Villa
-
ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ లగ్జరీ విల్లా వైరల్ (ఫోటోలు)
-
అనంత్-రాధిక అంబానీ ‘ప్రేమమందిరం’ దుబాయ్ లగ్జరీ విల్లా, ఫోటోలు
-
విల్లా కొంటే.. లంబోర్ఘిని కారు ఫ్రీ
భారతదేశంలోని చాలామంది వాహన ప్రియులు జీవితంలో ఒక్కసారైనా లంబోర్ఘిని కారును డ్రైవ్ చేయాలనుకుంటారు. అయితే దీని ధర రూ. కోట్లలో ఉండటం వల్ల అందరికి సాధ్యం కాకపోవచ్చు. అలాంటి కారు ఫ్రీగా ఇస్తానంటే? ఎవరు మాత్రం వద్దంటారు. అయితే లంబోర్ఘిని కారు కావాలంటే.. ఓ విల్లా కొనాల్సి ఉంటుంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ జేపీ గ్రీన్స్ ఈ ప్రకటన చేసింది. ఇందులో లగ్జరీ విల్లా కొనుగోలు చేసినవారికి రూ. 4 కోట్ల కంటే ఎక్కువ ఖరీదైన లంబోర్ఘిని కారును ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించింది. అయితే ఇక్కడ ఓ విల్లా కొనుగోలు చేయాలంటే.. రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఇది కదా అసలైన పండుగ.. మళ్ళీ తగ్గిన బంగారం ధరలువిల్లా కోసం రూ. 26 కోట్లు చెల్లిస్తే అంతటితో సరిపోతుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కారు పార్కింగ్ చేయడానికి, క్లబ్ మెంబర్షిప్ కోసం, గోల్ఫ్ కోర్స్ కోసం ఇలా దాదాపు మరో రూ. కోటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Noida’s got a new Villa Project coming up at 26 Cr that's offering 1 Lamborghini with each of those! 🙄 pic.twitter.com/gZqOC8hNdZ— Gaurav Gupta | Realtor (@YourRealAsset) October 27, 2024 -
విమానం... అయింది విల్లా!
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇందులో ఒక విమానం అద్భుతమైన విల్లాగా మారిపోయి ఉండటం చూడవచ్చు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి విమానాన్ని తనకు కావలసిన సకల సౌకర్యాలతో అద్భుతమైన నివాసంగా ఏర్పాటు చేసుకుని ఉండటం చూడవచ్చు. అందులోనే బెడ్ రూమ్, వాష్ రూమ్స్, కారిడార్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ కొందరు తమ కలలను నిజం చేసుకునే అదృష్టం కలిగి ఉంటారు. ఈ విమానం విల్లాలో బస చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ ఇచ్చారు. నిజానికి చాలామంది విమానంలో ప్రయాణించాలని కలలు కంటారు, అలాంటిది విమానాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకున్నాడంటే.. ఆ వ్యక్తి ఎలా పొగడాలో కూడా అర్థం కావడం లేదంటూ కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే లక్షల వ్యూవ్స్, ఆరు వేలకంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై తనదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫ్లైట్ విల్లా ఫెలిక్స్ డెమిన్ బాలిలోని న్యాంగ్ న్యాంగ్ బీచ్ సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్‌స్టా రీల్స్ చేస్తూ సూపర్ కారు కొనేశారు - ధర తెలిస్తే షాకవుతారు! Some people are fortunate enough to be able to turn their fantasies into reality. And this chap doesn’t seem to impose any constraints on his imagination! I’m trying to figure out whether I’d ever be interested in booking a stay here but I’m a bit worried about jet lag post… pic.twitter.com/LhH2Rtn5Ht — anand mahindra (@anandmahindra) February 17, 2024 -
సాహితీ కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ మోసం
మంగళగిరి: సినీ నటులతో బ్రోచర్లు ప్రారంభం.. కార్పొరేట్ తరహాలో ప్రకటనలు.. సినీ నటుల సమక్షంలోనే ప్లాట్ల కేటాయింపు.. ఇంధ్రభవనాలను తలపించేలా గ్రాఫిక్స్ తదితర ప్రచారా్రస్తాలతో హోరెత్తించిన ఓ సంస్థ కొనుగోలుదారులకు భారీ ఎత్తున శఠగోపం పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో 15 వందల మంది కొనుగోలుదారుల నుంచి డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఈ సంస్థ.. గుంటూరు జిల్లా కాజా వద్ద కూడా వెంచర్ వేసి మోసం చేసేందుకు ప్రయత్నించడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన వెలుగుజూచింది. వివరాల్లోకి వెళితే.. సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బూదాటి లక్ష్మీ నారాయణ హైదరాబాద్‌లోనూ, మంగళగిరి మండలం కాజా వద్ద వెంచర్ వేశారు. పలువురు సినీ నటులతో ప్రచారం చేయడం, సినీ నటులు ప్లాట్లు కొన్నట్లుగా చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలు, హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది కొనుగోలుదారులు ప్లాట్లు, విల్లాస్‌ను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారు. రిజిస్ట్రేషన్ చేయకుండా ముప్పు తిప్పలు.. హైదరాబాద్‌కు చెందిన పి. శ్రీధర్ అనే వ్యక్తి తన కుమార్తెల కోసం రెండు విల్లాలు కొనుగోలు చేసేందుకు రూ.కోటీ 80 లక్షలు చెల్లించారు. త్వరలోనే విల్లాలు పూర్తి చేసి అప్పగిస్తామని డబ్బులు తీసుకునేటప్పుడు చెప్పిన లక్ష్మీనారాయణ కనీసం స్థలాలను కూడా కొనుగోలు దారుల పేరిట రిజిస్టర్ చేయలేదు. 2020జూన్‌లో బాధితులు లక్ష్మీనారాయణను కలిసి రిజి్రస్టేషన్ అన్నా చేయాలని.. లేనిపక్షంలో డబ్బులు తిరిగి చెల్లించాలని కోరగా.. రెండు ప్రామిసరీ నోట్లు, రూ.90 లక్షల చొప్పున రెండు యూనియన్ బ్యాంకు చెక్కులను ఇచ్చి 2022 అక్టోబర్‌లో బ్యాంకులో వేసుకోమని చెప్పారు. అయితే ఆ రెండు చెక్కులు బౌన్స్ కావడంతో బాధితులు లక్ష్మీనారాయణ కోసం హైదరాబాద్ వెళ్లారు. అయితే ఇలానే పలువురిని మోసగించిన కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అప్పటికే లక్ష్మీనారాయణను అరెస్టు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా.. సాహితీ సంస్థకు చెందిన వెంచర్‌ను ఆయన బంధువు బుచ్చిబాబు హాలాయుధా ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నడుపుతున్నట్లు తెలుసుకున్న బాధితులు అతనిని సంప్రదించారు. గతంలో జరిగిన లావాదేవీలకు తనకు సంబంధం లేదంటూ సమాధానం ఇవ్వడంతో బాధితులు తాజాగా పోలీసులను ఆశ్రయించారు. కాగా, ఈ సంస్థ ప్రతినిధులు గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు తెలుగుదేశం నేతలకు వాటాలు ఇవ్వడంతో పాటు 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన నారా లోకేశ్ ఎన్నికలకు సైతం భారీ మొత్తంలో చందాలిచ్చినట్లు తెలుస్తున్నది. -
స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట!
స్టార్ హీరో అంటేనే ఆ రేంజే వేరు. ఎక్కడికెళ్లినా సరే ప్రత్యేకంగా కనిపించాల్సిందే. అలా ఏ దేశానికి వెళ్లినా వారికంటూ ప్రత్యేక సదుపాయాలు ఉండేలా లగ్జరీ విల్లాలు కొనేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో షారుక్ జోడీగా నయనతార నటించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలీవుడ్ హీరో ఆస్తుల విషయానికొస్తే ముంబయి, దుబాయ్‌లో కోట్ల విలువైన సౌధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో షారుక్ ఖాన్‌కు ఉన్న మరో ఖరీదైన విల్లా గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: దేశం పేరు మార్పుపై అమితాబ్ ఆసక్తికర ట్వీట్) అమెరికాలోని లాజ్ ఎంజిల్స్‌లో షారుక్ ఖాన్‌కు అత్యాధునిక వసతులతో ఖరీదైన విల్లా కూడా ఉంది. అంతే కాకుండా ఆ విల్లాను అద్దెకు కూడా ఇస్తారంట. ఓ రకంగా ఆ విల్లా ద్వారా పెద్ద బిజినెస్ నడిపిస్తున్నారు బాలీవుడ్ బాద్షా. అంతే కాకుండా ఫ్యామిలీతో కలిసి యూఎస్ వెళ్లినప్పుడు అక్కడే బస చేస్తారు. ఈ అత్యంత ఖరీదైన విల్లాలో ఆరు విశాలమైన గదులు, డ్రాయింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, జిమ్ లాంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి. అద్దె ఎంతో తెలుసా? లగ్జరీ సదుపాయాలున్న షారుక్ ఖాన్ విల్లాను అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఆ ఇంట్లో ఒక రోజు ఉండాలంటే రూ.1.96 లక్షలు చెల్లించాల్సిందే. ఇంకేముంది మీరెప్పుడైనా అమెరికా లాస్ ఎంజిల్స్ వెళ్తే స్టార్ హీరో ఇంటికి అద్దె చెల్లించి విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. గతంలో ఈ విల్లా గురించి షారుక్ మాట్లాడుతూ..బయటి ప్రపంచానికి దూరంగా ఫ్యామిలీతో కొంత సమయం ఉండేందుకు.. రిఫ్రెష్ అయ్యేందుకు ఉంటుందని వెల్లడించారు. జబ్ హ్యారీ మెట్ సెజల్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉన్నారు షారుక్ భాయ్. ఇప్పటికే అతనికి దూబాయ్లోనూ రూ.200 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. షారుక్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7 న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: అందుకే అడల్ట్ సినిమాలు చేశా, ఎలాగో డబ్బులు కూడా బాగా వచ్చేవి..) -
గిఫ్ట్‌గా వంద కోట్ల లగ్జరీ విల్లా.. స్వర్గాన్ని తలపిస్తున్న షారుక్ సౌధం!
సినీ తారల లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి ఆదాయం కోట్లలోనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. స్టార్ హీరోల విషయాకొనికొస్తే ఏకంగా వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. అలాంటి వారి లైఫ్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ తారలకైతే ఇండియాతో పాటు విదేశాల్లోనూ లగ్జరీ ఫ్లాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఆస్తులు కొనుగోలు చేశారు. అలా కోట్ల విలువైన అత్యంత లగ్జరీ విల్లా కలిగిన స్టార్ హీరో గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. (ఇది చదవండి: మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన బేబి హీరోయిన్! ) ప్రస్తుతం జవాన్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన హీరో షారుక్ ఖాన్. బాలీవుడ్ బాద్షాగా పేరుపొందిన ఆయనకు ఇప్పటికే ముంబయిలో ఉన్న హోమ్ మన్నత్ గురించి అందరికీ తెలిసిందే. అతన్ని చూసేందుకు అభిమానులు సైతం ఇంటి బయట కనిపిస్తుంటారు. ఆ ఇంటి విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. దీంతో ఆయనకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుబాయ్ విల్లా 'జన్నత్' గురించి మీకు తెలుసా? 'స్వర్గానికి ఏ మాత్రం తీసిపోని దుబాయ్ ఇంటి గురించి తెలుసుకుందాం. షారూఖ్ ఖాన్ దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అతనికి అక్కడ కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. రూ.100 కోట్ల విలువైన అందమైన పామ్ జుమేరాలో అతనికి లగ్జరీ విల్లా ఉంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం నఖీల్ 2007లో ఈ గ్రాండ్ విల్లాను షారూఖ్ ఖాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. దీనికి ఇంటీరియర్‌ను షారుక్ భార్య గౌరీ ఖాన్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దుబాయ్‌లోని అతని ఇంటిని 'జన్నత్' అని పిలుస్తారు. అంటే స్వర్గం అని అర్థం. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? 63 ఏళ్లంటే నమ్ముతారా?) జన్నత్ ప్రత్యేకతలు.. షారూఖ్ ఖాన్ 'జన్నత్' విల్లా ప్రత్యేకతలు తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. ఇందులో ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉంది. 'జన్నత్' విల్లా దాదాపు 14 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇందులో 6 బెడ్రూమ్లు ఉన్నాయి. బీచ్-వ్యూగా ఉండే ఇందులో రెండు రిమోట్ కంట్రోల్ గ్యారేజీలు. ఒక ప్రైవేట్ పూల్ కూడా ఉన్నాయి. ఈ ఆస్తి గురించి గౌరీ ఖాన్ మాట్లాడుతూ.. ది దుబాయ్ స్కైలైన్ వ్యూ అని.. ఈ ప్లేస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అంతే కాకుండా షారుక్ తరచుగా దుబాయ్‌కు వెళ్తాడు.. అందుకే నగరంలో ఇల్లు ఉండటం మంచిదని ఆమె అన్నారు. విల్లా గురించి గౌరీ ఖాన్ మాట్లాడుతూ..' ఫ్లోర్, వాల్ కవరింగ్‌లను ముందే డిజైన్ చేశారు. అయితే పిల్లల గదిని వారి అభిరుచుల ఆధారంగా డిజైన్ చేశాను. ఆర్యన్ ఖాన్, సుహానా, అబ్రామ్ ఖాన్ కూడా విల్లాలో వారి ఇష్టమైన ప్లేస్‌లు కూడా ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ గదిలో పెద్ద టీవీ. అబ్రామ్ ఖాన్ ఎక్కువ సమయం బీచ్‌లో గడుపుతాడు. సుహానా ఖాన్ పూల్‌లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంది.' అని వెల్లడించింది. అలాగే ముంబయి, దుబాయ్‌తో పాటు లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, అలీబేగ్లలో కూడా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్ వచ్చే నెల 7న రిలీజ్ కానుంది. -
ఇండియన్ ఫ్యామిలీ చేతికి అద్భుతమైన విల్లా.. ధర ఎన్ని కోట్లంటే?
భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్, అతని భార్య రాధిక ఓస్వాల్ ఇటీవల స్విట్జర్లాండ్‌లో కోట్ల రూపాయల భవనం కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన విల్లాలలో ఒకటి కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్విట్జర్లాండ్‌లోని గింగిన్స్ గ్రామంలోని పిక్చర్స్క్యూ వద్ద 4.3 లక్షల చదరపు అడుగుల ఈ విల్లాను వారు సొంత చేసుకున్నారు. ఈ భవనం ఖరీదు 200 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 1649 కోట్లు. ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన టాప్ 10 భవనాల్లో ఒకటి అని నివేదికలు చెబుతున్నాయి. ఈ విల్లా ఒకప్పుడు గ్రీకు షిప్పింగ్ మాగ్నెట్ అరిస్టాటిల్ ఒనాసిస్ కుమార్తె 'క్రిస్టినా ఒనాసిస్' యాజమాన్యంలో ఉండేది. అయితే దీన్ని ఓస్వాల్ కుటుంబం కొనుగోలు చేసిన తరువాత రీడిజైన్ చేసింది. ఈ రీడిజైన్ బాధ్యతలను ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ జెఫ్రీ విల్కేస్కు అప్పగించారు. ఈ విల్లా భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, అదే సమయంలో విశ్వసౌందర్యాన్ని నిలుపుకోవాలని చెబుతూ తమకు అప్పగించారని డిజైనర్ జెఫ్రీ విల్కేస్ అన్నారు. ఈ విల్లాలో ఒక ప్రైవేట్ జిమ్, స్పా, వెల్నెస్ వింగ్, పెద్ద ఫ్రెంచ్ కిటికీలు ఉన్నాయి. ఈ భవనం చుట్టూ తోటలు మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి. ఇది చూడటానికి ఒక అద్భుతమైన రాజ సౌధం మాదిరిగా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: చైనా మిలియనీర్ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. 56 ఏళ్ల వయసులో..) ఇక పంకజ్ ఓస్వాల్ విషయానికి వస్తే.. ఈయన 2016లో మరణించిన ఓస్వాల్ ఆగ్రో మిల్స్ అండ్ ఓస్వాల్ గ్రీన్‌టెక్ వ్యవస్థాపకుడు పారిశ్రామికవేత్త 'అభయ్ కుమార్ ఓస్వాల్' కుమారుడు. తండ్రి మరణించిన తరువాత కంపెనీ బాధ్యతలను పంకజ్ ఓస్వాల్ స్వీకరించాడు. కంపెనీ పరిధిలో పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్, ఎరువులకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్‌పై ఇంకా అనుమానం ఉందా? ఇదిగో క్లారిటీ!) View this post on Instagram A post shared by RIDI (@realridi) పంకజ్ ఓస్వాల్ మన దేశంలో ఉన్న మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత రాధికా ఓస్వాల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారికి వసుందర ఓస్వాల్, రిధి ఓస్వాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2013లో ఓస్వాల్ కుటుంబం ఆస్ట్రేలియా నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. -
ప్రతీకారం ఇలా కూడా తీర్చుకోవచ్చా.. దంపతులు చేసిన పనికి విల్లా యజమాని షాక్..?
వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీకి భారీషాక్ తగిలింది. ఇద్దరు దంపతులు తీర్చుకున్న రివెంజ్ దెబ్బతో ఆ సంస్థకు రూ.1.2లక్షల నష్టం వాటిల్లింది. వెలుగులోకి వచ్చిన నివేదికల ప్రకారం.. చైనాకు చెందిన భార్యభర్తలు సౌత్ కొరియాలో సియోల్‌లో 25 రోజుల పాటు వెకేషన్‌కు వెళ్లాలని అనుకున్నారు. ఇందుకోసం వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీలో సియోల్‌లో ఓ విల్లాను బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకునే సమయంలో విల్లా యజమాని ‘లీ’(Lee)ని, ఎయిర్‌బీఎన్‌బీని సంప్రదించలేదు. అయితే వాళ్లిద్దరూ తాము బుక్ చేసుకున్న విల్లా నగరంలో లేదని, ఎక్కడో శివారు ప్రాంతంలో ఉందని తెలుసుకొని కంగుతిన్నారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలని విల్లా ఓనర్ని అడిగారు. అందుకు ఆయన ఒప్పుకోలేదు. చేసేది లేక చైనా నుంచి సియోల్‌కు వచ్చారు. 25 రోజుల పాటు విల్లాలో ఉన్న భార్యభర్తలు విల్లా ఓనర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. లీ’కి ఫోన్ చేసి మీ విల్లాలో నిఘా కెమెరాలు ఉన్నాయా? అవి పనిచేస్తున్నాయా? అడిగారు. అందుకు మా విల్లాలో సీసీ కెమెరాలు లేవని చెప్పడంతో తమ ప్లాన్‌ను అమలు చేశారు. అవసరానికి మించి లైట్లు, ట్యాప్‌లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, గ్యాస్ ట్యాప్‌లను ఆన్ చేశారు. 25 రోజుల్లో కేవలం ఐదుసార్లు మాత్రమే సియోల్‌ను సందర్శించారు. ఆ ఐదు రోజుల్లో ఐదైదు నిమిషాలు మాత్రమే ఉన్నారు. గడువు ముగియడంతో విల్లాను ఖాళీ చేశారు. ఈ క్రమంలో గ్యాస్ కంపెనీ అధికారులు విల్లా ఓనర్‌కు లీకి ఫోన్ చేశారు. మీ విల్లాలో గ్యాస్ వినియోగం ఎక్కువగా ఉందనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. అధికారులు సమాచారంతో విల్లాలో ఎదైనా ప్రమాదం జరిగిందేమోనని బయపడ్డారు. విల్లాను సందర్శించిన తర్వాత దంపతులు చేసిన పనికి యజమానికి లీ షాక్‌కు గురయ్యాడు. విల్లాలో ఏం జరిగిందోనని తెలుసుకునే ప్రయత్నించే క్రమంలో కిటికీలు తెరిచి ఉండడం, గ్యాస్ ఆన్‌లో ఉండడం గమనించాడు. $116 (రూ. 9,506) నీరు, కరెంట్ $730 (రూ. 59,824), గ్యాస్ ఇతర $728 (రూ. 59,660) బిల్లులు వచ్చాయి. 120,000 లీటర్ల కంటే ఎక్కువ నీటిని ఉపయోగించారు. భార్య భర్తల ప్రతీకారంతో తమ సంస్థకు భారీ ఎత్తున నష్టం జరిగిందని ఎయిర్‌బీఎన్‌బీ సైతం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, తమపై ప్రతీకారం తీర్చుకున్న చైనాలో ఉన్న భార్యభర్తలపై కోర్టును ఆశ్రయిస్తానని, వాళ్లిద్దరూ ఎక్కడున్నా కటకటల్లోకి పంపిస్తానని లీ చెప్పడం కొసమెరుపు. చదవండి👉 ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా చూడొచ్చు! -
పింక్ విల్లా అవార్డ్స్ సీజన్-2 లో మెరిసిన సినీ తారలు (ఫొటోలు)
-
రూ.100 కోట్లు.. లగ్జరీ కార్లు, విల్లా నుంచి .. బిల్లులు కట్టలేని దీనస్థితికి!
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేరు. కాలం కలిసి వస్తే రాత్రి రాత్రి సెలబ్రిటీలైన వారు ఉన్నారు, అదృష్టంతో ఒక్క రోజులో ధనవంతులుగా మారిన వారు ఉన్నారు. ఇక్కడ వరకు ఓకే గానీ దీని తర్వాత అంతా మన చేతులోనే ఉంటుంది. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోయినా, నిర్లక్ష్యం వహించినా సీన్ ఒక్కసారిగా తారుమారవుతుంది. సరిగ్గా ఇదే తరహాలోనే ఓ వ్యక్తి అకస్మాత్తుగా 100 కోట్లకు యజమానిగా మారాడు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ ఉన్నదంతా పోయి చివరికి రోడ్డున పడ్డాడు. ఈ ఘటన బ్రిటన్‌లో చోటు చేసుకుంది. లక్‌లో లాటరీ.. అంతా పోయింది ఇది జాన్ మెక్గిన్నిస్ కథ. అతను 1997లో రూ. 100 కోట్ల భారీ ప్రైజ్ మనీని గెలుచుకున్నాడు. దీంతో అతని లైఫ్ స్టైయిల్ మారింది. అయితే క్రమశిక్షణ అనేది ఎవరికైన ముఖ్యం. అది ప్రవర్తన పరంగా కావచ్చు లేదా ఆర్థికపరంగానే కావచ్చు. ఇది లేకపోతే ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా అవేవి నిలబడవు. జాన్ గురించి తెలుసుకుంటే ఈ విషయం మీకే అర్థమవుతుంది. లక్‌లో లాటరీని గెలుచుకున్న తర్వాత జాన్ చాలా ఖరీదైన కార్లను కొనుగోలు చేశాడు. వీటిలో బెంట్లీ, మెర్సిడెస్, జాగ్వార్, ఫెరారీ, బీఎండబ్ల్యూ మోడల్స్ కార్లు ఉన్నాయి. యూకేలోని సౌత్ లానార్క్‌షైర్‌లోని బోత్‌వెల్‌లో రూ.13 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లును కొనుగోలు చేశాడు. సముద్ర తీరంలో రూ. 5 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొన్నాడు. ఇది కాకుండా దాదాపు 30 కోట్ల రూపాయలను తన కుటుంబం కోసం ఖర్చు చేశాడు. చాలా చోట్ల అడ్డగోలుగా పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. కొన్ని సమస్యల కారణంగా కోర్టుకు కూడా హాజరు కావాల్సి వచ్చింది.పక్కా ప్రణాళిక లేకుండా డబ్బు పెట్టుబడి పెట్టడంతో లాటరీ సొమ్ముతో కూడబెట్టినదంతా పోగొట్టుకున్న జాన్ చివరికి క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా కట్టుకోలేని స్థితికి చేరుకున్నాడు. -
అసలు విల్లాలో ఏం జరిగింది?..ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్
విజయ్, శీతల్ బట్ జంటగా తెరకెక్కిన చిత్రం 'విల్లా 369'. ఈ చిత్రానికి సురేష్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. విగన్ క్రియేషన్స్ సమర్పణలో విద్య గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు డాక్టర్ రాకేశ్ సహానిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు తేజ విడుదల చేశారు. అనంతరం దర్శకుడు తేజ మాట్లాడుతూ.. 'దర్శకుడు సురేష్ ప్రభు మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని తీసిన చిత్రం "విల్లా 369". సినిమా దర్శక, నిర్మాతలకు మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'. అని అన్నారు. నిర్మాత విద్య గణేష్ మాట్లాడుతూ.. ' దర్శకుడు మంచి నటీ నటులను ఎంపిక చేశారు. ఈ సినిమాకు ర్యాడీ రఫీ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది. సంగీత దర్శకుడు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.' అని అన్నారు... దర్శకుడు సురేష్ ప్రభు మాట్లాడుతూ..'ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదములు. అందరూ నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చినందునే ఈ సినిమా అనుకున్న విధంగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'. అని అన్నారు. -
ఖరీదైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేసిన పాంటింగ్.. ధర ఎంతో తెలుసా..?
ఆస్ట్రేలియా మాజీ సారధి, టూ టైమ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారు ప్రాంతమైన టూరక్లో అత్యంత విలాసవంతమైన 6 బెడ్ రూమ్‌ల భవనాన్ని కొనుగోలు చేశాడు. లగ్జరీ స్విమ్మింగ్ పూల్తో పాటు టెన్నిస్ కోర్ట్ కలిగిన ఈ మాన్షన్ ఖరీదు 20 మిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని ఆస్ట్రేలియా మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. 1400 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పాలరాతిచే నిర్మించబడ్డ ఈ అత్యధునిక విల్లాలో ఇండోర్-అవుట్డోర్ లివింగ్ స్పేస్‌లతో పాటు ఆధునిక వంటగది సమకూర్చబడింది. పాంటింగ్ ఇంత విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేయడం ఇది మొదటిసారి కాదు. 2013లో ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ 9.2 మిలియన్ డాలర్లు వెచ్చించి బ్రైటన్‌లోని బీచ్‌సైడ్ శివారులో ఓ లగ్జరీ మ్యాన్షన్‌ను కొన్నాడు. ప్రస్తుతం పాంటింగ్ కుటంబంతో కలిసి అందులోనే నివాసం ఉంటున్నాడు. బ్రైటన్ గోల్డెన్ మైల్గా పిలవబడే ఆ సుందర భవనంలో 7 పడక గదులు, ఎనిమిది స్నానపు గదులు, అంతర్గత థియేటర్ మరియు బీచ్‌కి ప్రైవేట్ లేన్వే ఉన్నాయి. ఈ రెండు భవనాలే కాక పాంటింగ్ 2019లో మరో భవనాన్ని కూడా కొనుగోలు చేశాడు. దాని ఖరీదు 3.5 మిలియన్ డాలర్లు. ఇందులో నాలుగు పడక గదులు, మూడు బాత్రూమ్లు ఉన్నాయి. ఈ విల్లా పోర్ట్ వ్యూ కలిగి ఉంటుంది. ఇదిలా ఉంటే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న పాంటింగ్.. ఆస్ట్రేలియా తరఫున 168 టెస్ట్ మ్యాచ్‌ల్లో 51.85 సగటున 41 సెంచరీల సాయంతో 13,378 పరుగులు చేశాడు. 374 వన్డేల్లో 41.81 సగటున 29 సెంచరీల సాయంతో 13,589 పరుగులు చేశాడు. -
కరోనా ఎఫెక్ట్.. హాట్‌కేక్‌లా సేల్స్, కోట్లు పెట్టి ఆ ఇళ్లనే కొంటున్న జనం!
సాక్షి, హైదరాబాద్: దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గుచూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తుల కోసం ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ (ఐఎస్‌ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసిరావటమే. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు. 61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు 2023–24లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలా మంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. గత 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. అయి తే 2015లోని గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గుచూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధామ్యాలు మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే. ఈ నగరాలే హాట్‌స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవ నశైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11% మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీ లకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
కెనడియన్ వుడ్ విల్లాకు అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాక్ ప్రాజెక్ట్స్ నిర్మించిన కెనడియన్ వుడ్ విల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సస్టెయినబుల్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియా అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్‌లోని బీటీఆర్ గ్రీన్స్‌లో రూపుదిద్దుకున్న విల్లా ప్రాజెక్ట్‌కు ఈ అవార్డు దక్కిందని కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో నేషనల్ అవార్డ్స్ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ టీఎంలో భాగంగా ఫారెస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్ఐఐ) బిజినెస్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గజానన్ పట్నాకర్ ఈ అవార్డును అందుకున్నారు. కెనడాకు చెందిన ప్రభుత్వ సంస్థ ఫారెస్ట్రీ ఇన్నోవేషన్ కన్సల్టింగ్ (కెనడియన్ వుడ్)తో కలిసి మ్యాక్ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసింది. కెనడాలోని అడవుల నుంచి సేకరించిన కలపతో పర్యావరణహితమైన విల్లాలను నిర్మించారు. -
దుబాయ్‌లో విలాసవంతమైన విల్లా కొన్న అంబానీ: చిన్న కొడుకు కోసమేనా?
సాక్షి,ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ దుబాయ్‌లో విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేసినట్టు సమాచారం. దుబాయ్‌లోని పామ్ జుమేరాలో బీచ్ ఫ్రంట్ విల్లాను 80 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇదే అతిపెద్ద నివాస ప్రాపర్టీ డీల్ అని ఈ డీల్ గురించి తెలిసిన వారు చెబుతున్న మాట. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం రూ.640 కోట్లు వెచ్చించి అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారని తెలుస్తోంది. బీచ్ ఒడ్డున నిర్మించిన ఈ విల్లాలో లేని లగ్జరీ సౌకర్యం అంటూ ఏదీ లేదు. 10 బెడ్రూమ్లు, ప్రైవేట్ స్పా, ఇండోర్, అవుట్డోర్ స్విమ్మింగ్ పూల్స్, ఇలా సర్వ హంగులతో 7-స్టార్ హోటల్‌కు మించి ఉంటుందట. దుబాయ్ ప్రాపర్టీ డీల్‌ను అంబానీ ఫ్యామిలీ చాలా గోప్యంగా ఉంచింది. అందుకే కొన్నది ఎవరో చెప్పకుండానే స్థానిక మీడియా కూడా దీని గురించి నివేదించింది. అలాగే ఈ విల్లా రెనోవేషన్, సెక్యూరిటీ మరింత పటిష్టంగా ఉండేందుకు మిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నట్లు వ్యాపారవర్గాలు పేర్కొంటున్నాయి. రిలయన్స్‌కు చెందిన ఆఫ్‌షోర్ ఎంటిటీతోపాటు, గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్, ఎంపీ, దీర్ఘకాల అంబానీ మిత్రుడు పరిమల్నత్వానీ ఈ విల్లా బాధ్యతలు నిర్వహించనున్నారట. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ప్రకారం, ప్రపంచ 11వ బిలియనీర్ అంబానీ 93.3 బిలియన్ల డాలర్ల సంపదకు సంబంధించిన ముగ్గురు వారసుల్లో అనంత్ ఒకరు. తన సామ్రాజ్యాన్ని గ్రీన్ ఎనర్జీ, టెక్, ఇ-కామర్స్ రంగాలకు విస్తరించిన ముఖేశ్ అంబానీ వ్యాపార పగ్గాలను నెమ్మదిగా వారసులకు అప్పగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ ఇటీవలే టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఛైర్మన్‌గా నియమితుడయ్యారు. అలాగే కుమార్తె ఈషా అంబానీకి రిలయన్స్ రీటైల్ బాధ్యతలు, అనంత్‌కు ఎనర్జీ బిజినెస్ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభాలో 80 శాతానికి మించి ప్రవాసీయులే ఉన్నారు. విదేశాలకు చెందిన, ముఖ్యంగా భారతీయులదే అక్కడి రియల్ ఎస్టేట్‌లో అధిక వాటా.దశాబ్దాలుగా అక్కడి ఆర్థికవ్యవస్థకు మూలస్తంభంగా ఉన్నారు. అలాగే ఇటీవల ఇంటిని కొనుగోలు చేసే నిబంధనలు సవరించడం, గోల్డెన్ వీసా ఆఫర్‌తో డిమాండ్ మరింత పెరిగింది. కనీసం 2 మిలియన్ దిర్హామ్‌ల విలువైన ఆస్తిని కొనుగోలు చేసిన వారికి 10 సంవత్సరాల వీసాను పొందవచ్చు. ఇప్పటికే బ్రిటీష్ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ తన భార్య విక్టోరియా కోసం, బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ఇక్కడ ఆస్తులను కొనుగోలు చేశారు. -
ముసుగు దొంగల స్వైరవిహారం... మూడు విల్లాల్లో చోరి
శంషాబాద్: శంషాబాద్ పట్టణం, సాతంరాయిలో ముసుగు దొంగలు స్వైరవిహారం చేశారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రహరీపై ఉన్న ఫెన్సింగ్‌ను తొలగించి లోపలికి చొరబడి చోరీ చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాశంబండ సాతంరాయిలోని సుచిరిండియా విల్లాల్లో బుధవారం ఉదయం మూడు విల్లాల యజమానులు ఇంటి తలుపులకు ఉన్న గడియలు కోసేసి ఉండటాన్ని గుర్తించారు. అల్మారాల్లో ఉన్న నగదు పోయిందని నిర్ధారించుకుని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శంషాబాద్ ఏసీపీ భాస్కర్, సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. విల్లాలకు ముందు భాగంలో ఉన్న ఫెన్సింగ్‌ను కోసేసిన దుండగులు లోపలికి చొరబడి విల్లాల వెనుక భాగంలో ఉన్న తలుపులను గ్యాస్ కట్టర్లతో తొలగించినట్లు గుర్తించారు. ఐఏఎస్ అధికారి ఇంట్లో.. కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ ఇంట్లో రూ. 60 వేలు, ఆ పక్కనే ఉన్న మరో రెండు విల్లాల్లో రూ. 30, రూ. 10 వేలు దొంగిలించారు. అయితే ఆయా ఇళ్లల్లో వెండి వస్తువులు, పాటు విలువైన గ్యాడ్జెట్స్, ల్యాప్‌టాప్‌లు ఉన్నా వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం. తీరిగ్గా ఆకలి తీర్చుకుని.. ముసుగు దొంగలు ముగ్గురు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ పని ప్రారంభించి సుమారు నాలుగు గంటల వరకు అక్కడే ఉన్నట్లు సీసీ టీవీ ఫుటేజీల్లో స్పష్టమైంది. వారు రెండు ఇళ్లలోని ఫ్రిజ్‌లలో పండ్లను మొత్తం ఆరగించినట్లు గుర్తించారు. చోరీల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు సమీప ప్రాంతాల్లో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. విల్లాలపై స్పష్టమైన అవగాహన ఉన్న వారే దొంగతనం చేసి ఉంటారా..? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. (చదవండి: సైకో భర్త చిత్రహింసలు.. భార్యకు అశ్లీల వీడియోలు చూపిస్తూ..) -
హ్యాపీ బర్త్‌డే మాస్టర్ బ్లాస్టర్.. లగ్జరీ విల్లా, ఆసక్తికర విషయాలు
భారత క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ(ఏప్రిల్ 24) 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్ టెండూల్కర్ 16 ఏట అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 24 ఏళ్ల పాటు సచిన్ తన బ్యాటింగ్‌తో క్రికెట్‌ను శాసించాడనే చెప్పొచ్చు. ఈ క్రమంలో అతడు సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. సెంచరీలతో పాటు వన్డే, టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత సచిన్ సొంతం. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ అందుకున్న ఆటగాడిగాను సరికొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. అతను సాధించిన రికార్డుల గురించి కాకుండా కాస్త కొత్తగా సచిన్ నివాసముంటున్న లగ్జరీ విల్లా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ►సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబైలోని బాంద్రా ప్రాంతంలో విశాలమైన విల్లాలో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు . 2007లో రూ.39 కోట్లు పెట్టి పాత విల్లాను కొనుగోలు చేసిన సచిన్.. దాదాపు రూ. వంద కోట్లతో కొత్త పద్దతిలో లగ్జరీ విల్లాను నిర్మించాడు. ►బాంద్రాలోని పెర్రీ రోడ్లో ఉన్న ఈ విల్లా అరేబియన్ సముద్రానికి దగ్గరలో ఉంది. ఇదే ప్రాంతంలో సెలబ్రిటీస్, సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు నివాసం ఉంటున్నారు. ►సచిన్ లగ్జరీ విల్లా దాదాపు ఆరువేల స్క్వేర్ఫీట్స్లో ఉంటుంది. బంగ్లా మొత్తం మూడు ఫ్లోర్స్‌లో ఉండగా.. రెండు బేస్మెంట్స్, ఒక టెర్రస్ ఉంటుంది. విశాలమైన గెస్ట్ రూమ్స్‌తో పాటు టాప్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ►సచిన్‌కు కార్లంటే ఎంత పిచ్చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోయర్ బేస్మెంట్లో ఒకేసారి 40-50 కార్లను పార్క్ చేసేలా వీలు ఉంటుంది. ఇక అప్పర్ బేస్మెంట్లో సెకండరీ కిచెన్, సర్వెంట్ క్వార్టర్స్, సెక్యూరిటీకి సంబంధించిన మాస్టర్ సర్వెలియన్స్ ఉంటాయి. ►కాగా సచిన్ తాను నివాసముంటున్న ఇంటికి రూ. 100 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించడం విశేషం. ఆ పాలసీలో ఉగ్రవాద దాడులు, యాక్ట్ ఆఫ్ గాడ్(భూకంపాలు), బాంబ్ బ్లాస్ట్ తదితర వాటికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా రూపొందించారు. ►సచిన్ ఉంటున్న విల్లా మెయిన్ లివింగ్ రూమ్ దాదాపు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. రూమ్ నిండా వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్‌తో కూడిన కలర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. -
యాదాద్రి విల్లాకు రూ.7.5 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండకు దిగువన యాదగిరిపల్లి సమీపంలో నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్, విల్లాలకు దాతలు సహకారాన్ని అందించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రెసిడెన్షియల్ సూట్‌తో పాటు 14 విల్లాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక వీవీఐపీ విల్లాకు హైదరాబాద్‌కు చెందిన కాటూరి వైద్య కళాశాల చైర్మన్ కాటూరి సుబ్బారావు రూ.7.5 కోట్ల విరాళం అందించారు. వీవీఐపీ విల్లా తాళాలను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీతారెడ్డిలు దాత కాటూరి సుబ్బారావుకు అందజేశారు. గత నెల 12న ప్రెసిడెన్షియల్ సూట్‌తోపాటు 13 విల్లాలను దాతలకు అధికారులు కేటాయించారు. -
సముద్రంలో ఫ్లోటింగ్ ప్యాలెస్.. చుట్టూ విల్లాలు.. వెకేషన్ అదిరిపోద్దంతే!
చాలా మంది ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెకేషన్‌కు వెళ్తుంటారు. కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లాంటి మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రాంతాలకైతే మరీ మరీ ఇష్టపడి వెళ్తారు. ఇలాంటి వాళ్లను మరింత ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన ఫ్లోటింగ్ ప్యాలెస్ రెడీ కాబోతోంది. అది కూడా సముద్రంలో. అలా ఇలా కాదు.. నీటిపై తేలేలా 156 రూములతో నిర్మితమవుతోంది. ప్యాలెస్ ఒక్కటే కాదండోయ్.. దాని చుట్టూ విల్లాలు కూడా సిద్ధం కాబోతున్నాయి. అవి కూడా నీటిపై తేలేవే. అలా సముద్రాన్ని చుట్టొద్దామనుకుంటే ఆ విల్లాలే ప్యాలెస్ నుంచి విడిపోయి బోట్లలా మారిపోతాయి. అలా తిరిగొచ్చాక షిప్‌లు కదా ‘డాక్’ అయినట్టు ఆ పెద్ద ప్యాలెస్‌కు అతుక్కుపోతాయి. వినడానికి భలేగా ఉన్నా, వెంటనే చూడాలనేలా ఊరిసున్నా ఈ ప్యాలెస్ హోటల్ దుబాయ్‌లో జుమెయ్రా బీచ్‌కు దగ్గర్లో నిర్మితమవుతోంది. 2023లో అందుబాటులోకి రానుంది. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ బోట్లు, హెలికాప్టర్ల ద్వారా ప్యాలెస్‌ను చేరుకోవచ్చు. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ ఏర్పాటు చేశారు. తేలాడే హెలిప్యాడ్‌ను కూడా నిర్మించబోతున్నారు. ప్రధాన ప్యాలెస్ 4 భాగాలుగా ఉంటుంది. వాటిని మధ్యలో ఉండే గ్లాస్ పిరమిడ్ కలుపుతుంది. ప్యాలెస్‌లో రెస్టారెంట్, బార్, స్పా, పూల్స్, బొటీక్స్ లాంటి సౌకర్యాలెన్నో ఉన్నాయి. విల్లాల్లో ఉండే వాళ్లు కూడా ఈ సౌకర్యాలు పొందవచ్చు. ప్యాలెస్‌ను, విల్లాలను నీటిపై తేలేలా ఎలా నిర్మిస్తున్నారో వెల్లడించలేదు. ప్యాలెస్ ఓపెనింగ్ తేదీ.. అందులోని రూమ్‌లు, సర్వీసుల ధరలు కూడా చెప్పలేదు. చదవండి: పాపికొండల సోయగాలు.. నదీ విహారం విల్లాల్లో ఏమేముంటాయ్? తేలియాడే ఆ పెద్ద ప్యాలెస్ చుట్టూ 12 విల్లాలను నిర్మించనున్నారు. ఒక్కోటి రెండంతస్తులు ఉంటుంది. 1, 4 బెడ్రూమ్ల గదులతో పాటు పైన టెర్రస్.. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంతేకాదు.. విల్లాలను పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నారు. వాటిల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్‌లో గాని, విల్లాలో గాని ఏ ప్రాపర్టీనైనా కొనుక్కోవచ్చు. చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త! – సాక్షి సెంట్రల్ డెస్క్ -
హైదరాబాద్‌లో మరో ఇంటిని కొనుగోలు చేయనున్న ప్రభాస్.. రూ. 200 కోట్లతో
బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తరువాత సినిమాల ఎంపికలో ప్రభాస్ చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రకటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అయిదు సినిమాలు ఉన్నాయి. రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్‌తోపాటు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే, సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. తాజాగా డార్లింగ్‌కు సంబంధించిన ఓ వార్త సినీ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ప్రభాస్ హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముంబైలో ప్రభాస్‌కు విలాసవంతమైన బంగ్లా ఉండగా.. తాజాగా హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ సినీ విలేజ్‌లో పెద్ద విల్లాను నిర్మించనున్నాడని టాక్. ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో రూ.120 కోట్లతో రెండు ఎకరాలు కొన్నాడని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు దగ్గరగా ఉంటుందనీ, ట్రాఫిక్ పెద్దగా వుండని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. ప్రభాస్ అక్కడ 80 కోట్ల రూపాయలతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ లేదా బంగ్లాను నిర్మించాలనుకుంటున్నాడట. మొత్తంగా కొత్త విల్లా కోసం ప్రభాస్ 200 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు సమాచారం. చదవండి: సమంత ఐటమ్ సాంగ్ పాడిన సింగర్.. మంగ్లీకి ఏమవుతుందో తెలుసా! కాగా నానక్‌రామ్‌గూడలో అనేక మంది స్టార్లతో సహా ఇతర రంగాలకు చెందిన పేరుమోసిన వ్యక్తులు నివసిస్తుంటారు. అంతేగాక షూటింగ్ జరిగే ప్రదేశాలకు చేరువలో ఉంది. ఇప్పటికే బాహుబలికి జూబ్లీహిల్స్‌లో ఓ భవంతి ఉంది. ఇక్కడ ఫ్యాన్స్ తాకిడి ఎక్కువగా ఉండడంతో ఎప్పటి నుంచో ప్రైమ్ రియల్ ఎస్టేట్ కొనాలని ప్రభాస్ ఎజెండాలో ఉంది. ఇప్పుడు కొన్న స్థలంలో తనకు అనుకూలంగా నిర్మించుకోనున్నట్లు వినికిడి. చదవండి: విడాకులు తీసుకుంటే మహిళలు చనిపోవాలా?.. నటి ఘాటు రిప్లై -
అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్ సంస్థ
Vijay Mallya Kingfisher House Sold For Rs 52 Crores: కింగ్ ఆఫ్ గుడ్టైమ్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్నాయి. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ చేజిక్కించుకుంది. వేలానికి ఆస్తులు విజయ్‌మాల్యా... బిజినెస్ రంగానికి గ్లాబర్ సొబగులు అద్దిన వ్యాపారవేత్త. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్. అయితే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. చివరకు తమ అప్పుల కింద విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించాయి. రూ. 52 కోట్లు ముంబై ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్‌ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2016 నుంచి ప్రస్తుతం వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తెచ్చింది. అయితే ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలు మార్లు బ్యాంకులు ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది. -
ముంబైలో కొత్తింట్లోకి షిఫ్ట్ అయిన రష్మిక
పరిశ్రమలోకి వచ్చిన తక్కవ కాలంలోనే దక్షిణాది స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మిక మందన్నా. ‘ఛలో’తో సూపర్ హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో యమ బిజీగా ఉంది. తెలుగులో టాప్ హీరోయిన్గా కొనసాగుతూనే, బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఒకేసారి గుడ్ బై, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటిస్తూనే, మరో సినిమాకు కూడా సైన్ చేసింది. చూస్తుంటే బాలీవుడ్లోనే రష్మిక జెడ్ స్పీడ్‌లా దూసుకుపోయేలా కనిపిస్తుంది. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఇటీవలె రష్మిక ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందన్న సంగతి తెలిసిందే. రీసెంట్గా కొత్త ఇంట్లోకి రష్మిక షిఫ్ట్ అయ్యింది. ఈ విషయాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియజేస్తూ.. ఎట్టకేలకు కొత్త అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యాను. దీనికోసం చాలానే షాపింగ్ చేయాల్సి వచ్చింది. అయితే నేను కొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నా అసిస్టెంట్ సాయి నాకు ఇళ్లు షిఫ్ట్ అవ్వడంలో సహాయం చేశాడు. ఆరా(పప్పీ) నేను చాలా అలసటతో ఉన్నా దానిని అధిగమించాం అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ విల్లా ధర చాలా కాస్ట్లీ అని సమాచారం. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో క్రియేటివ్ డైరెక్టర్ సుకూమర్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: రష్మిక కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ 900 కి.మీ ప్రయాణం ఛాన్స్ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా : రష్మిక -
ఇళ్లున్నాయ్.. కొనేవాళ్లే లేరు!
7,97,623 : దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూన్ వరకు అమ్మకాలకు నోచుకోని ఇళ్లు 4,13,000 : వీటిల్లో మధ్యతరగతి వర్గాల కోసం సరసమైన ధరల్లో ఉన్న ఇళ్లు సాక్షి, హైదరాబాద్: రండి బాబు.. రండి... సరసమైన ధరల్లో ఇళ్లు కావాలా.. వెంటనే సంప్రదించండి.. అంటూ నిర్మాణసంస్థలు కొనుగోలుదారుల వెంట పడాల్సి వస్తోంది. స్థిరాస్తిరంగం ఊపు మీదున్నా.. రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం మాత్రం మందకొడిగా నడుస్తోంది. ప్లాట్ల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నా.. ఫ్లాట్ల అమ్మకాలు మాత్రం పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండగా, రాష్ట్రంలో కొంత మెరుగ్గానే ఉంది. అయితే ఇక్కడ కూడా కాంక్రీట్ నిర్మాణాల అమ్మకాలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. భూముల విలువలు నింగినంటడం, ముమ్మర నిర్మాణాలు, నిర్మాణ వ్యయం పెరగడంతో విల్లాలు, ఫ్లాట్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు లేకపోవడంతో గృహాల అమ్మకాల్లో వృద్ధి తగ్గింది. ప్రాప్ టైగర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ సర్వే ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల తాకిడితో రాజధాని పరిసర ప్రాంతం రియల్ రంగానికి చోదకశక్తిగా మారింది. ఇతర మెట్రో నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్తోపాటు చదరపు అడుగు ధరలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితి మన దగ్గర తక్కువ కాబట్టి అమ్ముడుకాని ఇండ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కేంద్ర బడ్జెట్లో గృహ రుణాల వడ్డీ తగ్గింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచడం వల్ల ఇళ్ల ఖరీదు ఊపందుకుంటుందని నిర్మాణరంగ నిపుణులు అంచనా వేస్తున్నా.. ప్రస్తుతానికి మాత్రం నిలకడ కనిపిస్తోంది. నేల చూపులు.. నింగిలో ధరలు రెరా చట్టం అమలు.. నిర్మాణ వ్యయం పెరగడం.. డెవలప్మెంట్లో భూ యజమానికి ఇచ్చే నిష్పత్తి శాతం పెరగడం కూడా ఫ్లాట్ల ధరలు అనూహ్యంగా పెరగడానికి కారణం. భూయజమానికి లెక్కకు మించి ఫ్లాట్లు ఇవ్వాల్సి రావడం, గుడ్‌విల్ కూడా చెల్లించాల్సి రావడంతో ఫ్లాట్ల ధరలు పెంచక తప్పడం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు తగిన సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేలా అమ్మకాలు జరగడం లేదు. ఈ కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయంలోనూ పెరుగుదల వస్తోంది. ఈ కారణాలన్నింటితో సదరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ధరలు క్రమేణా పెంచాల్సి వస్తోంది. ఈ క్రమంలో అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోందన్నది ఓ ప్రముఖ బిల్డర్ అభిప్రాయం. గతంతో పోలిస్తే కొనుగోలుదారుల్లో అవగాహన పెరగడంతో నిర్మాణ సంస్థ గురించి వాకబు చేస్తున్నారు. అంతకుముందు చేపట్టిన ప్రాజెక్ట్‌ల నాణ్యత, సమయానికి ఇస్తారా.. లేదా.. వంటి విషయాలను తెలుసుకున్న తర్వాతనే కొనేందుకు ముందుకొస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయా? నిబంధనల మేరకు కడుతున్నారా.. లేదా.. తెలుసుకున్న అనంతరం అడుగు వేస్తున్నారు. ఈ మార్పులు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని బిల్డర్లు చెపుతున్నారు. దీంతో పాటు బడా బడా సంస్థలు స్థిరాస్తి వ్యాపారంలోకి రావడంతో భూముల విలువలు ఆకాశన్నంటాయి. ఈ నేపథ్యంలో డెవలపర్లు లాభాపేక్షతో ధరలు పెంచేయడం.. సౌకర్యాలకు తగ్గట్టుగా చదరపు అడుగుల చొప్పున ధరలను నిర్దేశించడంతో ఫ్లాట్లు అందుబాటులో లేకుండాపోయాయి. దీనికితోడు గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మేడ్చల్, కొంపల్లి, కొండాపూర్, నార్సింగి, మంచిరేవుల, నెక్నాంపూర్, మణికొండ, హైదర్షాకోట్ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల తాకిడితో టెకీలు వ్యయం ఎక్కువైనా ఫ్లాట్ల కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో గేటెడ్ కమ్యూనిటీ, బడా సంస్థలు నిర్మించే ప్రాజెక్టుల్లో విల్లాలను కొనేందుకు సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇదే తరహాలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తే మాత్రం వాటిని అమ్మడం బిల్డర్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇక, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణాలు, అమ్మకాలు ఈ మధ్య కాలంలో తగ్గిపోవడం గమనార్హం. ఇళ్ల స్థలాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న ప్రజలు డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు కొనడానికి ఆసక్తి చూపడంలేదు. విల్లాలు, ఫ్లాట్ల నిర్వహణ వ్యయం భారీగా ఉండటంతో కొనుగోలుదారులు స్థలాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఆసాధారణంగా పెరిగిన ధరలు రియల్ రంగంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు కాసుల వర్షం కురిపిస్తుండటంతో నల్లధనం కూడా వెల్లువలా వస్తోంది. దీంతో భూముల విలువలు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య మాత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆషాఢమాసంలో రూ.500 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారాప్రభుత్వ ఖజానాకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా రూ.2,250 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అంటే అంతా స్థలాలు, సాగు భూముల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మందగించినా.. ట్రెండ్ మారుతోంది: రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు గ్రేటర్హైదరాబాద్లో నిర్మాణ రంగం శరవేగంగా పురోగమించడంతోపాటు స్థిరంగా వృద్ధిరేటు సాధిస్తోంది. కొంత కాలంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మందగించినప్పటికీ ఇప్పడు ట్రెండ్ మారుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్, ఐటీ, హార్డ్‌వేర్ పాలసీలతో పలు ప్రముఖ సంస్థలు నగరం వైపు దృష్టిసారించాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ ఫ్లాట్ల ధరలు నగరంలోనే అందుబాటు ధరల్లో ఉన్నాయి. -
సముద్ర గర్భంలో అద్భుతం.. అద్దె ఎంతో తెలుసా?!
మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలోయ్.. ఎప్పుడూ ఉరుకులూ, పరుగులూ, టెన్షన్లేనా..? కాంక్రీట్ జంగిల్లో, ఇరుకు గదుల్లో రోబోల్లా ఉండాల్సిందేనా..? ఇక చాలు.. అటువంటి బిజీ లైఫ్‌కి కాస్త విరామం ఇవ్వండి.. మా ‘మురాకా’ లో సేద తీరండి అంటూ ట్రావెల్ ప్రియులను ఆహ్వానిస్తోంది మాల్దీవుల ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా.. మురాకా అంటే పగడం అని అర్థం. మాల్దీవుల్లోని రంగాలీ ఐలాండ్‌లో ఉన్న ఓ విల్లా కూడా పగడంలా మెరిసిపోతుందట. అందుకే దానికి మురాకా అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ విల్లాగా పేరు పొందిన ఈ విల్లా నిర్మాణానికి సుమారు 15 బిలియన్లు ఖర్చు అయిందట. సింగపూర్‌లో తయారు చేసిన ఈ విల్లాను మాల్దీవులకు తీసుకు వచ్చి కాంక్రీట్ పోల్స్ సహాయంతో సముద్రంలో దించారు. వేగమైన గాలులు, అలలను తట్టుకుని ఇది నిలబడగలదు. హిందూ మహాసముద్రంలో 16 అడుగుల లోతులో నిర్మితమైన ఈ రెండు అంతస్తుల విల్లా గుండా అరుదైన సముద్రపు జీవులను వీక్షిస్తూ హాయిగా సేద తీరవచ్చు. జిమ్, బార్ వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు సూర్యుడిని చూసేందుకు విల్లా పైకి ఎక్కితే సరి. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మురాకాలో ఒక్కరాత్రి స్టే చేయాలంటే భారీగానే ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది మరి. అంతేకాదు ఒక వ్యక్తి ఈ విల్లాను కేవలం నాలుగు సార్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఒక్కరోజు అద్దె ఎంతో చెప్పలేదు కదూ.. జస్ట్ 36 లక్షలేనటండీ.