
ప్రముఖ నటుడు, కన్నడ హీరో ‘దునియా’ విజయ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి రుద్రప్ప(81) కన్నుమూశారు. ఇటీవల ఆయన తల్లి కూడా మరణించిన సంగతి తెలిసిందే. విజయ్ తండ్రి రుద్రప్ప వయోవృద్ధ సమస్యలతో బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం చేరారు. ఈ నేపథ్యంలో చికిత్స పొందతున్న ఆయన నిన్న(గురువారం) తుదిశ్వాస విడిచారు.
చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా
ఈ రోజు వారి స్వగ్రామం అనేకల్ తాలుకా కుంబారహళ్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కాగా విజయ్ తల్లి నారాయణమ్మ కూడా ఈ ఏడాది జులైలో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నెలల వ్యవధిలోనే ఆయన తండ్రి కూడా మరణించడంతో విజయ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అయితే కన్నడలో రౌడీ రోల్స్ ఎక్కువగా చేసిన విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.