చెన్నై: ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్ రెడ్డి(84) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆయన నివాసంలో మృతిచెందినట్లు ఆయన కుమారుడు త్రిపాన్ రెడ్డి శనివారం ప్రకటించాడు. కన్నడలో దాదాపు 40కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. విజయ్ రెడ్డి మరణవార్త కన్నడ పరిశ్రమకు కలచివేస్తోందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జన్మించిన ఆయన 1953లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ)
దర్శకుడు బి విఠలచార్య చిత్రం మానే తంబిండా హెన్నూకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేసిన ఆయన ఆ తర్వాత కన్నడ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన తీసిన ‘గాంధడ గుడి’, ‘నా నిన్న బిదాలారే’, ‘రంగమహాల్ రహస్య’, ‘శ్రీనివాస కళ్యాణ’, ‘సనాడి అప్పన్న’, ‘కర్ణాటక సుపుత్ర’ సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిగా ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ 1996లో నటించిన కర్ణాటక సుపత్ర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. (చదవండి: అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వను: నయన్)
Comments
Please login to add a commentAdd a comment