
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు తనవంతు విరాళంగా అయ్యప్ప ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి వర్మ రూ.1.16 కోట్ల విరాళం అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును ఆదివారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీ రామారావును కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో రవివర్మ అందజేశారు.