Vijay Reddy
-
ముచ్చటగా మూడు
తెలుగు పరిశ్రమ లోకి ‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్’ అనే నిర్మాణ సంస్థ ఎంట్రీ ఇచ్చింది. సోమవారం హైదరాబాద్‌లో మూడు సినిమాల్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు సంస్థ అధినేత విజయ్ రెడ్డి. తొలి ప్రయత్నంగా ప్రసాద్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సోషల్ వర్కర్స్’ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే మహేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మిత్ర ప్రధాన పాత్రలో మిత్ర మూవీస్ భాగస్వామ్యంతో ‘కోబలి’ని రెండో చిత్రంగా నిర్మిస్తున్నారు. మూడో మూవీగా ‘హ్యాపీ విమెన్స్ డే’ రూపొందనుంది. తొలి సీన్‌కి నటుడు బాబూ మోహన్ క్లాప్ కొట్టారు. విజయ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ ఆఫీసులను ముంబై, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రారంభించాం. ఔత్సాహిక దర్శకులు, నూతన నటీనటులు మమ్మల్ని సంప్రదించవచ్చు’’ అన్నారు. -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
చెన్నై: ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్ రెడ్డి(84) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆయన నివాసంలో మృతిచెందినట్లు ఆయన కుమారుడు త్రిపాన్ రెడ్డి శనివారం ప్రకటించాడు. కన్నడలో దాదాపు 40కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. విజయ్ రెడ్డి మరణవార్త కన్నడ పరిశ్రమకు కలచివేస్తోందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జన్మించిన ఆయన 1953లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ) దర్శకుడు బి విఠలచార్య చిత్రం మానే తంబిండా హెన్నూకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేసిన ఆయన ఆ తర్వాత కన్నడ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన తీసిన ‘గాంధడ గుడి’, ‘నా నిన్న బిదాలారే’, ‘రంగమహాల్ రహస్య’, ‘శ్రీనివాస కళ్యాణ’, ‘సనాడి అప్పన్న’, ‘కర్ణాటక సుపుత్ర’ సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిగా ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ 1996లో నటించిన కర్ణాటక సుపత్ర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. (చదవండి: అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వను: నయన్) -
అడుగడుగునా మోసం..
సంప్రదింపులతో ప్రమేయం లేకుండా సాగుతున్న ‘ఆన్లైన్’ వివాహ బంధాలు దుష్ఫలితాలు కలిగిస్తున్నాయనడానికి గజ్వేల్‌లో ఆదివారం చోటుచేసుకున్న సంఘటనే తార్కాణంగా నిలుస్తోంది. పెళ్లి ఘట్టంలో వారు వేసిన ప్రతీ అడుగులో ‘మోసం’ స్పష్టంగా బయటపడటం బాధితులను కలవరానికి గురిచేసింది. విషయం బయటపడడంతో వరుడి తల్లి అరుణ, సోదరి సహా మరో నలుగురిని పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. పరారైన వరుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. జగదేవ్‌పూర్ మండలానికి చెందిన ఓ గ్రామ యువతికి తల్లిదండ్రులు ఆన్లైన్లో పెళ్లి సంబంధాల కోసం వెతకసాగారు. 2013 డిసెంబర్ నెలలో సికింద్రాబాద్‌లోని ఆర్కే పురానికి చెందిన విజయరాజిరెడ్డిగా పేరు చెప్పుకున్న ఓ యువకుడు తాను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు. తనకు తండ్రి లేడని, తల్లితో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా చెప్పుకుంటున్న మరికొందరితో అమ్మాయి కుటుంబ సభ్యులతో పరిచయం చేసుకున్నాడు. అనంతరం రూ. 40 లక్షల కట్నం కావాలని వధువు కుటుంబ సభ్యులను కోరారు. అయితే అంత ఇచ్చుకోలేమని, చివరకు 20 తులాల బంగారం, రూ. 5 లక్షల వరకు ఇవ్వగలమని, పెళ్లి ఖర్చులు భరిస్తామని ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 19న గజ్వేల్‌లో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా వరుడి తల్లి అరుణకు రూ. 3.75 లక్షల అప్పగించారు కూడా. ఫిబ్రవరి 9న వివాహ ముహూర్తం నిర్ణయించారు. సమయానికి తీరా వరుడు పరారైన సంగతి తెల్సిందే. అడుగడుగునా మోసమే.... విజయరాజిరెడ్డిగా వరుడు తనను పరిచయం చేసుకోగా అతడి పేరు అది కాదని వధువు తరఫు బంధువులు విచారణలో బయటపడింది. 9న పెళ్లి కావాల్సి ఉండగా 8న రాత్రి వరుడి తల్లి అరుణ వధువు తండ్రికి ఫోన్ చేసి చెన్నయ్‌లో తమ బంధువులు చనిపోయారని, తామంతా అక్కడికి వెళ్లాల్సి ఉన్నందు వల్ల.. పెళ్లి వాయిదా వేసుకుందామని కోరింది. దీంతో అనుమానం వ్యక్తం చేస్తూ వధువు తరఫు బంధువులు ఆర్కే పురానికి అదే రాత్రి వెళ్లగా వారి ఇంటి వద్ద ఎలాంటి హడావుడి కనిపించలేదు. అప్పటికే వరుడు పరారయ్యాడు. వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నిక, వారి కుటుంబానికి శ్రేయెభిలాషులుగా చెప్పుకుంటున్న గౌరీశంకర్, బాలాజీ, మహేశ్వరీ, మధుసూదన్‌రెడ్డిలను ఇక్కడికి తీసుకువచ్చారు. తాళి కట్టే సమయానికి వరుడు వస్తాడని నమ్మబలికారు. కానీ పరిస్థితి భిన్నంగా మారడంతో వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వరుడు ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ అని చెప్పుకోగా అది కూడా బూటకమని తేలింది. కొన్ని ఏళ్ల కిందటి నుంచి ఆర్కే పురంలో ఉంటున్నామని వారు చెప్పుకోగా నిజానికి ఇటీవలే ఇక్కడ అద్దెకు దిగినట్లు బయటపడింది. ఆన్లైన్లో వివరాలు తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత వరుడి తల్లి అరుణ వధువు తల్లిదండ్రులతో తమ సంబంధం గురించి పూర్తి వివరాలు మీ బంధువులకు చెప్పవద్దని, చెబితే సంబంధం దెబ్బ తీయాలని చూస్తారని పదే పదే చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు. తాము ఆస్తి పరులమని, దుబాయ్, చెన్నయ్, హైదరాబాద్‌లో ఆస్తులున్నాయని నమ్మబలికి.. పెళ్లి సమయానికి ముందుగా వరుడిని పంపించి ఆ తర్వాత తామంతా పరారు కావాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అరుణ చెప్పిన మూడు అడ్రస్‌ల్లో వారి నిజమైన నివాసం ఎక్కడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. విజయరాజిరెడ్డికి గతంలో పెళ్లయ్యిందా? కాలేదా? అనే విషయంపై కూడా విచారణ సాగుతోంది. వరుడి తల్లి అరుణ ఎంటెక్ వరకు చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యాధికురాలైన ఆ మహిళ పథకం ప్రకారం పెళ్లి తంతు పేరిట డబ్బులు గుంజడానికి ప్రయత్నించిందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వీరిపై గతంలో ఏమైనా కేసులున్నాయా? అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. నిందితుల రిమాండ్, వరుడి కోసం గాలింపు.. ఈ కేసులో సోమవారం గజ్వేల్ పోలీసులు వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నిక, గౌరీశంకర్, బాలాజీ, మహేశ్వరీ, మధుసూదన్‌రెడ్డిలను రిమాండ్‌కు తరలించారు. వరుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడిని తొందర్లోనే పట్టుకుంటామని సీఐ అమృతరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
చెదిరిన ‘పెళ్లి కళ’
మొహం చాటేసిన వరుడు.. ఆగిన వివాహం గజ్వేల్, న్యూస్‌లైన్: మరికొద్ది సేపట్లో బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లి మండపంలో.. ఒక్కసారిగా విచారం అలుముకుంది. తాళి కట్టాల్సిన వరుడు మొహం చాటేశాడు. సాయంత్రం వరకు ఎదురుచూసి.. ఫలితం లేక వివాహాన్ని రద్దు చేసుకున్నారు. వధువు బంధువులు ఆందోళనలో మునిగిపోయారు. మెదక్ జిల్లా గజ్వేల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి సికింద్రాబాద్ ఆర్కే పురానికి చెందిన విజయ్‌రెడ్డితో పెళ్లి కుదిరింది. ఇతను బంజారాహిల్స్‌లోని కేఎండబ్ల్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్. వధువు తల్లిదండ్రులు భారీగానే కట్నకానుకలను సమర్పించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో పెళ్లి జరగాల్సి ఉంది. ఆనవాయితీ ప్రకారం శనివారం సాయంత్రం వరుడిని తీసుకురావడానికి వధువు తరపు బంధువులు ఆర్కేపురం వెళ్లారు. కానీ వరుడి జాడ లేదు. అప్పటికే ఇంట్లోంచి పరారయ్యాడు. ఏం చేయాలో తెలియక వరుని తల్లి అరుణ, సోదరి స్వప్న, కొందరు బంధువులను తీసుకొని ఇక్కడికి వచ్చారు. వారంతా పెళ్లి సమయానికి విజయ్‌రెడ్డి వస్తాడని నమ్మబలికారు. తాళి కట్టే సమయానికైనా రావచ్చనే ఆశతో మండపాన్ని తీర్చిదిద్దడమే కాక భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు కూడా వరుని జాడ లేదు. ఫోన్ చేసినా కలవలేదు. అతని తల్లిని, బంధువులను నిలదీస్తే తమకేం తెలియదని చేతులెత్తేశారు. వారిపై వధువు తరపు బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి సర్దిచెప్పారు. పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గజ్వేల్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. -
చెదిరిన ‘పెళ్లి కళ’
గజ్వేల్, న్యూస్‌లైన్: మరికొద్ది సేపట్లో బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లి మండపంలో.. ఒక్కసారిగా విచారం అలుముకుంది. తాళి కట్టాల్సిన వరుడు మొహం చాటేశాడు. వధువు బంధువులు వరుడి తల్లిని నిలదీయగా ఎక్కడికి వెళ్లాడో తెలియదని చేతులెత్తేసింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. సాయంత్రం వరకు వరుడి కోసం ఎదురుచూసినా ఎంతకీ రాకపోవడంతో చివరకు వివాహాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో వధువు బంధువులు విచారంలో మునిగిపోయారు. ఈ సంఘటన గజ్వేల్‌లో ఆదివారం చోటుచేసుకుంది. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి సికింద్రాబాద్ ఆర్కే పురానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ కుమారుడు విజయ్‌రెడ్డితో పెళ్లి కుదిరింది. ఇతను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేఎండబ్ల్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వివాహాన్ని పురస్కరించుకుని వధువు తల్లిదండ్రులు అతనికి భారీగానే కట్నకానుకలను సమర్పించుకున్నారు. ఆదివారం స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆనవాయితీ ప్రకారం ఆదివారం తెల్లవారుజామున వరుడిని తీసుకురావడానికి వధువు తరపు బంధువులు ఆర్కే పురానికి వెళ్లారు. కానీ అక్కడ ఒక్కసారిగా సీను మారింది. ఏం జరిగిందో తెలియదు కానీ వరుడు అప్పటికే ఆ ఇంట్లోంచి పరారయ్యాడు. దీంతో వారు ఏం చేయాలో తెలియక వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నతో మరో అమ్మాయి, కొందరు బంధువులను తీసుకొని ఇక్కడికి వచ్చారు. వారంతా పెళ్లి సమయానికి విజయ్‌రెడ్డి వస్తాడని నమ్మబలికారు. తాళి కట్టే సమయానికైనా విజయ్‌రెడ్డి రావచ్చనే ఆశతో ఇక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు. మండపాన్ని తీర్చిదిద్దడమే కాకుండా భోజనాలకు కూడా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు కూడా వరుడి జాడ లేదు. ఫోన్ చేసినా కలవలేదు. అతని తల్లిని, బంధువులను నిలదీస్తే తమకేం తెలియదని చేతులెత్తేశారు. వారిపై వధువు తరపు బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా వరుడి తరపు బంధువులపై దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన కల్యాణ మండపం వద్దకు చేరుకుని వారిని శాంతింపజేశారు. మొత్తానికి పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. గజ్వేల్ ఎస్ఐ ఆంజనేయులును వివరణ కోరగా వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
అమెరికాలో జిల్లావాసి మృతి
ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రా మానికి చెందిన రొక్కం విజయ్ రెడ్డి(28) అమెరికాలో మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. విజయ్ రెడ్డి అమెరికాలోని మిస్సోరిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేసే వారు. ఇటీవల స్వదేశానికి రాగా డిసెంబరు 19న ఆయనకు వివాహం చేయాలని పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. అదే నెల 6న విజయ్ స్వగ్రామానికి రావాల్సి ఉండగా... అంతలోనే మృతి చెందాడు.