మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో అనిల్, ఉదయ్(ఫైల్)
బెంగళూరు: కర్ణాటకలో తిప్పగుండనహళ్లి ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీస్‌స్టేషన్ లో లొంగిపోయారు. మాస్తిగుడి సినిమా దర్శకుడు నాగశేఖర, స్టంట్‌మాస్టర్ రవివర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధులు శనివారం మాగడి పొలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. వీరిని స్థానిక న్యాయస్థానంలో హాజరపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
ఈనెల 7న తిప్పగొండనహళ్లి చెరువు వద్ద జరిగిన దుర్ఘటనలో కన్నడ నటులు అనిల్, ఉదయ్‌లు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో హెలికాప్టర్ నుంచి చెరువులోకి అనిల్, ఉదయ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్ అనసూయ తవరెకెరె పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు.
దీంతో ‘మాస్తిగూడి’సినిమా నిర్మాత సుందరగౌడ, దర్శకుడు నాగశేఖర, సహాయ దర్శకుడు సిద్ధు, స్టంట్‌మాస్టర్ రవివర్మ, యూనిట్ మేనేజర్ ఎస్.భరత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా యూనిట్ ఎటువంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ అనిల్, ఉదయ్ ప్రాణాలు మృత్యువాత పడ్డారు. మరోవైపు మాస్తిగుడి సినిమా యూనిట్ షూటింగ్ చేయకుండా కర్ణాటక సినిమా అసోసియేషన్ నిషేధించింది.