దాత కాటూరి సుబ్బారావుకు విల్లా తాళాలు అందజేస్తున్న వైటీడీఏ వైస్ చైర్మన్, ఈవో
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండకు దిగువన యాదగిరిపల్లి సమీపంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలకు దాతలు సహకారాన్ని అందించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెసిడెన్షియల్ సూట్‌తో పాటు 14 విల్లాలను ప్రారంభించారు.
ఇందులో భాగంగా ఒక వీవీఐపీ విల్లాకు హైదరాబాద్‌కు చెందిన కాటూరి వైద్య కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు రూ.7.5 కోట్ల విరాళం అందించారు. వీవీఐపీ విల్లా తాళాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డిలు దాత కాటూరి సుబ్బారావుకు అందజేశారు. గత నెల 12న ప్రెసిడెన్షియల్ సూట్‌తోపాటు 13 విల్లాలను దాతలకు అధికారులు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment