భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. భారతీయుడు సినిమా అద్భుతంగా ఉంటే దాని సీక్వెల్ దరిదాపుల్లో కూడా లేదని పలువురూ విమర్శించారు. ఈ మూవీ విడుదలైనప్పుడు తనను తీవ్ర స్థాయిలో విమర్శించారంటోంది హీరోయిన్ ప్రియ భవానీ శంకర్.
ముందే తెలిస్తే..
హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ.. నా కెరీర్‌లో నేను సంతకం చేసిన భారీ బడ్జెట్ చిత్రం ఇండియన్ 2. ఈ మూవీ ఒప్పుకోగానే నాకు ఎన్నో ఛాన్సులు వచ్చాయి. పెద్ద సినిమాలు చేస్తేనే హీరోయిన్‌గా భావిస్తున్నారు. ఇకపోతే ఫ్లాప్ అవుతాయని ముందే తెలిస్తే ఎవరైనా సరే సినిమాలు ఎందుకు చేస్తారు? టెక్నీషియన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ సినిమా హిట్టవ్వాలనే కష్టపడతారు.
వర్కవుట్ కాకపోతే..
అందరూ ఇష్టంగా కష్టపడి పని చేసినప్పుడు అది వర్కవుట్ కాకపోతే చాలా బాధేస్తుంది. ఇండియన్ 2 హిట్ అవదని తెలిసినా సరే దాన్ని నేను వదులుకోకపోయేదాన్ని. కమల్ -శంకర్ సర్ కాంబినేషన్‌లో మూవీని ఎవరు వద్దనుకుంటారు? కానీ జనాలు నన్ను మాటలతో వేధిస్తున్నారు. అందుకు బాధగా ఉంది. మీ అంచనాలు అందుకోలేకపోయినందుకు సారీ..
ఒక్కరే కారణం కాదు
సినిమా వైఫల్యం ఒక్కరి మీదే ఆధారపడదు. ఎన్నో కారణాలు ముడిపడి ఉంటాయి. కానీ నేనే కారణమంటే మనసుకు బాధేస్తోంది అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియ భవానీ శంకర్ 'డీమాంటి కాలనీ' సినిమాలో యాక్ట్ చేసింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment