shivaram
-
భార్య భోజనం వడ్డించలేదని.. తల నరికి, చర్మం ఒలిచి..!
తుంకూర్: భోజనం వడ్డించ లేదని భార్యతో తగవుపెట్టుకున్నాడు. పట్టరాని కోపంతో ఆమె తలను నరికేశాడు. అంతటితో ఆగక చర్మం ఒలి చేయడం మొదలుపెట్టాడు. తెల్లవారేదాకా ఒలుస్తూనే ఉన్నాడు. ఉదయం తాము ఉంటున్న ఇంటి యజమానికి ఈ ఘోరం వివరించాడు. దీంతో దారుణం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లా కునిగల్ తాలుకాలోని హళియూరుదుర్గ పట్టణంలో సోమవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. శివరామ, పుష్పలత(35)లకు పదేళ్ల క్రితం కులాంతర వివాహమైంది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడున్నాడు. శివరామ కోత మిల్లులో కార్మికుడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కోతమిల్లు నుంచి ఇంటికి వచ్చిన భర్తకు పుష్పలత భోజనం వడ్డించలేదు. ఇద్దరిమధ్య మొదలైన గొడవ తీవ్రమైంది. శివరామ ఆగ్రహంతో కొడవలితో భార్య తలనరికాడు. తర్వాత ఇతర అవయవాలను వేరు చేశాడు. చర్మం ఒలిచేయడం మొదలుపెట్టాడు. ఇల్లంతా రక్తపు మడుగులా మారింది. పేగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. తెల్లవారేదాకా చర్మం ఒలుస్తూనే ఉన్నాడు. కుమారుడు అటు పక్కనే నిద్రిస్తుండగానే ఇదంతా జరిగిపోయింది. ఉదయం తాము ఉంటున్న యజమానికి శివరామ విషయం తెలిపాడు. అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులొచ్చి ఈ బీభత్సాన్ని స్వయంగా చూసిన తర్వాతే దారుణం బయటకు వచ్చింది. శివరామను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరం అంగీకరించాడని తుంకూర్ ఎస్పీ అశోక్ వెంకట్ గురువారం తెలిపారు. -
ప్రవల్లిక కేసు: హెచ్ఆర్సీని ఆశ్రయించిన శివరాం కుటుంబం
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్ అభ్యర్థి ప్రవల్లిక ఆత్మహత్య తెలంగాణలో ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ప్రవల్లిక లేఖలో పేర్కొనగా.. ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రవల్లిక ఆత్మహత్యకు శివరాం రాథోడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. ఇది కూడా చదవండి: ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్? -
శివరామ్‌ను వదలొద్దు: ప్రవళిక తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్: ప్రవళిక బలవన్మరణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు. ప్రేమాపెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేశారు. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా కోస్గి మండలానికి చెందిన శివరామ్ రాథోడ్‌పై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడని, బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్టు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. మరోవైపు.. ప్రవళిక ఆత్మహత్య కేసులో కుటుంబ సభ్యులు మాట మార్చారు. గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడడంతోనే ఆత్మహత్య చేసుకుందని తొలుత చెప్పిన కుటుంబ సభ్యులు.. తాజాగా శివరామ్ రాథోడ్ వేధింపులే కారణమంటూ ఆరోపించారు. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్‌లు తాజాగా వీడియోలు విడుదల చేశారు. బిడ్డ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నామని, రాజకీయాలు చేయొద్దని తల్లి విజయ కోరుతున్నారు. శివరామ్‌ను వదిలిపెట్టొద్దని పోలీసులు కోరారు వాళ్లు. ‘‘నా బిడ్డ చావుకు కారణమయిన వాడిని కఠినంగా శిక్షించాలి. వాడు జీవితాంతం బయటకు రాకుండా జైల్లోనే పెట్టాలి. నా బిడ్డకు వచ్చిన పరిస్థితి మరే ఆడబిడ్డకు రాకూడదు. నా బిడ్డయితే ఇప్పుడు మాకు రాదు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేసుకుంటుందని భావించాం. కానీ వాడి టార్చర్ కారణంగా చనిపోయింది. అయితే ఈ రాజకీయ పార్టీలు వాళ్ల గొడవలు వాళ్లే చూసుకోవాలి. మమ్మల్ని మాత్రం మీ రాజకీయంలోకి లాగవద్దు. ఇలా చెప్పండి.. అలా చేయండనే సలహాలు ఇవ్వొద్దు. ఇప్పటికే నా బిడ్డ బతుకు ఆగం అయ్యింది. ఇప్పుడు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. మా దాక మాత్రం తీసుకొని రావొద్దు. నా బిడ్డ మరణానికి కారణమైన వాడికి తగిన శిక్ష విధించాలి. నా బిడ్డ ఎలా అయితే ఉరేసుకొని చనిపోయిందో.. అలాగే వాడికి కూడా ఉరేసి చంపాలి.. అని ఆమె చేతులెత్తి నమస్కరించారు. వరంగల్‌కు చెందిన మర్రి ప్రవళిక(23) ప్రభుత్వ ఉద్యోగం కోసం అశోక్‌నగర్‌లోని ఓ వసతిగృహంలో ఉంటూ ప్రవళిక శిక్షణ తీసుకుంది. ఈనెల 13న వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత పోలీసులు ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రాజకీయంగా ఈ ఘటన ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చింది. ఇక ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. శివరామ్ అనే యువకుడు ప్రవళికను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు తేలింది. మరో యువతితో వివాహం నిశ్చయం కావడం తెలిసి.. భరించలేకే ప్రవళిక ప్రాణం తీసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రేమ వ్యవహారం ప్రవళిక ఇంట్లోనూ తెలుసని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా శివరాంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు మృతి
Actor Shivaram Passed Away: సినీ పరిశ్రమంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు, డైరెక్టర్ శివరాం(83) కన్నుమూశారు. కొంతకాలంగా మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 30న ఇంట్లో పూజ చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వయసు రీత్యా వైద్యులు ఆయనకు సర్జరీ చేయకుండా చిక్సిత అందిస్తూ వచ్చారు. చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్ ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు(డిసెంబర్ 4) తుదిశ్వాస విడిచారు. కాగా 6 దశాబ్ధాలుగా ఆయన వందలకు పైగా కన్నడ సినిమాలో నటించారు. కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నగరహావు, శుభమంగళ్ చిత్రాలతో శివరాం పాపులర్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన పలు కన్నడ చిత్రాలతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. హిందీలో బిగ్‌బి చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. -
మా వెనుకున్నది ఆయనే: రెబల్ ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కుమారస్వామి ప్రభుత్వం పడిపోవడానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన కారణమని వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ రెబల్స్ వెనుక ఆయన హస్తం ఉందంటూ జేడీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా వారి ఆ వార్తలను నిజం చేస్తూ.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే శివరాం హెర్బర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా సిద్దరామయ్య సూచనల మేరకే నడుచుకున్నామంటూ బాంబు పేల్చారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘కర్ణాటకలో నెలకొన్న అనిశ్చితికి సిద్దరామయ్యే కారణం. పార్టీకి దూరంగా ఉండమని కొద్ది రోజుల క్రితం ఆయన మాకు చెప్పారు. కానీ ఇప్పుడు మమ్మల్నే నిందిస్తున్నారు. మేమంతా ఏకతాటిపై ఉన్నాం. అందరం కలిసే నిర్ణయం తీసుకున్నాం. మేం బీజేపీలో చేరుతున్నామనేది అబద్ధం’ అని తెలిపారు. శివరాం వ్యాఖ్యలపై కన్నడ రాజకీయాల్లో పెను దుమారం చేలరేగుతోంది. ఈ నేపథ్యంలో హెర్బర్ వ్యాఖ్యలపై సిద్దరామయ్య స్పందించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారని. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే వారికి గట్టిగా బుద్ధి చెప్తానని ట్వీట్ చేశారు. విశ్వాస పరీక్షలో ప్రభుత్వాన్ని కాపాడటానికి తనవంతు కృషి చేశానని సిద్దూ చెప్పుకొచ్చారు. కాగా కర్ణాటక సంక్షోభం అనంతరం స్థానిక నేతలపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ పతనం వెనుక సిద్దరామయ్య ఉన్నారన్న వార్తలు కాంగ్రెస్ అధిష్టానం దృషికి కూడా వెళ్లాయి. దీంతో ఆయనపై పార్టీ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ప్రభుత్వ పతనం వెనుక కాంగ్రెస్! ఇదిలావుండగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా శుక్రవారం సాయంత్రం యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలపకుండా ఉండేందుకు మరోసారి రెబల్స్‌ను బుజ్జగింజే ప్రయత్నంలో పడ్డారు జేడీఎస్, కాంగ్రెస్ నేతలు. మరోవైపు వారి రాజీనామాలపై అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో కర్ణాటక రాజకీయాల ఉత్కంఠ మరికొన్ని రోజులు సాగనున్నట్లు తెలుస్తోంది. -
పోతుల కస్సు.. దివి బుస్సు
కందుకూరు అర్బన్: కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం ఇద్దరూ ఉనికిని కాపాడుకోవడం కోసం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రామారావు కస్సుమంటే, శివరాం బుస్సు మంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆపార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జిగా దివి శివరాం రెండేళ్లపాటు కొనసాగారు. ఆ రెండేళ్లలో కార్యకర్తలను విస్మరించారని, కొంతమందినే చేరదీశారనేది ఆ పార్టీ కార్యకర్తల ఆరోపణ. ముఖ్యంగా అధికార యంత్రాంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని స్వప్రయోజనాలే ధ్యేయంగా అభివృద్ధిని పాతాళానికి తొక్కారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదీ అభివృద్ధి..? అదేవిధంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల రామారావు అభివృద్ధి పేరుతో అధికార పార్టీలో చేశారు. టీడీపీ కండువా కప్పుకొని 15 నెలలు గడుస్తున్నా నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొత్త నిధులు మంజూరు సంగతి దేవుడెరుగు కనీసం ఉన్న నిధులు కూడా సద్వినియోగం చేసుకోవడంలో విఫలం చెందారని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు మూడు నెలల క్రితం రూ.10 కోట్లకు టెండర్లు పిలవగా ఎమ్మెల్యే కాంట్రాక్ట్లర్లను పిలిచి రూ.5 కోట్లకు టెండర్లు వేసుకోవాలని, మిగిలిన 5 కోట్ల టెండర్లు తమ కార్యకర్తలకు ఇస్తామని సూచించినట్టు తెలిసింది. ఇది తెలిసిన శివరాం తన మనుషులతో టెండర్లు వేయించారు. దీంతో రామారావు ఆ టెండర్లను రద్దు చేయించారు. శివరాం అనుచరులను కూడగట్టుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆదే స్థాయిలో రామారావు కూడా తమ వర్గం జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇద్దరు బయటకు ఒకరిపై ఒకరు ప్రేమ ఒలకబోసుకుంటూనే మరో వైపు పార్టీ సమావేశాలు జరిగిన ప్రతి సారీ తమ అనుచరులతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయించుకొంటున్నారు. దీంతో కందుకూరు అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. పోర్టు సాధనలో విఫలం.. రామాయపట్నం పోర్టు వస్తే దానికి అనుబంధ పరిశ్రమలు ఏర్పడి దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. కూలీలకు ఉపాధి దొరుకుతుంది. ఇతర వ్యాపారాలు పెరుగుతాయి. దీంతో కందుకూరు ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పోర్టు ఎక్కడ ఏర్పాటు చేయాలో రాష్ట్రమే నిర్ణయించాలని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు రామాయపట్నం పోర్టు వచ్చేలాగా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాల్సింది పోయి అసలు పట్టించుకోవడంలేదనేది ప్రజల ఆరోపణ. సందిగ్ధంలో ఉద్యానవన కళాశాల.. గుడ్లూరు మండలంలో చినలాటిపి గ్రామంలో ఉద్యానవన కళాశాల ఏర్పాటు చేయాలని 235 ఎకరాల భూమి కేటాయించారు. ఈ ఏడాది నుంచి తరగతులు మొదలు కావాల్సి ఉంది. ఆరు నెలలవుతున్నా కళాశాల కమిటీ సభ్యులు మూడు సార్లు సందర్శించి వెళ్లారు. తరగతులు ప్రారంభించడానికి, విద్యార్ధులు ఉండటానికి వసతి గృహాలను, గుడ్లూరు, కందుకూరులో పరిశీలించారు. ఇప్పటికి ఎమ్మెల్యే, శివరాం చర్యలు తీసుకోలేదు. నత్తనడకన సోమశిల ఉత్తరకాలువ... సోమశిల ఉత్తకాలువ నత్తనడకన సాగుతోంది. ఈ కాలువ పూర్తయితేనే రాళ్ళపాడు ప్రాజెక్ట్ కింద ఉన్న భూమలు సస్యశ్యామలమవుతాయి. పదేళ్లుగా కా>లువ నిర్మాణం ఏ మాత్రం ముందుకు సాగడంలేదు. మూలిగేనక్కపై తాటికాయ పడినట్టు కాలవ పనులు పూర్తి కాకా నీళ్లే రాకపోతే రాళ్ళపాడు ప్రాజెక్ట్ నుంచి 1.5 టీఎంసీ నీటిని కొండాపురం మండలం చింతలదీవి వద్ద ఉన్న కామథేనువు ప్రాజెక్ట్ తరలింపునకు ప్రభుతం మంజూరు చేసినా జీవో 40 రాళ్లపాడు ప్రాజెక్టు రైతులకు కనీళ్లు తెప్పిస్తోంది. ఈ జీవో రద్దు చేయించడంలో ఇద్దరు నాయకులు విఫలం చెందారు. పత్తాలేని పార్కు... గత ప్రభుత్వంలో రామతీర్ధం జలాశయం మంచినీటి పధకం పక్కన కోటి రూపాలయ నిధులతో పార్కు పనులు మొదలు పెట్టారు అది పిల్లర్లు దశలోనే ఆగిపోయింది. పట్టణంలో చేపల మార్కెట్ సమీపంలో రూ. 50 లక్షలతో మటన్ మార్కెట్ నిర్మించాలని భూమిపూజ చేశారు. అది అంతటితోనే ఆగిపోయింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిక మించేందుకు ఓవీ రోడ్డులోని మాల్యాద్రి కాలనీ మీదుగా పామూరు ప్రశాంతి నగర్ సమీపం వరకు బైపాస్‌రోడ్డు మంజూరైంది. ఇప్పటికి అది కూడా కార్యరూపం దాల్చలేదు. -
డెంగీతో వ్యక్తి మృతి
నల్లబెల్లి: రాష్ట్రంలో డెంగ్యూ ప్రభలుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కందగట్ల శివరామ్(34) అనే వ్యక్తి డెంగీ జ్వరంతో మృతి చెందాడు. నాలుగురోజులుగా స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వైద్యానికి సుమారు రూ.2.5 లక్షల ఖర్చు అవ్వడంతో .. ఆర్థిక భారం భరించలేక హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.