Ravi Verma
-
యాదాద్రికి రూ.1.16 కోట్ల విరాళం
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు తనవంతు విరాళంగా అయ్యప్ప ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి వర్మ రూ.1.16 కోట్ల విరాళం అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావును కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో రవివర్మ అందజేశారు. -
పవర్ఫుల్ ప్రత్యర్థి
రవి వర్మ, వంశీ, రోహిత్, అక్షిత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘ప్రత్యర్థి’. శంకర్ ముడావత్ దర్శకత్వంలో సంజయ్ షా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్థన్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ ఇచ్చారు. నాగం జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘వాణిజ్య అంశాలతో పాటు సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అన్నారు శంకర్ ముడావత్. ‘‘హిందీ సినిమాలు నిర్మించాను. తెలుగులో ఇది నా తొలి సినిమా’’ అన్నారు సంజయ్ షా. -
రవి అవుట్ రత్న ఇన్!
‘ఇండియన్ 2’ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల రెండోవారంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలను కెమెరామేన్ రవివర్మ క్లిక్‌మనిపించారు. ఇప్పుడు ఆయన స్థానంలోకి రత్నవేలు వచ్చారు. ఇది వరకు ‘యందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు కలిసి పని చేశారు శంకర్ అండ్ రత్నవేలు. ఇప్పుడు ‘ఇండియన్ 2’కి కలిశారు. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్దార్ధ్, ప్రియాభవానీ శంకర్, ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... ఇటీవల షూటింగ్ ముగిసిన చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’, ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’కి కెమెరామేన్ రత్నవేలే. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన దర్శకుడు
బెంగళూరు: కర్ణాటకలో తిప్పగుండనహళ్లి ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీస్‌స్టేషన్ లో లొంగిపోయారు. మాస్తిగుడి సినిమా దర్శకుడు నాగశేఖర, స్టంట్‌మాస్టర్ రవివర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధులు శనివారం మాగడి పొలీసు స్టేషన్లో లొంగిపోయారు. వీరిని స్థానిక న్యాయస్థానంలో హాజరపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈనెల 7న తిప్పగొండనహళ్లి చెరువు వద్ద జరిగిన దుర్ఘటనలో కన్నడ నటులు అనిల్, ఉదయ్‌లు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో హెలికాప్టర్ నుంచి చెరువులోకి అనిల్, ఉదయ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్ అనసూయ తవరెకెరె పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. దీంతో ‘మాస్తిగూడి’సినిమా నిర్మాత సుందరగౌడ, దర్శకుడు నాగశేఖర, సహాయ దర్శకుడు సిద్ధు, స్టంట్‌మాస్టర్ రవివర్మ, యూనిట్ మేనేజర్ ఎస్.భరత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా యూనిట్ ఎటువంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ అనిల్, ఉదయ్ ప్రాణాలు మృత్యువాత పడ్డారు. మరోవైపు మాస్తిగుడి సినిమా యూనిట్ షూటింగ్ చేయకుండా కర్ణాటక సినిమా అసోసియేషన్ నిషేధించింది. -
రెండో బెల్కు రంగం సిద్ధం!
వ్రితి ఖన్నా, రవి వర్మ ముఖ్యతారలుగా గతేడాది రూపొందిన ‘కాలింగ్ బెల్’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ప్రీక్వెల్‌ను తెరకెక్కించిన పన్నా రాయల్ ఈ సీక్వెల్‌కు దర్శకుడు. అశోక్‌రాజ్, రాజ్ దలవాయి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడు తూ-‘‘ ‘కాలింగ్‌బెల్’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన పన్నా రాయల్ ఈ సీక్వెల్‌ను హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘దర్శకునిగా ‘కాలింగ్‌బెల్’ మంచి పేరు తీసుకొచ్చింది. అందుకే, కొంత టైమ్ తీసుకుని సీక్వెల్ కోసం పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను’’ అని పన్నా రాయల్ తెలిపారు.