గిఫ్ట్‌గా వంద కోట్ల లగ్జరీ విల్లా.. స్వర్గాన‍్ని తలపిస్తున్న షారుక్ సౌధం! | Shah Rukh Khan luxurious Dubai beach home Cost Of 100 Crores | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: స్వర్గాన్ని తలపించే విల్లా.. ఆ లగ్జరీ ఫ్లాట్ ప్రత్యేకతలివే?

Sep 1 2023 5:56 PM | Updated on Sep 1 2023 7:27 PM

Shah Rukh Khan luxurious Dubai beach home Cost Of 100 Crores - Sakshi

సినీ తారల లైఫ్‌ స్టైల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వారి ఆదాయం కోట్లలోనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. స్టార్ హీరోల విషయాకొనికొస్తే ఏకంగా వంద కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారు. అలాంటి వారి లైఫ్ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.  బాలీవుడ్‌ తారలకైతే ఇండియాతో పాటు విదేశాల్లోనూ లగ్జరీ ఫ్లాట్స్ ఉన్నాయి. ముఖ్యంగా దుబాయ్‌లో ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఆస్తులు కొనుగోలు చేశారు. అలా కోట్ల విలువైన అత్యంత లగ్జరీ విల్లా కలిగిన స్టార్ హీరో గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

(ఇది చదవండి: మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన తమ్ముడు.. ఏడ్చేసిన బేబి హీరోయిన్‌! )

ప్రస్తుతం జవాన్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైన హీరో షారుక్ ఖాన్. బాలీవుడ్ బాద్‌షాగా పేరుపొందిన ఆయనకు ఇప్పటికే ముంబయిలో ఉన్న హోమ్ మన్నత్ గురించి అందరికీ తెలిసిందే. అతన్ని చూసేందుకు అభిమానులు సైతం ఇంటి బయట కనిపిస్తుంటారు. ఆ ఇంటి విలువ దాదాపు రూ.200 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. దీంతో ఆయనకు చాలా చోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుబాయ్ విల్లా 'జన్నత్' గురించి మీకు తెలుసా? 'స్వర్గానికి ఏ మాత్రం తీసిపోని దుబాయ్ ఇంటి గురించి తెలుసుకుందాం. 

షారూఖ్ ఖాన్ దుబాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అతనికి అక్కడ  కోట్ల  విలువ చేసే ఆస్తులున్నాయి. రూ.100 కోట్ల విలువైన అందమైన పామ్ జుమేరాలో అతనికి లగ్జరీ విల్లా ఉంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం నఖీల్ 2007లో ఈ గ్రాండ్ విల్లాను షారూఖ్ ఖాన్‌కు బహుమతిగా ఇచ్చాడు. దీనికి ఇంటీరియర్‌ను షారుక్ భార్య గౌరీ ఖాన్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దుబాయ్‌లోని అతని ఇంటిని 'జన్నత్' అని పిలుస్తారు.  అంటే స్వర్గం అని అర్థం.

(ఇది చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? 63 ఏళ్లంటే నమ్ముతారా?)

జన్నత్ ప్రత్యేకతలు..

షారూఖ్ ఖాన్ 'జన్నత్' విల్లా ప్రత్యేకతలు తెలిస్తే మీరు షాకవ్వాల్సిందే. ఇందులో ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉంది.   'జన్నత్' విల్లా దాదాపు 14 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది. ఇందులో 6 బెడ్‌రూమ్‌లు ఉన్నాయి. బీచ్-వ్యూగా ఉండే ఇందులో రెండు రిమోట్ కంట్రోల్ గ్యారేజీలు. ఒక ప్రైవేట్ పూల్ కూడా ఉన్నాయి. ఈ ఆస్తి గురించి గౌరీ ఖాన్ మాట్లాడుతూ.. ది దుబాయ్ స్కైలైన్ వ్యూ అని.. ఈ ప్లేస్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అంతే కాకుండా షారుక్ తరచుగా దుబాయ్‌కు వెళ్తాడు.. అందుకే నగరంలో ఇల్లు ఉండటం మంచిదని ఆమె అన్నారు.

విల్లా గురించి గౌరీ ఖాన్ మాట్లాడుతూ..' ఫ్లోర్, వాల్ కవరింగ్‌లను ముందే డిజైన్ చేశారు.  అయితే పిల్లల గదిని వారి అభిరుచుల ఆధారంగా డిజైన్ చేశాను. ఆర్యన్ ఖాన్, సుహానా, అబ్రామ్ ఖాన్ కూడా విల్లాలో వారి ఇష్టమైన ప్లేస్‌లు కూడా ఉన్నాయి. ఆర్యన్ ఖాన్ గదిలో పెద్ద టీవీ. అబ్రామ్ ఖాన్ ఎక్కువ సమయం బీచ్‌లో గడుపుతాడు. సుహానా ఖాన్ పూల్‌లో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడుతుంది.' అని వెల్లడించింది. అలాగే ముంబయి, దుబాయ్‌తో పాటు లండన్, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, అలీబేగ్‌లలో కూడా ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం ఆయన నటించిన జవాన్ వచ్చే నెల 7న రిలీజ్ కానుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement