స్టార్ హీరో లగ్జరీ విల్లా.. అద్దెకు కూడా ఇస్తారట! | Shah Rukh Khan's luxurious home that can be rented for Rs 1.96 lakh per night - Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: షారుక్ లగ్జరీ విల్లా.. ఒక్క రోజుకు ఎన్ని లక్షలో తెలుసా?

Published Wed, Sep 6 2023 12:38 PM | Last Updated on Wed, Sep 6 2023 1:36 PM

Shah Rukh Khan luxurious home that can be rented for Rs 1.96 lakh - Sakshi

స్టార్ హీరో అంటేనే ఆ రేంజే వేరు. ఎక్కడికెళ్లినా సరే ప్రత్యేకంగా కనిపించాల్సిందే. అలా ఏ దేశానికి వెళ్లినా వారికంటూ ప్రత్యేక సదుపాయాలు ఉండేలా లగ్జరీ విల్లాలు కొనేస్తుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్‌ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో షారుక్ జోడీగా నయనతార నటించింది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలీవుడ్‌ హీరో ఆస్తుల  విషయానికొస్తే ముంబయి, దుబాయ్‌లో కోట్ల విలువైన సౌధాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే విదేశాల్లో షారుక్‌ ఖాన్‌కు ఉన్న మరో ఖరీదైన విల్లా గురించి తెలుసుకుందాం.

 

(ఇది చదవండి: దేశం పేరు మార్పుపై అమితాబ్‌ ఆసక్తికర ట్వీట్‌)

అమెరికాలోని లాజ్‌ ఎంజిల్స్‌లో షారుక్‌ ఖాన్‌కు అత్యాధునిక వసతులతో ఖరీదైన విల్లా కూడా ఉంది. అంతే కాకుండా ఆ విల్లాను అద్దెకు కూడా ఇస్తారంట. ఓ రకంగా ఆ విల్లా ద్వారా పెద్ద బిజినెస్‌ నడిపిస్తున్నారు బాలీవుడ్ బాద్‌షా. అంతే కాకుండా ఫ్యామిలీతో కలిసి యూఎస్‌ వెళ్లినప్పుడు అక్కడే బస చేస్తారు. ఈ అత్యంత ఖరీదైన విల్లాలో ఆరు విశాలమైన గదులు, డ్రాయింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, జిమ్‌ లాంటి ప్రత్యేక సదుపాయాలు కూడా ఉన్నాయి. 

అద్దె ఎంతో తెలుసా? 

 లగ్జరీ సదుపాయాలున్న షారుక్ ఖాన్‌ విల్లాను అద్దెకు కూడా తీసుకోవచ్చు. ఆ ఇంట్లో ఒక రోజు ఉండాలంటే రూ.1.96 లక్షలు చెల్లించాల్సిందే. ఇంకేముంది మీరెప్పుడైనా అమెరికా లాస్ ఎంజిల్స్ వెళ్తే స్టార్ హీరో ఇంటికి అద్దె  చెల్లించి విలాసవంతమైన సౌకర్యాలను ఆస్వాదించవచ్చు. గతంలో ఈ విల్లా గురించి షారుక్ మాట్లాడుతూ..బయటి ప్రపంచానికి దూరంగా ఫ్యామిలీతో కొంత సమయం ఉండేందుకు.. రిఫ్రెష్‌ అయ్యేందుకు ఉంటుందని వెల్లడించారు.  జబ్ హ్యారీ మెట్ సెజల్ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఇంట్లోనే ఎక్కువ రోజులు ఉన్నారు షారుక్ భాయ్. ఇప్పటికే అతనికి దూబాయ్‌లోనూ రూ.200 కోట్ల విలువైన విల్లాను గిఫ్ట్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. షారుక్ నటించిన జవాన్ సెప్టెంబర్ 7 న థియేటర్లలోకి రానుంది.

(ఇది చదవండి: అందుకే అడల్ట్‌ సినిమాలు చేశా, ఎలాగో డబ్బులు కూడా బాగా వచ్చేవి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement