కెనడియన్‌ వుడ్‌ విల్లాకు అవార్డు  | Canadian Wood Villa Has Received Rare Honor | Sakshi
Sakshi News home page

కెనడియన్‌ వుడ్‌ విల్లాకు అవార్డు 

Published Sat, Nov 26 2022 3:17 AM | Last Updated on Sat, Nov 26 2022 2:41 PM

Canadian Wood Villa Has Received Rare Honor - Sakshi

అవార్డును స్వీకరిస్తున్న గజానన్‌ పట్నాకర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాక్‌  ప్రాజెక్ట్స్‌ నిర్మించిన కెనడియన్‌ వుడ్‌ విల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సస్టెయినబుల్‌ ప్రాజెక్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ఇన్‌ ఇండియా అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్‌లోని బీటీఆర్‌ గ్రీన్స్‌లో రూపుదిద్దుకున్న విల్లా ప్రాజెక్ట్‌కు ఈ అవార్డు దక్కిందని కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో నేషనల్‌ అవార్డ్స్‌ ఫర్‌ లీడర్‌షిప్‌ అండ్‌ ఎక్సలెన్స్‌ టీఎంలో భాగంగా ఫారెస్ట్రీ ఇన్నోవేషన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ (ఎఫ్‌ఐఐ) బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గజానన్‌ పట్నాకర్‌ ఈ అవార్డును అందుకున్నారు. కెనడాకు చెందిన ప్రభుత్వ సంస్థ ఫారెస్ట్రీ ఇన్నోవేషన్‌ కన్సల్టింగ్‌ (కెనడియన్‌ వుడ్‌)తో కలిసి మ్యాక్‌ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసింది. కెనడాలోని అడవుల నుంచి సేకరించిన కలపతో పర్యావరణహితమైన విల్లాలను నిర్మించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement