భారత క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ(ఏప్రిల్ 24) 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. 1973 ఏప్రిల్ 24న జన్మించిన సచిన్ టెండూల్కర్ 16 ఏట అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు 24 ఏళ్ల పాటు సచిన్ తన బ్యాటింగ్‌తో క్రికెట్‌ను శాసించాడనే చెప్పొచ్చు. ఈ క్రమంలో అతడు సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అంతర్జాతీయ క్రికెట్‌లో వంద సెంచరీలు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
సెంచరీలతో పాటు వన్డే, టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత సచిన్ సొంతం. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ అందుకున్న ఆటగాడిగాను సరికొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. అతను సాధించిన రికార్డుల గురించి కాకుండా కాస్త కొత్తగా సచిన్ నివాసముంటున్న లగ్జరీ విల్లా గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
►సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం ముంబైలోని బాంద్రా ప్రాంతంలో విశాలమైన విల్లాలో తన కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు . 2007లో రూ.39 కోట్లు పెట్టి పాత విల్లాను కొనుగోలు చేసిన సచిన్.. దాదాపు రూ. వంద కోట్లతో కొత్త పద్దతిలో లగ్జరీ విల్లాను నిర్మించాడు.
►బాంద్రాలోని పెర్రీ రోడ్‌లో ఉన్న ఈ విల్లా అరేబియన్ సముద్రానికి దగ్గరలో ఉంది. ఇదే ప్రాంతంలో సెలబ్రిటీస్, సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు నివాసం ఉంటున్నారు.
►సచిన్ లగ్జరీ విల్లా దాదాపు ఆరువేల స్క్వేర్‌ఫీట్స్‌లో ఉంటుంది. బంగ్లా మొత్తం మూడు ఫ్లోర్స్‌లో ఉండగా.. రెండు బేస్‌మెంట్స్, ఒక టెర్రస్ ఉంటుంది. విశాలమైన గెస్ట్ రూమ్స్‌తో పాటు టాప్ ఫ్లోర్‌లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది.
►సచిన్‌కు కార్లంటే ఎంత పిచ్చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోయర్ బేస్‌మెంట్‌లో ఒకేసారి 40-50 కార్లను పార్క్ చేసేలా వీలు ఉంటుంది. ఇక అప్పర్ బేస్‌మెంట్‌లో సెకండరీ కిచెన్, సర్వెంట్ క్వార్టర్స్, సెక్యూరిటీకి సంబంధించిన మాస్టర్ సర్వెలియన్స్ ఉంటాయి.
►కాగా సచిన్ తాను నివాసముంటున్న ఇంటికి రూ. 100 కోట్లతో ఇన్సూరెన్స్ చేయించడం విశేషం. ఆ పాలసీలో ఉగ్రవాద దాడులు, యాక్ట్ ఆఫ్ గాడ్(భూకంపాలు), బాంబ్ బ్లాస్ట్ తదితర వాటికి ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా రూపొందించారు.
►సచిన్ ఉంటున్న విల్లా మెయిన్ లివింగ్ రూమ్ దాదాపు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. రూమ్ నిండా వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్‌తో కూడిన కలర్స్ ఎక్కువగా కనిపిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment