రూ.26 లక్షలకే ఫ్లాట్! | Flat Rs 26 lakh! | Sakshi
Sakshi News home page

రూ.26 లక్షలకే ఫ్లాట్!

Published Sat, Jun 14 2014 12:52 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రూ.26 లక్షలకే ఫ్లాట్! - Sakshi

రూ.26 లక్షలకే ఫ్లాట్!

* కాప్రాలో సాకేత్ ప్రణామ్ రిటైర్మెంట్ కమ్యూనిటీ
* గౌడవల్లిలో ‘భూ:సత్వ’ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్
* సాకేత్ ఇంజనీర్స్ ప్రై.లి. డెరైక్టర్ రవి కుమార్

 
 సాక్షి, హైదరాబాద్: ఫ్లాట్.. ఏ వెంచర్‌లో చూసినా చ.అ.కి రూ. 2,500- 5,000 పెట్టాల్సిందే. మరి సామాన్యుల సొంతింటి కల తీరేదెలా? అందుకే అందుబాటు ధరల్లో ఫ్లాట్లను అందించేందుకు సరికొత్త ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది సాకేత్ ఇంజనీర్స్ ప్రై.లి. ప్రశాంత వాతావరణం.. ఆహ్లాదకర పరిసరాలు.. ఆధునిక రక్షణ ఏర్పాట్లు.. కుటుంబంతో కలసి ఆస్వాదించడానికి పచ్చికబయళ్లు.. బంధుమిత్రులొస్తే ఆవరణలో సమస్త సౌకర్యాలతో నగరంలో పలు సరికొత్త ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ రవి కుమార్ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు.
 
* హైదరాబాద్‌కే తలమానికంగా నిలిచేలా కొంపల్లికి అతి సమీపంలోని గౌడవల్లిలో ‘భూ:సత్వ’ లగ్జరీ విల్లాలను నిర్మిస్తున్నాం. మొత్తం 70 ఎకరాల్లో 500 విల్లాలొస్తాయి. ఫేజ్-1లో 19 ఎకరాల్లో 170 విల్లాలను నిర్మించాం. ఫేజ్-2ను ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం. ఒక్కో విల్లా విస్తీర్ణం 200-400 చ.అ. మధ్య ఉంటుంది. ప్రారంభ ధర రూ.65 లక్షలుగా నిర్ణయించాం.
* ఔటర్ రింగ్‌రోడ్ గ్రోత్‌కారిడార్‌లో నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ కూడా ఇదే. నిర్మాణంలో నాణ్యతతో పాటు పచ్చదనానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం. వెంచర్‌లోకి అడుగుపెట్టగానే సేదతీరేలా పచ్చని పచ్చిక బయళ్లు, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌజ్, హెల్త్ క్లబ్, ఇండోర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్, జాగింగ్, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటు వంటి అంతర్జాతీయ సౌకర్యాలుంటాయి. ప్రతీ విల్లాకు సోలార్ వాటర్ హీటర్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ రీసైక్లింగ్‌లు కూడా ఉంటాయి.
వృద్ధులకు ఆపన్నహస్తం అందించడానికి సరికొత్త రిటైర్మెంట్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. కాప్రాలో నాలుగున్నర ఎకరాల్లో సాకేత్ ప్రణామ్ పేరుతో ఈ ప్రాజెక్ట్ వస్తోంది. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 333. ప్రారంభ ధర రూ.26 లక్షలు. ఆరోగ్యం, ఆనందం, విలాసం, శాంతి, భద్రత, ప్రేమానురాగాల కలబోతే ఈ గృహాల ప్రత్యేకత. ఇదే ప్రాంతంలో మూడున్నర ఎకరాల్లో ‘సాకేత్ శ్రీయం’ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించాం. మొత్తం 25 అంతస్తుల్లో 312 ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.40 లక్షలు.
* బెంగళూరులోనూ సాకేత్ సంస్థ పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. సబ్జాపూర్‌రోడ్‌లో రెండున్నర ఎకరాల్లో క్వాలిపోలిస్ పేరుతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 200. ప్రారంభ ధర రూ.75 లక్షలు. త్వరలో మైసూర్ రోడ్‌లోని కింగేరిలో మరో ప్రాజెక్ట్‌కు ప్రారంభిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement