఏకంగా 40 కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంది. ఒళ్లు హునం అయినా భరించింది. మన కరెన్సీలో నాలుగున్నర కోట్లు రూపాయల పైనే ఖర్చు చేసింది. చివరికి.. తత్వం బోధపడి తన రూపం తిరిగి కావాలంటూ మళ్లీ సర్జరీలు చేయించుకుంటోంది. అమెరికన్ సోషల్ ఫిగర్, సెల్ఫ్ మేడ్ బిలియనీర్ కిమ్ కర్దాషియన్‌లా మారాలని ఓ యువతి కలలు కనింది. కానీ, అదంతా పైపై మెరుగులే అని గుర్తించేందుకు పదేళ్లు పైనే పట్టింది. ఆమె పేరు జెన్నిఫర్ పాంపలోనా(29). సొంత దేశం బ్రెజిల్. ఇటలీ టాప్ కంపెనీ వర్సేస్లో మోడల్‌గా పని చేసేది. కాలేజీ రోజుల్లో.. మంచి చదువుతో పాటు వృత్తిలోనూ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ఉమెన్గా రాణించాలనుకుంది. కానీ, కిమ్ కర్దాషియన్‌లా ఉంటేనే తనకూ గుర్తింపు ఉంటుందని గుడ్డిగా నమ్మింది. అందుకే ఆమెలా మారిపోవాలని ఫిక్స్ అయ్యింది. ఆనందమే.. పదిహేడేళ్ల వయసులోనే తొలి సర్జరీకి వెళ్లింది పాంపలోనా. ఎందుకంటే.. ఆ టైంకే కర్దాషియన్‌కు పేరుప్రఖ్యాతులు దక్కాయి కాబట్టి. కిమ్‌లా బాడీ షేప్స్ రావాలని సర్జరీలతో ఒళ్లు హూనం చేసుకుంది. పెదాలు, వక్షోజాలు, పిరుదులు.. ఇలా శరీర సౌష్టవాన్ని మార్చే సర్జరీలన్నీ చేయించుకుంది. నెమ్మనెమ్మదిగా.. కిమ్ కర్దాషియన్‌లా ఉందంటూ ఆమెకు పేరు కూడా దక్కడం మొదలైంది. మోడలింగ్‌లో బోలెడు అవకాశాలు దక్కాయి. ఇంకోవైపు సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ పెరుగుకుంటూ వెళ్తున్నారు. సర్జరీల కోసం ఆరు లక్షల అమెరికన్ డాలర్లు(నాలుగున్నర కోట్ల రూపాయలపైనే) కానీ.. కిమ్ కర్దాషియన్(ఎడమ), జెన్నిఫర్ పాంపలోనా(కుడి) అంతా ఆమెకు అనుకూలంగా సాగితే ఎలా?. పోనుపోనూ ఆమెకు పరిస్థితి అర్థం అయ్యింది. సహజత్వం కోల్పోయింది ఆమె శరీరం. తన శరీరం తన అదుపు తప్పిందని గుర్తించింది. సర్జరీలకు అలవాటు పడిపోయి.. సైడ్ ఎఫెక్ట్స్ చూపించడం మొదలైంది. పరిస్థితి అర్థం చేసుకున్న పాంపలోనా.. ఎలాగైనా తన మునుపటి రూపం వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. మళ్లీ ఖర్చు చేసి.. ఇస్తాంబుల్‌లో ఓ ఫిజీషియన్‌ను కలిసి.. తన మునుపటి రూపానికి తీసుకురావాలని కోరింది. ఒకేసారి మొత్తం ఆపరేషన్లు చేయించుకుంది. గదిలోకి ఒకలా వెళ్లిన ఆమె.. మరోలా బయటకు వచ్చింది. డీట్రాన్సిషన్ కోసం దాదాపు మన కరెన్సీలో కోటి రూపాయాల దాకా ఖర్చు చేసింది. తన రూపం తిరిగి రాబోతున్నందుకు ఇప్పుడు సంతోషంగా ఉందామె. జెన్నిఫర్ పాంపలాకు.. ఇప్పుడు తనలో తాను మధన పడాల్సిన అవసరం లేదు. జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది. జీవితమంటే పరిపూర్ణం కాదు. ఎంతో కొంత లోపాలు ఉంటాయి. ఆ లోపాలను స్వీకరిస్తూ ముందకు సాగాలి. విజయ తీరాలను అందుకోవాలి. అంతేగానీ.. సహజ విరుద్దమైన పనులు చేయకూడదనే గుణపాఠం నేర్చిందట. అందుకే సర్జీలకు వెళ్లడం మంచిద కాదని మోడల్స్‌కు సలహా ఇస్తోంది. సర్జరీల వైపు మొగ్గుచూపే వాళ్ల కోసం ‘అడిక్షన్.. ఎబోట్ ది డేంజరస్ ఆఫ్ ది ఆపరేషన్స్’ పేరిట తీసే డాక్యుమెంటరీలో ఆమె నటిస్తోంది. తన మునుపటి రూపం తిరిగి వస్తుండడాన్ని పునర్జన్మగా అభివర్ణిస్తోంది ఆ మోడల్. అంతేకాదు.. డీట్రాన్సిషన్ సెల్ఫీలను సోషల్ మీడియాలో సంతోషంగా పోస్ట్ చేస్తోంది కూడా. -
సినీ పరిశ్రమలో మరో విషాదం, టీవీ నటి మృతి
Kannada Serial Actress Death Today: చిత్ర పరిశ్రమలో వరుస మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ టీవీ నటి చేతనా రాజ్(21) మృతి చెందారు. కాస్మోటిక్ సర్జరీ వికటించడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం(మే 16) బెంగళూరులోని శెట్టి కాస్మోటిక్ ఆస్పత్రిలో ఆమె ఫ్యాట్ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతానా ఇబ్బంది పడ్డారట. చదవండి: లాక్డౌన్లో రూ. 3వేల కోసం థియేటర్లో పనిచేశా: స్టార్ హీరో మాజీ భార్య దీంతో డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్లో ఐసీయూ లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్‌లోని కడే ఆసుపత్రికి ఆమె తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే చేతనా మరణించినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. అంతే కాదు... చేతనా రాజ్‌ను తీసుకొచ్చిన వైద్యుడు ఒకరు తమ వైద్యులను బెదిరించినట్టు కడే హాస్పిటల్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చేతనా రాజ్ కన్నడలో పలు టీవీ షోలు, సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు పొందారు. ఆమె మరణవార్త తెలిసి కన్నడ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటినటులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా ఆమె నివాళులు అర్పిస్తున్నారు. God has given you a wonderful body. Just to be glamorous why change it and kill your self never mess with nature #chethanaraj — ಶ್ರೇಯಸ್ ಮೇಟಿಕುರ್ಕೆ (@shreyasms) May 17, 2022 -
Hyderabad: ఖరీదైన కాస్మొటిక్ సర్జరీ ఇక ఉస్మానియాలో కూడా..
సాక్షి, అఫ్జల్‌గంజ్(హైదరాబాద్): కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఖరీదైన కాస్మొటిక్ సర్జరీని ఉస్మానియా వైద్యులు ఉచితంగా నిర్వహించి సత్తా చాటుకున్నారు. ఈ మేరకు గురువారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండు నాయక్ వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలానికి చెందిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినికి కుడివైపు రొమ్ము పెరగకపోవడంతో ఆగస్టులో వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చారు. అమ్మాయికి వైద్యులు ఓపీ ద్వారా చికిత్స అందించి మళ్లీ రావాల్సిందిగా సూచించారు. అనంతరం ఈ నెల మొదటి తేదీన ఆస్పత్రికి రాగా అదేరోజు ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మి నేతృత్వంలో డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్, డాక్టర్ అశ్వన్ కిషోర్, డాక్టర్ ఫయాజ్, డాక్టర్ విజయ్ బాబు, డాక్టర్ మధులిక, డాక్టర్ అజయ్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ పాండూ నాయక్ నేతృత్వంలోని డాక్టర్ పావని, డాక్టర్ అనుపమ, డాక్టర్ ఆనంద్ బృందం దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి ఆగ్మెంటేషన్ మమోప్లాస్టీ శస్త్ర చికిత్సను సిలికాన్ ఇన్‌ప్లాంట్, ఫ్యాట్ గ్రాఫ్టింగ్‌ను అమర్చి పూర్తి చేశామన్నారు. శస్త్ర చికిత్స జరిగి పదిహేను రోజులు గడిచిందని, ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉందని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇలాంటి శస్త్ర చికిత్సకు దాదాపు 5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, ఉస్మానియాలో అన్నో అభివృద్ది పనులు జరుగుతూ పేదలకు మరింత మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. రోగులు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోతున్నారని, ఉస్మానియా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చదవండి: రాజు మృతి: సింగరేణి ఊపిరి పీల్చుకుంది -
హీరోయిన్ ఫోటో షేర్ చేసి బుక్కయింది..
టెహ్రాన్ : ఈ మధ్య ఫోటోలనూ మార్ఫింగ్ చేసి సోషల్‌మీడియాలో షేర్ చేయడం వైరల్‌గా మారింది. తాజాగా ఇరాన్‌కు చెందిన సహార్ తబర్ అనే మహిళ ఏకంగా కాస్మొటిక్ సర్జరీ ద్వారా హాలీవుడ్ నటి ఎంజెలీనా జోలీని పోలిన విధంగా తన ముఖాన్ని మార్చుకున్నారు. అంతేగాక ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి కటకటాలపాలయ్యారు. ఈ ఘటన ఇరాన్ దేశంలోని టెహ్రాన్ నగరంలో చోటు చేసుకుంది. సాంస్కృతిక, సామాజిక, నైతిక విలువలకు భంగం కలిగించిదన్న ఆరోపణలపై సహార్ తబర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ వెల్లడించింది. అంతేగాక తప్పుడు దారిలో ఆదాయ మార్గాన్ని ఏంచుకొన్నందుకు, హింసను ప్రోత్సహిస్తున్నందుకు గానూ ఇరాన్ సైబర్‌క్రైమ్ ఆమె మీద కేసులు నమోదుచేసినట్లు పేర్కొంది. సహర్ తబర్ గతేడాది వరుస ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చుకున్న ముఖ చిత్రాలను వరుసగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి బాగా పాపులర్ అయ్యారు. తాజాగా కాస్మెటిక్ సర్జరీ ద్వారా ఆమె తన ముఖాన్ని ఎంజెలినా జోలి స్పూకీ వెర్షన్‌గా మార్చుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్లు తెలిసింది. కాగా, ఇరాన్లో ఒక్క ఇన్స్టాగ్రామ్ తప్ప మిగతా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్బుక్, ట్విటర్లను నిషేదించడం విశేషం. -
ఓ సెల్ఫీ ఖరీదు.. రూ. 80 వేలు!
సెల్ఫీల గొడవ ఈమధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది. అత్యాధునిక ఫీచర్లు, మంచి రిజల్యూషన్ ఉన్న ఫ్రంట్ కెమెరాలతో సెల్ఫోన్లు మార్కెట్లోకి విడుదల అవుతుండటంతో.. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో సెల్ఫీలను వీలైనంత అందంగా పోస్ట్ చేసుకోడానికి యువత నానా తంటాలు పడుతున్నారు. తాజాగా.. సెల్ఫీలు అందంగా తీసుకోవడం కోసం ఏకంగా ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయించుకుంటున్నారు. ఢిల్లీకి చెందిన సాహిల్ కమ్రా (23) ఇలాగే చేశాడు. తన ముక్కు, పెదాలకు అతగాడు రూ. 80 వేలతో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. ఇకమీదట తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో సెల్ఫీలు తీసుకోగలనని, ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసం వచ్చిందని సాహిల్ చెబుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో మనోడికి 500 మంది వరకు ఫాలోవర్లున్నారు మరి! తాను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్లు పెరిగారని, ఫేస్బుక్లో లైకులు కూడా ఇంతకుముందు కంటే ఎక్కువ వస్తున్నాయని కమ్రా ఆనందం వ్యక్తం చేశాడు. తాను రెండేళ్లలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, దానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయని అతడు అంటున్నాడు. డాక్టర్ అనూప్ ధీర్ అనే వైద్యుడు అతడికి ప్లాస్టిక్ సర్జరీ చేశారు. గడిచిన రెండేళ్లలో తన వద్దకు వచ్చే పేషెంట్ల సంఖ్య 25 శాతం పెరిగిందని ఆయన చెప్పారు. వీళ్లంతా కాస్మొటిక్ సర్జరీల కోసం వచ్చినవాళ్లే. ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ బాగా ఎక్కువ కావడం, యువత లైకుల కోసం ఆరాటపడటం వల్లే ఇలా జరుగుతోందని ఆయన చెప్పారు. అయితే.. వచ్చేవాళ్లలో మూడోవంతు మంది మాత్రమే అబ్బాయిలు.. మిగిలిన వాళ్లంతా అమ్మాయిలేనట. తన కింది పెదవి కంటే పై పెదవి పెద్దగా ఉందని, దాన్ని సరిచేస్తారా అని కూడా అడుగుతున్నారని ఆయన వాపోయారు. కొసమెరుపు: రియాల్టీ షోలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన కిమ్ కర్దాషియాన్కు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.5 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. ఇదంతా తన సెల్ఫీల పుణ్యమేనని ఆమె చెబుతోంది.