ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామానికి చెందిన రొక్కం విజయ్ రెడ్డి(28) అమెరికాలో మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
ఆర్మూర్ అర్బన్, న్యూస్‌లైన్ : ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రా మానికి చెందిన రొక్కం విజయ్ రెడ్డి(28) అమెరికాలో మంగళవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. విజయ్ రెడ్డి అమెరికాలోని మిస్సోరిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేసే వారు. ఇటీవల స్వదేశానికి రాగా డిసెంబరు 19న ఆయనకు వివాహం చేయాలని పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. అదే నెల 6న విజయ్ స్వగ్రామానికి రావాల్సి ఉండగా... అంతలోనే మృతి చెందాడు.