మాల్యా విల్లా..కొనే వారు కరవు
ముంబై: ఒకప్పుడు కింగ్‌ఫిషర్ సామ్రాజ్యాధినేత విజయ్‌మాల్యా విలాసాలకు వేదికగా నిలిచిన విల్లా అది. దాన్ని వేలం వేయబోగా కొనేవారు కరువయ్యారు. బ్యాంకులకు రూ.9 వేల కోట్లకు పైగా రుణాలు ఎగవేసిన విజయ్‌మాల్యా ప్రస్తుతం ప్రవాసంలో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. గోవాలోని విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ విల్లా విక్రయానికి బుధవారం రుణదాతలు ఈ వేలం నిర్వహించారు. అయితే, ఒక్క బిడ్ కూడా రాలేదు.
దీంతో తమ బకాయిలు రాబట్టుకోవడానికి బ్యాంకులు చేసిన ప్రయత్నం మరోమారు విఫలమైంది. మాల్యా విమానం, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లోగోలు, ఇతర ఆస్తుల వేలం విషయంలోనూ రుణదాతలు వరుస వైఫల్యాలను చవిచూస్తున్న విషయం విదితమే. రూ.85.3 కోట్లను రిజర్వ్ ధరగా నిర్ణయించడం వల్లే విల్లా కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గోవాలోని కండోలిన్ ప్రాంతంలో 12,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ విల్లాలోనే మాల్యా నిత్యం పార్టీల్లో మునిగి తేలింది. ఈ విల్లాపై హక్కులు యునెటైడ్ బ్రెవరీస్ హోల్డింగ్స్‌కు ఉండగా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దీన్ని బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి 2010లో రుణాలు తీసుకుంది.