Kannada Actor Shivaram Passed Away At 83 Years Due To Brain Haemorrhage - Sakshi
Sakshi News home page

Shivaram Died: ప్రముఖ కన్నడ నటుడు శివరాం మృతి

Published Sat, Dec 4 2021 5:27 PM | Last Updated on Sat, Dec 4 2021 8:42 PM

Kannada Veteran Actor Shivaram Died At 83 Due To Brain Haemorrhage - Sakshi

Actor Shivaram Passed Away: సినీ పరిశ్రమంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు, డైరెక్టర్‌ శివరాం(83) కన్నుమూశారు. కొంతకాలంగా మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్‌ 30న ఇంట్లో పూజ చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వయసు రీత్యా వైద్యులు ఆయనకు సర్జరీ చేయకుండా చిక్సిత అందిస్తూ వచ్చారు.

చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్‌

ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు(డిసెంబర్‌ 4) తుదిశ్వాస విడిచారు. కాగా 6 దశాబ్ధాలుగా ఆయన వందలకు పైగా కన్నడ సినిమాలో నటించారు. కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నగరహావు, శుభమంగళ్‌ చిత్రాలతో శివరాం పాపులర్‌ అయ్యారు.

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన ఆయన పలు కన్నడ చిత్రాలతో పాటు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. హిందీలో బిగ్‌బి చిత్రాలను కూడా ఆయన నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement