Kannada actors death
-
సినీ పరిశ్రమలో విషాదం, ప్రముఖ నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లోహితస్వ ప్రసాద్(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ హస్పిటల్లో చికిత్స పోందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచాడు. ఆయన మరణం కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినీ, టీవీ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. కాగా ఆయన కన్నడలో దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించారు. చదవండి: అప్పటి వరకు అల్లు శిరీష్ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్ అలాగే పలు సీరియల్స్‌లోనూ ఆయన అలరించారు. ఏకే47’, ‘దాదా’, ‘దేవ’, ‘నీ బరేడ కాదంబరి సంగ్లియానా’ వంటి సినిమాలతో లోహితస్వ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమరుడు శరత్ లోహితస్వ కూడా మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంలో శరత్ లోహితస్వ ఎన్ఐఏ(NIA) ఆఫీసర్‌గా నటించారు. వీటితో పాటు ‘సాహో’, ‘అరవింద సమేత’, ‘జై లవకుశ’ వంటి సినిమాల్లో కూడా ఆయన నటించారు. చదవండి: విక్రమ్‌కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్’కు గొల్డెన్ వీసా -
సినీ పరిశ్రమలో మరో విషాదం, టీవీ నటి మృతి
Kannada Serial Actress Death Today: చిత్ర పరిశ్రమలో వరుస మరో విషాదం చోటుచేసుకుంది. కన్నడ టీవీ నటి చేతనా రాజ్(21) మృతి చెందారు. కాస్మోటిక్ సర్జరీ వికటించడం వల్లే ఆమె చనిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం(మే 16) బెంగళూరులోని శెట్టి కాస్మోటిక్ ఆస్పత్రిలో ఆమె ఫ్యాట్ ఫ్రీ సర్జరీ చేయించుకుంది. అయితే సాయంత్రానికి ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో చేతానా ఇబ్బంది పడ్డారట. చదవండి: లాక్డౌన్లో రూ. 3వేల కోసం థియేటర్లో పనిచేశా: స్టార్ హీరో మాజీ భార్య దీంతో డాక్టర్ శెట్టి కాస్మొటిక్ హాస్పిటల్లో ఐసీయూ లేకపోవడంతో హుటాహుటిన మంజునాథ్ నగర్‌లోని కడే ఆసుపత్రికి ఆమె తరలించారు. ఆస్పత్రికి చేరుకునేలోపే చేతనా మరణించినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. అంతే కాదు... చేతనా రాజ్‌ను తీసుకొచ్చిన వైద్యుడు ఒకరు తమ వైద్యులను బెదిరించినట్టు కడే హాస్పిటల్ వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా చేతనా రాజ్ కన్నడలో పలు టీవీ షోలు, సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు పొందారు. ఆమె మరణవార్త తెలిసి కన్నడ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటినటులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా ఆమె నివాళులు అర్పిస్తున్నారు. God has given you a wonderful body. Just to be glamorous why change it and kill your self never mess with nature #chethanaraj — ಶ್ರೇಯಸ್ ಮೇಟಿಕುರ್ಕೆ (@shreyasms) May 17, 2022 -
సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు మృతి
Actor Shivaram Passed Away: సినీ పరిశ్రమంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు, డైరెక్టర్ శివరాం(83) కన్నుమూశారు. కొంతకాలంగా మెదడు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నవంబర్ 30న ఇంట్లో పూజ చేస్తుండగా కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన వయసు రీత్యా వైద్యులు ఆయనకు సర్జరీ చేయకుండా చిక్సిత అందిస్తూ వచ్చారు. చదవండి: Anasuya Bhardwaj-Pushpa Movie: నోట్లో బ్లేడ్‌తో అనసూయ.. భయపెట్టిస్తోన్న లుక్ ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు(డిసెంబర్ 4) తుదిశ్వాస విడిచారు. కాగా 6 దశాబ్ధాలుగా ఆయన వందలకు పైగా కన్నడ సినిమాలో నటించారు. కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నగరహావు, శుభమంగళ్ చిత్రాలతో శివరాం పాపులర్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన పలు కన్నడ చిత్రాలతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరించారు. హిందీలో బిగ్‌బి చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన దర్శకుడు
బెంగళూరు: కర్ణాటకలో తిప్పగుండనహళ్లి ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీస్‌స్టేషన్ లో లొంగిపోయారు. మాస్తిగుడి సినిమా దర్శకుడు నాగశేఖర, స్టంట్‌మాస్టర్ రవివర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధులు శనివారం మాగడి పొలీసు స్టేషన్లో లొంగిపోయారు. వీరిని స్థానిక న్యాయస్థానంలో హాజరపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈనెల 7న తిప్పగొండనహళ్లి చెరువు వద్ద జరిగిన దుర్ఘటనలో కన్నడ నటులు అనిల్, ఉదయ్‌లు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో హెలికాప్టర్ నుంచి చెరువులోకి అనిల్, ఉదయ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్ అనసూయ తవరెకెరె పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. దీంతో ‘మాస్తిగూడి’సినిమా నిర్మాత సుందరగౌడ, దర్శకుడు నాగశేఖర, సహాయ దర్శకుడు సిద్ధు, స్టంట్‌మాస్టర్ రవివర్మ, యూనిట్ మేనేజర్ ఎస్.భరత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా యూనిట్ ఎటువంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ అనిల్, ఉదయ్ ప్రాణాలు మృత్యువాత పడ్డారు. మరోవైపు మాస్తిగుడి సినిమా యూనిట్ షూటింగ్ చేయకుండా కర్ణాటక సినిమా అసోసియేషన్ నిషేధించింది.