దీపికా పదుకోన్‌ పెళ్లి విల్లా ఇదే! | Deepika Padukone, Ranveer Singh to Get Married in Italy | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 5 2018 2:21 PM | Last Updated on Mon, Nov 5 2018 2:26 PM

Deepika Padukone, Ranveer Singh to Get Married in Italy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బెంగళూరులో నంది పూజ, ముంబైలో హల్దీ కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్న ప్రముఖ బాలీవుడ్‌ తారలు దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌లు నవంబర్‌ 14వ తేదీన ఇటలీలో వైభవోపేతంగా వివాహం చేసుకోబోతున్న విషయం తెల్సిందే. వారు ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సరస్సుగా ప్రసిద్ధి చెందిన ఇటలీలోని కోమోను ఆనుకొని ఉన్న విల్లా డెల్‌ బల్బీయానెల్లోలో పెళ్లి చేసుకోబోవడం మరో విశేషం.

ఆ విల్లాకు చేరుకోవాలంటే చుట్టూ పచ్చటి చెట్లతో కళకళలాడే సరస్సులో పడవపై ప్రయాణించాల్సిందే. ఎవరికైనా ఆ పడవ ప్రయాణం జీవితంలో మరచిపోలేని అనుభూతిని ఇస్తుందని పర్యాటకులు చెబుతారు. ప్రముఖ అమెరికా నటుడు జార్జి తిమూతి క్లూనీ, ప్రముఖ అమెరికా పాప్‌ గాయకురాలు, సినీ తార మడోనాలకు ఈ ప్రాంతంలోనే విల్లాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పెళ్లి కోసం ఓ విల్లా తీసుకోవాలంటే రోజుకు ఎనిమిదిన్నర లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు అద్దె కింద చెల్లించాల్సి ఉంటుంది. దీపికా పడుకోన్‌ పెళ్లి చేసుకోబోయే విల్లా అద్దె రోజుకు 20 లక్షల రూపాయలకు పైమాటేనని తెల్సింది.

ఈ విల్లాలకు సమీపంలోని గోథె ఆర్కిటెక్చర్‌తో నిర్మించిన సంప్రదాయక గ్రామాల్లో షాపింగ్‌ చేయడం కూడా ఓ మధురానుభూతిగా పర్యాటకులు వర్ణిస్తారు. విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలు కూడా ఇటలీలోనే పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement