Kannada Serial Actress Chethana Raj Died Due To Cosmetic Surgery Fails - Sakshi
Sakshi News home page

Actress Chethana Raj Death: కాస్మోటిక్‌ సర్జరీ వికటించి టీవీ నటి మృతి

Published Tue, May 17 2022 11:57 AM | Last Updated on Tue, May 17 2022 1:57 PM

Kannada TV Actress Chethana Raj Died Due To Cosmetic Surgery Failes - Sakshi

Kannada Serial Actress Death Today: చిత్ర పరిశ్రమలో వరుస మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ టీవీ నటి చేతనా రాజ్‌(21) మృతి చెందారు. కాస్మోటిక్‌ సర్జరీ వికటించడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం(మే 16) బెంగళూరులోని శెట్టి కాస్మోటిక్‌ ఆస్పత్రిలో ఆమె ఫ్యాట్‌ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతానా ఇబ్బంది పడ్డారట. 

చదవండి: లాక్‌డౌన్‌లో రూ. 3వేల కోసం థియేటర్‌లో పనిచేశా: స్టార్‌ హీరో మాజీ భార్య

దీంతో డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్‌లో ఐసీయూ లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్‌లోని కడే ఆసుపత్రికి ఆమె తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే చేతనా మరణించినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. అంతే కాదు... చేతనా రాజ్‌ను తీసుకొచ్చిన వైద్యుడు ఒకరు తమ వైద్యులను బెదిరించినట్టు కడే హాస్పిటల్‌ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చేతనా రాజ్‌ కన్నడలో పలు టీవీ షోలు, సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు పొందారు. ఆమె మరణవార్త తెలిసి కన్నడ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటినటులు, సన్నిహితులు సోషల్‌ మీడియా వేదికగా ఆమె నివాళులు అర్పిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement