మంత్రి కేటీఆర్‌తో చల్మెడ లక్ష్మీనరసింహారావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మన ఊరు–మన బడి’కార్యక్రమానికి కరీంనగర్ టీఆర్‌ఎస్ నాయకుడు, ‘చల్మెడ’వైద్య కళాశాల యజమాని చల్మెడ లక్ష్మీనరసింహారావు స్పందించారు. తన తండ్రి చల్మెడ ఆనందరావు సొంత గ్రామం సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మలకపేటలో పాఠశాల భవనాన్ని రూ. కోటిన్నరతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన నరసింహారావు కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను అభివృద్ధి చేసేలా రూపొందించిన బిల్డింగ్ ప్లాన్‌ను అందజేశారు.
భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరం నాటికే ప్రభుత్వానికి అప్పగిస్తామని ఈ సందర్భంగా ఆయన మంత్రికి తెలిపారు. పాఠశాలల అభివృద్ధి కోసం ఇటీవల ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’అనే కొత్త పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దాతలను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలోనే లక్ష్మీనర్సింహారావు స్కూల్ భవన నిర్మాణానికి ముందుకు వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment