రత్నవేలు
‘ఇండియన్ 2’ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల రెండోవారంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలను కెమెరామేన్ రవివర్మ క్లిక్‌మనిపించారు. ఇప్పుడు ఆయన స్థానంలోకి రత్నవేలు వచ్చారు. ఇది వరకు ‘యందిరిన్’ (తెలుగులో ‘రోబో’) సినిమాకు కలిసి పని చేశారు శంకర్ అండ్ రత్నవేలు. ఇప్పుడు ‘ఇండియన్ 2’కి కలిశారు.
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాజల్ అగర్వాల్, రకుల్‌ప్రీత్ సింగ్, సిద్దార్ధ్, ప్రియాభవానీ శంకర్, ఐశ్వర్యా రాజేష్ ఈ చిత్రంలో కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.... ఇటీవల షూటింగ్ ముగిసిన చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’, ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’కి కెమెరామేన్ రత్నవేలే.
Comments
Please login to add a commentAdd a comment