wood
-
చక్కనైన చెక్క ఇల్లు (ఫొటోలు)
-
పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
దేశంలో ఫర్నిచర్ ధరలు వచ్చే ఏడాది పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి ప్లైవుడ్ తయారీదారులందరికీ ఐఎస్ఐ (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తా సంస్థ ‘మింట్’ నివేదించింది. బాయిలింగ్ వాటర్ ప్రూఫ్‌గా ప్రచారం చేసే ప్లైవుడ్‌కు ఆ మేరకు ఐఎస్ఐ సర్టిఫికేషన్ కూడా అవసరముంటుందని ఇద్దరు అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది.ఫర్నిచర్, ఇతర వస్తువుల్లో ఉపయోగించే ప్లైవుడ్ నాణ్యత, మన్నికను మెరుగుపరచడం, సవాళ్లతో కూడిన వాతావరణంలో కూడా అవి ఎక్కువ కాలం ఉండేలా చూడటం లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, నేపాల్ నుంచి నాసిరకం ప్లైవుడ్ దిగుమతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ప్లైవుడ్ తయారీదారులు అన్ని గ్రేడ్ల ప్లైవుడ్‌కు ఫంగల్ నిరోధకత కోసం మైకోలాజికల్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.ఈ నిబంధనపై ప్లైవుడ్ మేకర్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొత్త ప్రమాణాలు ప్లైవుడ్ నాణ్యతను మెరుగుపరుస్తాయని, వినియోగదారులతో పాటు తయారీదారులకు ప్రయోజనం చేకూరుస్తుందని కొందరు చెబుతుండగా మరికొందరు దీన్ని ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు.అయితే ఈ నిర్ణయం వల్ల వచ్చే ఏడాది ప్లైవుడ్ ధరలు 15 శాతం పెరుగుతాయని ఆల్ ఇండియా ప్లైవుడ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్ నరేష్ తివారీ తెలిపారు. నాసిరకం ప్లైవుడ్ ఉత్పత్తుల దిగుమతిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ప్లైవుడ్ తయారీదారులందరూ బీఐఎస్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా దీనిపై అటు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి గానీ, బీఐఎస్ ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి స్పందన లేదు. -
యువతకు ఉపాధి.. రైతులకు లాభం
సాక్షి, అమరావతి: ఓవైపు యువతకు ఉపాధి.. మరోవైపు రైతులకు ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరంలో పారిశ్రామిక పార్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. కలప ఆధారిత పరిశ్రమల కోసమే ప్రత్యేకంగా ఈ పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసింది. ఈ వుడ్ పార్క్‌లో ప్రధాన (యాంకర్) కంపెనీగా అగ్రగామి సంస్థ సెంచురీ ప్యానల్స్ భారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 100 ఎకరాల్లో నెలకొల్పిన సెంచురీ ప్యానల్స్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల రోజుల క్రితం లాంఛనంగా ఉత్పత్తిని ప్రారంభించారు. సెంచురీ ప్యానల్స్‌కు డిసెంబర్ 23, 2021లో సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేవలం రెండేళ్లలోనే వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఈ యూనిట్ ద్వారా 2,266 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా అంతకు రెట్టింపు సంఖ్యలో పరోక్ష ఉపాధి లభించనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రెండో దశ విస్తరణ పనులను ప్రారంభించడానికి సెంచురీ ప్యానల్స్ ప్రణాళికలు సిద్ధం చేసింది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు.. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో సుబాబుల్, జామాయిల్ సాగు చేసే రైతులు గిట్టుబాటు ధరలు లేక గుట్టలుగా పేరుకుపోయిన కలప లాట్లను చూపించి ఆయనకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చాక 2021 జూలైలో బద్వేలు నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోపవరం పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేగంగా భూసేకరణ పూర్తి చేసిన ఏపీఐఐసీ గోపవరం వద్ద 490.36 ఎకరాల్లో కలప ఆధారిత పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేసింది. రైతులకు సబ్సిడీ ధరలకే 50 లక్షల విత్తన మొక్కలు.. సెంచురీ ప్యానల్స్‌లో హై ప్రెజర్ లామినేట్స్ (హెచ్పీఎల్), మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్స్ (ఎండీఎఫ్) తయారవుతాయి. రోజుకు 950 టన్నుల సామర్థ్యం గల ఎండీఎఫ్‌లను తయారుచేస్తారు. ఇందుకోసం భారీ సంఖ్యలో కలప అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో 150 కి.మీ పరిధిలో వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతుల నుంచి సెంచురీ ప్యానల్స్ జామాయిల్‌ను సేకరించనుంది. ఇందుకోసం సుమారు 80,000 ఎకరాల్లో జామాయిల్ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు సెంచురీ ప్యానల్స్ జనరల్ మేనేజర్ రమేష్‌కుమార్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు తక్కువ కాకుండా జామాయిల్‌ను కొనుగోలు చేస్తామన్నారు. దీనివల్ల సుమారు 25,000 రైతు కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇప్పటికే రైతులకు 50 లక్షల విత్తన మొక్కలను సబ్సిడీ ధరలకు అందించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఉద్యోగ నియామకాల్లో 80% మంది స్థానిక యువతనే తీసుకుంటున్నామన్నారు. తొలుత గోపవరం, బద్వేలు మండలాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వీటి తర్వాత వైఎస్సార్ జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే ఈ యూనిట్‌కు అవసరమైన ముడి సరుకును అందించే రీసిన్ తయారీ యూనిట్‌ను నాయుడుపేట వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ యూనిట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వస్తుందన్నారు. యాంకర్ యూనిట్ ఏర్పడటంతో దీనికి అనుబంధంగా అనేక కలప ఆధారిత పరిశ్రమలు ఇక్కడకు రానున్నాయని పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఉద్యోగం రాదనుకున్నా.. ఐటీఐ ఎలక్ట్రికల్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఐదేళ్లపాటు ఎదురుచూశాను. ఇక ఉద్యోగం రాదనుకున్నా. సెంచురీ ప్యానెల్స్ ఏర్పాటుతో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడంతో నన్ను ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. దీంతో మా కుటుంబం ఆనందానికి అవధులు లేవు. – గుడి మెగురయ్య కలసపాడు, వైఎస్సార్ జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగాలు.. రైతులకు మేలు.. సెంచురీ ప్యానెల్స్‌కు అవసరమయ్యే రా మెటీరియల్ కోసం జామాయిల్ సాగు చేసుకునేందుకు పరిశ్రమ వారు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా మొక్కలను సబ్సిడీ ద్వారా నేరుగా రైతు పొలాల వద్దకే తెచ్చిస్తామన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా కనీస మద్దతు ధరకు వారే కొనుగోలు చేస్తామన్నారు. జామాయిల్ సాగుపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు, కూలీలకు ఉపాధితో పాటు రైతులకు మేలు జరుగుతుంది. – రూకల దేవదాసు గోపవరం ప్రాజెక్టు కాలనీ, వైఎస్సార్ జిల్లా వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ బాగా వెనుకబడిన ప్రాంతమైన బద్వేలులో యూనిట్ ఏర్పాటు చేయడానికి సెంచురీ ప్యానల్స్ ముందుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ నుంచి 0.07 టీఎంసీల నీటిని కేటాయించడంతోపాటు 132 కేవీ విద్యుత్ సరఫరా, రహదారుల నిర్మాణం వంటి మౌలిక వసతులను కల్పించాం. పరిశ్రమలకు ఇచ్చే రాయితీలతోపాటు సబ్సిడీ ధరపై విద్యుత్ అందించాం. స్థానిక యువతకు ఉపాధి కల్పించడానికి రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్నాం. – ఎన్.యువరాజ్, కార్యదర్శిరాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ -
‘ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్’ ముందు ఎర్ర చందనం వెలవెల..
ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు అత్యుత్తమ ఫర్నిచర్‌ను సమకూర్చుకోవాలని అనుకుంటారు. ఖరీదైన కలప విషయానికొస్తే భారతదేశంలో ఎర్ర చందనం అత్యంత ఖరీదైనదిగా పరిగణిస్తారు. అయితే ప్రపంచంలో దీనికి మించిన ఖరీదైన కలప మరొకటుంది. అదే ఆఫ్రికన్ బ్లాక్ కలప. దీని ఖరీదెంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. ఆఫ్రికన్ బ్లాక్ కలపను అత్యంత విలువైన వస్తువులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇది ప్రపంచంలో అతి అరుదుగా దొరుకుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ కలప ప్రపంచంలోని 26 దేశాలలో మాత్రమే కనిపిస్తుంది. అలాగే ఆఫ్రికన్ బ్లాక్ చెట్టు పూర్తిగా అభివృద్ధి చెందడానికి 60 సంవత్సరాలు పడుతుంది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టు ఎక్కువగా ఆఫ్రికన్ ఖండంలోని మధ్య, దక్షిణ భాగాలలో పెరుగుతుంది. ఈ కలప ధర కిలో రూ.7 నుంచి 8 వేల వరకూ పలుకుతుంది. ఫర్నిచర్‌తో పాటు, షెహనాయ్, వేణువుతో సహా పలు సంగీత వాయిద్యాలను ఈ చెక్కతో తయారు చేస్తారు. అత్యంత ధనవంతులు తమ ఇంటిని ఆకర్షణీయంగా మార్చుకోవడానికి ఈ కలపను ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఈ కలపకున్న డిమాండ్, ధరను దృష్టిలో పెట్టుకుని స్మగ్లర్లు ఈ కలపను స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్‌ను రక్షించేందుకు కెన్యా. టాంజానియా తదితర దేశాలలోని ప్రభుత్వాలు సాయుధ బలగాలను వినియోగిస్తున్నాయి. -
అతి పెద్ద కలప గాలిమర!
క్రిస్మస్ పర్వదినం రోజున వెలుగులు విరజిమ్మే క్రిస్మస్ చెట్టు గురించి మనందరికీ తెలుసు. కేవలం ఆ చెట్టు కలపను వాడి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన గాలి మర (విండ్ టర్బైన్ టవర్)ను తయారు చేశారంటే నమ్మగలరా?. కానీ ఇది నిజంగానే స్వీడన్లో ఉంది. గోథన్బర్గ్ నగర శివారులో పెనుగాలుల నడుమ కూడా ఠీవిగా నుంచుని విద్యుదుత్పత్తి చేస్తూ 400 ఇళ్లలో వెలుగులు నింపుతోంది! 492 అడుగుల ఎత్తయిన ఈ గాలిమరను పూర్తిగా కలపతోనే నిర్మించడం విశేషం. కలపతో తయారైన అత్యంత ఎత్తయిన విండ్ టర్బైన్ టవర్ ఇదే. క్రిస్మస్ ట్రీగా పరిచితమైన స్ప్రూస్ జాతి చెట్టు కలపను దీని నిర్మాణంలో వాడారు. దాని కలప అతి తేలికైనది, అత్యంత దృఢమైనది. ‘‘విండ్ టర్బైన్ టవర్ల నిర్మాణంలో ఉక్కును వాడతారు. కానీ అత్యంత ఎత్తైన టవర్ల తయారీ, తరలింపు, నిర్వహణ కష్టం. స్టీల్ ముక్కలను చిన్న భాగాలుగా చాలా నట్లతో బిగించాలి. తుప్పు పట్టకుండా చూడాలి. స్టీల్ భాగాల తయారీకి వేల గంటలపాటు ఫర్నేస్‌ను మండించాలి. భారీగా కర్బన ఉద్గారాలు వెలువడతాయి. కానీ చెక్క టవర్ తయారీ చాలా సులువు. తరలింపు సమస్యలుండవు. పర్యావరణహితం కూడా. క్రిస్మస్ ట్రీ తయారీకి చెట్టు పై భాగాన్ని నరకగా వచ్చే కలపనే వాడుతాం. కనుక అటవీ విధ్వంసమన్న మాటే లేదు. ఉక్కుతో పోలిస్తే చెక్కతో అతి తక్కువ శ్రమతో చాలా ఎక్కువ టవర్లను నిర్మించవచ్చు’’ అని దీన్ని తయారు చేసిన స్వీడన్ అంకుర సంస్థ మోడ్వియన్ తెలిపింది. ‘‘ఏటా 20,000 ఉక్కు టర్బైన్లను నిర్మిస్తున్నారు. వచ్చే పదేళ్లలో ఏటా 10 శాతమైనా చెక్క టవర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం’’ అంటోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బంగారం కంటే ఖరీదైన కలప.. ఏకంగా కిలో రూ. 73 లక్షలు!
చందనం, ఎర్రచందనం వంటి ఖరీదైన కలప రకాలు మనకు తెలుసు. వాటన్నింటినీ మించిన కలప ఇది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర బంగారం కంటే ఎక్కువే! ఇది ‘అగర్వుడ్’. అంటే, అగరు కలప. ఉత్తరభారత దేశంలో దీనినే ‘ఔద్’ అని అంటారు. ఈ కలప నుంచి వెలువడే జిగురును అగరొత్తులు, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. భారత్, చైనా, శ్రీలంక, ఇండోనేసియా, మలేసియా, లావోస్, కంబోడియా, థాయ్‌లాండ్, పాపువా న్యూగినీ దేశాల్లోని దట్టమైన అడవుల్లో అగరు వృక్షాలు కనిపిస్తాయి. ఇటీవలి కాలంలో నరికివేత కారణంగా అగరువృక్షాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. చందనం సహా మిగిలిన రకాల కలపను ఘనపుటడుగుల చొప్పున విక్రయిస్తే, అగరు కలపను మాత్రం కిలోల లెక్కన విక్రయిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో అగరు కలప కిలో ధర లక్ష డాలర్లకు (రూ.83 లక్షలు) పైమాటే! (చదవండి: 300 ఏళ్ల నాటి మహావృక్షం..హఠాత్తుగా..) -
విశాఖ బీచ్‌లో భారీ చెక్కపెట్టె.. ఇంతకీ ఆ బోషాణంలో ఏముంది?
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని సాగర తీరానికి భారీ బోషాణం (చెక్క పెట్టె) కొట్టుకు రావడం కలకలం రేపింది. ఆ పెట్టెలో ఏముందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అందులో భారీ ఎత్తున నిధులు ఉండే అవకాశం ఉందని కొందరు.. స్మగ్లర్లు విలువైన వస్తువుల్ని అందులో దాచి ఉంటారని ఇంకొందరు.. శత్రు దేశాలు విధ్వంసం సృష్టించేందుకు పంపించిన బాక్స్ అని మరికొందరు పేర్కొనడంతో శుక్రవారం రాత్రంతా బాంబ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు పహారా కాశారు. శనివారం ఉదయానికి ఈ సమాచారం ఆ నోటా.. ఈ నోటా ప్రచారం కావడంతో భారీ పెట్టెను చూసేందుకు వేలాదిగా జనం ఎగబడ్డారు. చివరకు అది సముద్రం మధ్య నౌకల లంగర్ వేసేందుకు వినియోగించే స్లీపర్ బార్జ్ (చెక్క దిమ్మె)గా నిర్థారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అలల ఒడిలో.. భారీ వస్తువు! విశాఖ సాగర తీరంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అలల మధ్య భారీ వస్తువేదో కదులుతున్నట్టు సందర్శకులు గుర్తించారు. తొలుత అది భారీ సముద్ర జంతువు అని భయాందోళన చెందారు. ఒడ్డుకు పరుగులు తీశారు. రాత్రి పహారాకు బీట్ కానిస్టేబుళ్లకు కొందరు సమాచారం అందించగా.. అది ఒక భారీ చెక్క పెట్టె అని గుర్తించారు. చైనా, పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఏవైనా పేలుడు పదార్థాలున్నాయా అని భయాందోళనలకు గురయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అలెర్ట్ అయిన సిటీ సెక్యూరిటీ వింగ్ పొక్లెయిన్ల సాయంతో బాక్స్‌ను ఒడ్డుకు తీసుకొచ్చింది. అది పురాతన బాక్స్‌గా కనిపించడంతో అందరి అనుమానాలు మరింత బలపడ్డాయి. కొందరు బాంబులు ఉన్నాయేమో అని భయపడగా.. భారీ నిధితో కూడిన పెట్టె ఒడ్డుకు వచి్చందని మరికొందరు భావించారు. భద్రతా బలగాలు బీచ్‌కు చేరుకుని ప్రజల్ని అప్రమత్తం చేశాయి. బీచ్ రోడ్డుని క్లియర్ చేశాయి. శనివారం ఉదయం ఆ భారీ పెట్టె మిస్టరీని ఛేదించేందుకు బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. చేతులతో దానిని తెరిచేందుకు బాంబ్ డిస్పోజల్ టీమ్ ప్రయత్నించగా.. సాధ్యం కాలేదు. బాంబ్ స్క్వాడ్ జాగిలాలతో చెక్ చేశారు. అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని గుర్తించారు. జీవీఎంసీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్న రెండు పొక్లెయిన్లను పోలీసులు రంగంలోకి దించారు. 14 గంటల నిరీక్షణ తరువాత.. సమాచారం అందుకున్న ఆర్కియాలజీ బృందం చేరుకుని బాక్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. ఇది పురాతన కాలం నాటి పెట్టె కాదని.. రెండు నుంచి నాలుగేళ్ల క్రితం బర్మా టేకుతో తయారు చేసిన పెట్టె అని నిర్థారించింది. 10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు గల దానిని విడదీసేందుకు ప్రయత్నించగా.. చివరకు అది కేవలం చెక్క దిమ్మెగా గుర్తించారు. ఆర్కియాలజీ బృందంతో పాటు మత్స్యకారులు, పోర్టు అధికారులతో పోలీసులు సంప్రదింపులు జరపగా.. అది నౌకల్లో వినియోగించే స్లీపర్ బార్జ్ అని స్పష్టమైంది. చిన్న సైజు నౌకలు అలల తాకిడికి గురైనప్పుడు అవి దెబ్బ తినకుండా కర్రలతో చేసిన స్లీపర్ బార్జ్‌లను ఒక బ్లాక్‌గా బిగించి వినియోగిస్తారని తేలింది. సముద్రం మధ్యలో షిప్‌లని లంగరు వేసేందుకు వీటిని ఉపయోగిస్తారని తెలిసింది. కంటైనర్ కార్గో వెసల్స్ నుంచి కంటైనర్లను దించే సమయంలోనూ ఈ తరహా బార్జ్‌లను వినియోగిస్తుంటారనీ.. వాటిలో ఒకటి షిప్ నుంచి విడిపోయి ఇలా కొట్టుకు వచ్చి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మొత్తానికి విశాఖ నగరానికి 14 గంటల పాటు కంటిమీద కునుకు లేకుండా.. ఓవైపు ఆందోళనల్ని.. మరోవైపు ఉత్కంఠని కలిగిస్తూ.. యాక్షన్ సినిమా తలపించిన భారీ చెక్క కథ సుఖాంతమవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: మత్స్యకారులకు కష్టాలుండవిక -
సింగిల్ ‘టేక్’ శిల్పం
కంటోన్మెంట్ (హైదరాబాద్): ప్రపంచంలోనే అతిపెద్ద అనంత శేష శయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండీ బర్మా టేకు శిల్పాన్ని శనివారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. దీనికి బోయిన్‌పల్లిలోని అనూరాధ టింబర్ ఎస్టేట్స్ వేదికైంది. 21 అడుగుల పొడవు, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన బర్మా టేకు దుంగతో చేసిన ‘అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి’ కళా ఖండానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అప్పటి బర్మా (మయన్మార్) దేశ అడవుల్లో సుమారు 1,500 ఏళ్ల క్రితం బర్మా టేకు దుంగను ఆ దేశ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం వేలం వేసింది. అనూరాధ టింబర్స్ భారీ మొత్తం చెల్లించి ఈ దుంగను దక్కించుకుంది. చిత్రకారుడు గిరిధర్ గౌడ్‌తో పలు రేఖా చిత్రాలను రూపొందించి.. మయన్మార్ దేశ ప్రభుత్వం అనుమతితో అక్కడి శిల్పులతో కళాఖండాన్ని చెక్కించింది. అనంతరం కళాఖండాన్ని భారత్‌కు రప్పించి తుది మెరుగులు దిద్దించింది. భగవద్గీతలోని 11వ అధ్యాయం 6వ శ్లోకం ఆధారంగా అనంత శేషశయన శ్రీ మహావిష్ణువుతో పాటు, శ్రీదేవి, భూదేవి చిత్రాలతో పాటు 84 చిన్న కళాఖండాల కలయికతో ఈ భారీ శిల్పాన్ని రూపొందించారు. కళాఖండాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అనురాధ టింబర్స్ నిర్వాహకులు చదలవాడ సోదరులు బర్మా టేకుతో అద్భుత కళాఖండాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. -
కెనడియన్ వుడ్ విల్లాకు అవార్డు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాక్ ప్రాజెక్ట్స్ నిర్మించిన కెనడియన్ వుడ్ విల్లాకు అరుదైన గౌరవం దక్కింది. సస్టెయినబుల్ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ ఇన్ ఇండియా అవార్డును గెలుచుకుంది. హైదరాబాద్‌లోని బీటీఆర్ గ్రీన్స్‌లో రూపుదిద్దుకున్న విల్లా ప్రాజెక్ట్‌కు ఈ అవార్డు దక్కిందని కంపెనీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో నేషనల్ అవార్డ్స్ ఫర్ లీడర్షిప్ అండ్ ఎక్సలెన్స్ టీఎంలో భాగంగా ఫారెస్ట్రీ ఇన్నోవేషన్ ఇన్వెస్ట్మెంట్ (ఎఫ్ఐఐ) బిజినెస్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ గజానన్ పట్నాకర్ ఈ అవార్డును అందుకున్నారు. కెనడాకు చెందిన ప్రభుత్వ సంస్థ ఫారెస్ట్రీ ఇన్నోవేషన్ కన్సల్టింగ్ (కెనడియన్ వుడ్)తో కలిసి మ్యాక్ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసింది. కెనడాలోని అడవుల నుంచి సేకరించిన కలపతో పర్యావరణహితమైన విల్లాలను నిర్మించారు. -
కలప కత్తి... కత్తి కాదు అంతకు మించి గురూ!
కలపను కట్ చేసే కత్తులను చూసి ఉంటారు.. కానీ, కత్తినే కట్ చేసే కలపకత్తిని చూశారా? కూరగాయలు, పండ్లతోపాటు మాంసం ముక్కలను కూడా ఈజీగా కట్ చేయగలదు ఈ కత్తి. సాధారణ లోహపు కత్తి కంటే ఇది 23 రెట్లు బలమైనది, మూడు రెట్లు పదునైనది. కూరగాయలు కట్ చేసే కత్తుల్లో ఎక్కువగా స్టీల్, ఇనుము వంటి లోహాలనే ఎందుకు వాడటం.. విరివిగా దొరికే కలపను ఎందుకు ఉపయోగించ కూడదు అని ఓ విద్యార్థికి వచ్చిన అద్భుతమైన ఆలోచనే ఈ రూపకల్పనకు దారితీసింది. ఇందుకు అమెరికాలోని మేరిల్యాండ్ యూనివర్సిటీ అధ్యాపకులు కూడా సహాయం చేయడంతో చక్కటి ఈ కలపకత్తి తయారైంది. సాధారణ కత్తిలాగే.. సెల్యులోజ్, ఇతర రసాయనాలను ఓ ప్రత్యేకమైన కలపతో చేర్చి, అధిక ఉష్ణోగ్రత, ఒత్తిడిని ఉపయోగించి, దీనిని తయారు చేశారు. అయితే, దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ టెంగ్ లీ తెలిపారు. ఏదిఏమైనా.. కలపకత్తి ‘కత్తి’లా ఉంది కదూ! చదవండి: వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..! -
స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైందట! దేనితో తయారు చేశారో తెలుసా..
చెక్క కత్తి (ఓన్లీ మేడ్ విత్ వుడ్)... దీనితో మాంసం, కూరగాయలు.. ఇంకా గట్టి పదార్థాలు కూడా కట్ చేయొచ్చు. చెక్కతో తయారు చేసిన కత్తేమిటీ, గట్టి పదార్థాలను కట్ చేయడమేంటి..? మీ అనుమానం ఇదేనా! నిజంగానే చెక్కతో తయారు చేసిన కత్తి అండీ!! అచ్చం స్టెయిన్లెస్ స్టీల్ కత్తి మాదిరి. నిజం చెప్పాలంటే.. స్టీల్ కత్తి కంటే కూడా మూడు రెట్లు పదునైనది .. యూనిర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఈ విధమైన కత్తిని తయారు చేసింది. ఈ విశ్వవిద్యాలయం పరిశోధకులు మామూలు కలపను గట్టిపడే ప్రక్రియను వినియోగించి ఈ కత్తిని తయారు చేశారట. దీంతో సాధారణ చెక్క కంటే 23 రెట్లు బలంగా తయారైంది. ఇది పర్యావరణానికి కూడా మంచిదట. ఈ చెక్క కత్తి విశేషాలు ప్రొఫెసర్ టెంగ్ లీ మాటల్లో.. చదవండి: Foods For Bone Health: అరటి, పాలకూర, డ్రై ఫ్రూట్స్, చేపలు, బొప్పాయి.. ఇవి తింటే.. ‘స్టీమింగ్ లేదా కంప్రెషన్ వంటి వుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ శతాబ్దాలుగా ఆచరనలో ఉన్నాయి. ఐతే కొంచెం ఒత్తిడి తగలగానే విరిగిపోతాయి. ఐతే సాధారణంగా ఒక చెట్టులో 40-50 శాతం నారతో కలప ఏర్పడుతుంది. మిగిలిన భాగమంతా హెమిసెల్యులోజ్, లిగ్నిన్ అని పిలువబడే బైండర్ ఉంటుంది. అది నార బలాన్ని తగ్గిస్తుంది. నార నిర్మాణాన్ని దెబ్బతీయకుండా చెక్కలో బలహీనమైన భాగాలను తొలగించడం ద్వారా చెక్క కత్తిని అభివృద్ధి చేశాం. ఈ విధంగా తయారు చేసిన కత్తి, తేమ తగిలిన తర్వాత కూడా దాని పదును చెదరకుండా ఉండేందుకు మినరల్ ఆయిల్‌తో పూత పూశాము. ప్రక్రియ చెక్క తుప్పులను ఉక్కులాగా, పదునుగా చేయగలదని, తుప్పు నిరోధకతను కలిగి ఉంటుందని’ ఆయన పేర్కొన్నారు. వంటగదిలో కట్టింగ్ బోర్డ్, చాప్ స్టిక్‌లు, రోలింగ్ పిన్ వంటి చాలా కాలంగా వినియోగించే చెక్క ముక్కలను కూడా ఈ ప్రక్రియ ద్వారా పదునుపెట్టి కత్తులుగా మార్చొచ్చట. అసలు ఇంతవరకూ ఎప్పుడైనా ఊహించామా చెక్కతో తయారు చేసిన కత్తులు కూడా ఉంటాయని.. ఈ చెక్క కత్తుల గురించి మీరు ఏమనుకుంటున్నారు? చదవండి: Science Facts: క్యాన్సర్ నివారణకు పసుపు ఉపయోగపడుతుందా?.. అదే అడ్డంకి.. -
ఎల్బీనగర్లో వ్యాపారి కిడ్నాప్ కలకలం
-
ఎల్బీనగర్లో వ్యాపారి కిడ్నాప్ కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో కిడ్నాప్ కలకలం రేపింది. ఎల్బీనగర్లో ఉన్న కైఫ్ ట్రేడర్స్ ఉడ్ యజమాని అరిఫ్ అక్బర్‌ను నలుగురు దుండగులు అర్ధరాత్రి కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం మరో కారులో వచ్చిన కొంతమంది షాప్‌లోకి చొరబడి రూ.50 లక్షల విలువైన ఉడ్‌ను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసుకున్నారు. 6 ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కి కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కలప ఉపగ్రహం.. ఎందుకంటే?
కలపేంటి? ఉపగ్రహమేంటి? ఇదేదో కొయ్యగుర్రంలాంటిదేమో అనుకుంటున్నారా? కానే కాదు. ఒకసారి అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత మిగిలిన ఉపగ్రహాల మాదిరిగానే పూర్తిస్థాయిలో పనిచేయగల అసలు సిసలు ఉపగ్రహం. ఇప్పటి వరకు ఉపగ్రహాలను అల్యూమినియం వంటి లోహాలు, ప్లాస్టిక్ తదితర పదార్థాలతో తయారు చేస్తూ వస్తున్నారు. ఇవి తిరిగి నేలకు చేరుకున్నా, వీటి వ్యర్థాలను పర్యావరణానికి చేటు కలిగించకుండా నిర్మూలించడం ఒక పట్టాన సాధ్యమయ్యే పనికాదు. అలాగే, ఇవి అంతరిక్షంలోనే చక్కర్లు కొడుతూ మిగిలిపోయినా ఇబ్బందే! ఇప్పటికే చాలా ఉపగ్రహ వ్యర్థాలు అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్నాయి. వీటినే ‘స్పేస్‌జంక్’ అంటున్నారు. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా ఉండేందుకే జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ, సుమిటిమో ఫారెస్ట్రీ నిపుణులు కలపతో ఉపగ్రహాన్ని రూపొందించారు. ఇందులో అత్యవసరమైన కొద్ది భాగాలను మాత్రమే అల్యూమినియంతో తయారు చేసినవి అమర్చారు. దీనిని 2023లో అంతరిక్షంలోకి పంపనున్నారు. ప్రపంచంలోనే ఇది తొలి కలప ఉపగ్రహం. నిర్దేశించిన పని పూర్తి చేసుకున్నాక, ఇది భూవాతావరణంలోకి ప్రవేశిస్తున్న క్రమంలో మార్గమధ్యంలోనే కాలి బూడిదైపోతుంది. కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. చదవండి: వైరల్‌గా మత్స్యకన్య ‘మెసేజ్’ -
కట్టెల పొయ్యిలతోనే కాలుష్యం ఎక్కువ
సాక్షి, న్యూఢిల్లీ : భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వంట కోసం కట్టెల పొయ్యిలు ఎక్కువ వాడుతారనే విషయం తెల్సిందే. ఈ పొయ్యిల వల్ల ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దీనిని నియంత్రించడంలో భాగంగా కట్టెల పొయ్యిల స్థానంలో గ్యాస్ స్టవ్‌లను ప్రోత్సహించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘పేదల ఇంటింటికి ఉచిత గ్యాస్ కనెక్షన్’ తీసుకొచ్చారు. గ్యాస్ సిలిండర్ల కోసం నెలకు ఐదారు వందలు పెట్టాల్సి రావడం, గ్రామీణ ప్రాంతాల్లో పొయ్యిలోకి కట్టెలు ఉచితంగా దొరకడం వల్ల ఆ పథకం అంతగా విజయవంతం కాలేదు. కట్టెల పొయ్యిల వల్ల ఎంత వాయు కాలుష్యం ఏర్పడుతుందనే విషయంలో ఇప్పటికీ చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వాతావరణంలోని ‘పీఎం–2.5’ కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి అత్యంత హానికరమైనది. దీని వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి, ఊపిరితిత్తులు కూడా దెబ్బతింటాయి. పీఎం–2.5 అంటే పార్టికులేట్ మ్యాటర్ (నలుసులు లేదా రేణువులు) 2.5 సెంటీమీటర్ల వ్యాసం కన్నా తక్కువగా ఉండడం. ఇవి రోజుకు ఒక్క ఇంటి పొయ్యి నుంచి వెలువడుతాయంటే ఓ ట్రక్కు రోజంతా తిరిగితే వెలువడే రేణువులకన్నా ఎక్కువ. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉన్న కట్టెల పొయ్యిలన్నింటికి 2022 నాటికి స్వస్తి చెప్పాలన్నది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సు నిర్మాణం. ఈ దిశగా లండన్ ఇప్పటికే చర్యలు పట్టింది. బ్రిటన్‌లో ప్రస్తుతం 17 లక్షల మంది కట్టెల పొయ్యిలను ఇప్పటికీ వాడుతున్నారు. వారు వంటకోసం కాకుండా రూమును వెచ్చబరచడం కోసమే ఎక్కువగా వాడుతారు. ఇప్పుడవి రకారకాల డిజైన్లలో వస్తుండడంతో వాటి పట్ల లండన్ వాసులకు ఆకర్షణ కూడా పెరిగింది. ఎలక్ట్రిక్ రూమ్ ఈటర్ల కన్నా ఈ కాచుకొనే కట్టెల పొయ్యిలను వాడడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదవడమే కాకుండా ఆకర్షణీయంగా ఉండడం కారణం. భారత్‌లోని కట్టెల పొయ్యిల కన్నా లండన్ వాసుల పొయ్యిల ద్వారా తక్కువ కాలుష్యమే ఏర్పడుతుంది. అయినా వారికి అదే ఎక్కువట. మొత్తం దేశ వ్యాప్తంగా వివిధ రూపాల్లో కలుగుతున్న కాలుష్యంలో వారి కట్టెల పొయ్యిల వల్ల వెలువడుతున్న కాలుష్యం దాదాపు 30 శాతం అట. భారత కట్టెల పొయ్యిల వల్ల కాలుష్యం ఎక్కువగా ఏర్పడగానికి కారణం ఏ కట్టెలు దొరికితే అవే వాడేయడం, కొన్నిసార్తు పచ్చి కట్టలు కూడా వాడడం. లండన్ వాసులు ప్రత్యేక దుంగలను వాడుతారు. చిన్న చిన్న దుంగలను, పూర్తిగా ఎండిన దుంగలను, అవి కొన్ని ప్రత్యేక రకాలకు చెందిన దుంగలను మాత్రమే వాడాలంటూ అక్కడి ప్రభుత్వం వారికి మార్గదర్శకాలను నిర్దేశించింది. పొయ్యిల నుంచి ఎక్కువ పొగ రాకుండా ఎక్కువ మంట వచ్చే విధంగా పొయ్యిల నిర్మాణం ఉండాలంటూ వాటిని తయారు చేసే కంపెనీలకు కూడా మార్గదర్శకాలను సూచించింది. ఈ మేరకు ఇప్పుడు అక్కడి మార్కెట్లోకి ఐదు కిలోవాట్ల ‘సిల్వర్ డలే 5 ఎస్ఈ’ వుడ్ బర్కింగా స్టవ్ వచ్చింది. దాని ధరం 525 పౌండ్లు (దాదాపు 48 వేలు). అలాగే ‘బెల్టనే మిడ్‌ఫోర్డ్ ఎస్సీ’ వుడ్ బర్నింగ్ స్టవ్ వచ్చింది. దాని ధర 946 పౌండ్లు (86 వేలు). -
కలప దొంగలను పట్టుకోవాలి
తిర్యాణి: మండలంలోని పంగిడిమాదర గ్రామ శివారులో గురువారం రాత్రి రెండు లారీలలో అక్రమంగా కలప తరలిస్తూ పట్టుబడిన సంఘటనలో అధికారులు దోషులను పట్టుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కలప రవాణాలో అధికార పార్టీకి చెందిన నాయకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. కలప లారీలు పట్టుబడి రెండు రోజులు గడుస్తున్నా కలప ఎక్కడికి పోతుంది, అది ఎవరిది, అని అధికారులు నిర్ధారించలేకపోతున్నారన్నారు. కలప రవాణా చేస్తున్న లారీ డ్రైవర్లపై కేసులు నమోదు చేసి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు దోషులను పట్టుకునే వరకు తాము ఊరుకునేది లేదని ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రభుత్వం ఒక వైపు హరితహారం కార్యక్రమం పెట్టి అడవులను అభవృద్ధి చేయాలని చెపుతున్నా అధికార పార్టీ నాయకులు మాత్రం అడవులను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల అవినీతిలో అధికారులు భాగస్వాములు కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహించాలన్నారు. అటవీ సంపద బాహాటంగా తరలిపోతున్నా, అటవీ అధికారులు. పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అడవిలోని వంట చెరుకును తీసుకొస్తేనే అటవీ అధికారులు అమాయకులపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారు. అలాంటిది ఇంత పెద్ద మొత్తంలో కలప అక్రమంగా తరలిపోతుంటే వారు ఏమి చేస్తున్నట్లన్నారు. గ్రామాలలో ప్రతి గ్రామానికి గ్రామ పొలీస్ అధికారిని నియమించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసులు ఏమి చేస్తున్నట్లన్నారు. అటవీ శాఖామంత్రి ఇలాఖాలోనే కోట్లాది రూపాయల కలప దందా కొనసాగడం శోచనీయమన్నారు. అక్రమంగా అటవీ సంపదను దోచుకుంటున్న వారు ఎంతటి వారైనా అధికారులు పట్టుకోవాలన్నారు. పక్షపాతం లేకుండా చూడాలని అన్నారు. కార్యక్రమలో పీసీసీ సభ్యులు విశ్వప్రసాదరావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి అనిల్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లం వెంకటేశం, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షులు బాలేశ్వర్‌గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంగ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంకంగౌరయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బాదిరావు, నాయకులు బ్రహ్మం, మొగిలి తదితరులు పాల్గొన్నారు. -
పరి పరిశోధన
ఉక్కులాంటి కలప ఉక్కులాంటి దృఢమైన కలప త్వరలోనే భవన నిర్మాణరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తుపాకి తూటాలను సైతం తట్టుకోగల అలాంటి ‘సూపర్‌వుడ్’ను అమెరికాలోని మేరీలాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా రూపొందించారు. మామూలు కలపను నుజ్జు నుజ్జు చేసి, నీటిలో కరిగే ద్రావణంలో కలిపి ముద్ద చేసి అత్యధిక సాంద్రతతో రూపొందించిన ఈ ‘సూపర్‌వుడ్’ను రకరకాలుగా పరీక్షించి దీని దారుఢ్యాన్ని నిగ్గుతేల్చారు. దారుఢ్యంలో ఇది ఉక్కును సరిపోలినా, సాధారణ కలప కంటే తేలికగానే ఉంటుందని మేరీలాండ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నుజ్జు చేసిన కలపలో సోడియం హైడ్రాక్సైడ్, సోడియం సల్ఫైట్ రసాయనాలు కలిపిన నీటితో ముద్దగా చేసి, ఆ ముద్దను రెండు లోహపు పలకల మధ్య భూమి ఉపరితల వాతావరణం కంటే 50 రెట్లు ఎక్కువ పీడనంతో అదిమి పట్టి, వంద డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడిచేయడం ద్వారా ఈ ‘సూపర్‌వుడ్’ను రూపొందించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉక్కునైనా ఛేదించగల వాటర్‌గన్ ఉక్కునైనా ఛేదించగల వాటర్‌గన్ అందుబాటులోకి వచ్చింది. దీనిని షూట్ చేస్తే, ఇందులోంచి పెనువేగంతో దూసుకొచ్చే నీరు.. ఉక్కు, కాంక్రీట్, ఇటుకలు, చివరకు బులెట్‌ప్రూఫ్ గ్లాస్‌ను కూడా ఛేదించగలదు. ఏదైనా గోడపై దీనిని గురిచూసి ప్రయోగిస్తే, మూడంగుళాల రంధ్రం ఏర్పడి, అందులోంచి నీరు లోపలకు దూసుకుపోతుంది. అగ్నిమాపక పరికరాలను తయారు చేసే‘పైరోలాన్స్’ అనే కంపెనీకి చెందిన నిపుణులు ఈ వాటర్‌గన్‌ను అల్ట్రా హైప్రెషర్ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఈ ‘పైరోలాన్స్’ వాటర్‌గన్స్‌ను ప్రస్తుతం అమెరికన్ నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు ఉపయోగిస్తున్నాయి. కొద్ది విమానాశ్రయాల్లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి సైజును బట్టి ఒక్కొక్కటి 15 వేల డాలర్ల నుంచి 80 వేల డాలర్ల వరకు ఇవి దొరుకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిమాపక దళాలు వీటిని ఉపయోగించేటట్లయితే చాలా వరకు అగ్నిప్రమాదాలను నిరోధించవచ్చని ‘పైరోలాన్స్’ కంపెనీకి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్స్ వంటి జనసమ్మర్దం గల ప్రదేశాల్లో వీటిని అందుబాటులో ఉంచితే, అగ్నిప్రమాదాలను తేలికగా అరికట్టడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. -
కలప.. ఉక్కు కంటే గట్టిగా..!
వాషింగ్టన్: ఉక్కు కంటే దృఢంగా, ఎక్కువ మన్నిక కలిగిన కలపను తయారుచేసే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విధానంలో తయారుచేసిన కలప, సాధారణ కలప కంటే 12 రెట్లు దృఢంగా, పది రెట్లు ఎక్కువ మన్నికతో ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఉక్కు, టైటానియం మిశ్రమ లోహాలు, కార్బన్ ఫైబర్‌కు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడవచ్చని వెల్లడించారు. కార్లు, విమానాలు, ఇళ్ల నిర్మాణంలోనూ వాడుకోవచ్చు. పరిశోధనలో భాగంగా తొలుత కలపను సోడియం హైడ్రాక్సైడ్, సోడియం సల్ఫైట్ కలిపిన ద్రావణంలో 7 గంటల పాటు ఉడికించారు. ఈ ప్రక్రియతో వృక్ష కణజాలంలోని సెల్యులోజ్పై ఎలాంటి ప్రభావం పడకపోగా, లిగ్నిన్ వంటి పాలిమర్లు వేరుపడ్డాయి. దీంతో కణజాలంలో ఖాళీస్థలం ఏర్పడిందన్నారు. అనంతరం ఈ కలపను 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఒకరోజు పాటు బలమైన ఒత్తిడితో నొక్కిపెట్టామన్నారు. దీంతో కలపలోని సెల్యులోజ్ కణజాలాలు ఒకదానితో ఒకటి కలిసిపోయి దృఢమైన కలప తయారయిందన్నారు. -
కలప దందా.. కాసుల పంట
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో టేకు కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఓ వైపు మహారాష్ట్ర, మరోవైపు గోదావరి, ప్రాణహిత నదులు సరిహద్దులుగా ఉన్న ఈ జిల్లా నుంచి విలువైన టేకు కలప స్మగ్లింగ్ అవుతున్నా... అడ్డుకునే యంత్రాంగం లేకుండా పోయింది. సైకిళ్లు, మోటారు సైకిళ్లు మొదలుకొని కార్లు, వ్యాన్లు, ఎడ్లు వంటివన్నీ అడవుల నుంచి టేకు రవాణాకు సాధనాలుగా మారాయి. గోదావరి, ప్రాణహిత నదుల గుండా టేకు కలప దుంగలనే తెప్పలుగా మార్చి ఆవలి ఒడ్డుకు చేరుస్తున్నారు. అడపాదడపా కలప స్మగ్లర్లను పట్టుకొని, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అడవి నుంచి కలప ఉమ్మడి జిల్లా సరిహద్దులను దాటకుండా చుట్టూరా చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ, అవి నామమాత్రంగానే మిగిలాయి. కలప అక్రమ రవాణాదారులతో అటవీ సిబ్బంది చేతులు కలపడం వల్లనే ఆదిలాబాద్ అడవుల్లో టేకుకు రక్షణ లేకుండా పోతుందనేది నగ్న సత్యం. ఇటీవల జన్నారంలో ఆదివాసీ వ్యక్తి భీంరావు తలపై బలంగా మోది చనిపోయాడని వదిలేసిన ఉదంతంలో అల్లర్లు చెలరేగగా, కలప స్మగ్లర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేటతెల్లమైంది. ఎలుక శ్రీను, లచ్చయ్యగౌడ్ అనే వ్యక్తులు కలప అక్రమ రవాణా చేస్తున్న విషయాన్ని సత్తయ్యగౌడ్ అనే అటవీ శాఖ ఉద్యోగికి తెలుపగా, ఆ విషయాన్ని సదరు ఉద్యోగి స్మగ్లర్ల చెవిన వేయడంతో ఈ దాడి జరిగింది. జన్నారంలో అధికారుల అండతోనే.. జన్నారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులే స్మగ్లర్లకు పరోక్షంగా కలప తరలింపునకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందన్పల్లి రేంజ్‌లోని ఇందన్పల్లి, కలమడుగు బీట్ అధికారులను మూడు నెలల క్రితం సస్పెండ్ చేశారు. ఐదు నెలల క్రితం ఉడుంపూర్ రేంజ్ కల్లెడ సెక్షన్ నుంచి వాహనం ద్వారా టేకు దుంగలను ఎనిమిదిసార్లు దర్జాగా తరలించగా తొమ్మిదవసారి అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక బీట్ పెక్షన్ అధికారిని సస్పెండ్ చేశారు. తాజాగా ఆదివాసీ యువకుడు భీంరావుపై జరిగిన హత్యాయత్నంలో వాచర్ సత్తయ్యగౌడ్ను అరెస్టు చేశారు. ఉడుంపూర్ రేంజ్ పరిధిలోని ఇస్లాంపూర్ సెక్షన్లో పని చేస్తున్న ఓ అధికారి çకలపతో ఫర్నిచర్ చేయించి అమ్ముకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రాణహిత నది నుంచి నెలకు రూ.అరకోటి విలువైన కలప... పూర్వ ఆదిలాబాద్‌కు తూర్పు ప్రాంతమైన కోటపల్లి, వేమనపల్లి మండలాలు ఒకప్పుడు టేకు కలపకు పెట్టింది పేరు. కలప స్మగర్లు జిల్లాలో టేకును లేకుండా చేశారు. దాంతో సరిహద్దులోని మహారాష్ట్రపై కన్నేశారు. మహారాష్ట్ర నుంచి గత ఐదేళ్లుగా నెలకు సుమారు రూ.50 లక్షలకు పైగా టేకును మంచిర్యాల జిల్లా మీదుగా అక్రమ రవాణా సాగిస్తున్నారు. కలప రవాణాకు అడ్డు వచ్చిన అధికారులపై దాడులు చేస్తున్నారు. ప్రాణహిత నదిలో కలప దుంగలను తెప్పలుగా కట్టి ఎగువ ప్రాంతంలో వదిలేస్తే దిగువ ప్రాంతాలైన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం, వేమనపల్లి మండలం సుంపుటం గ్రామాలకు చేరుకుంటుంది. జలమార్గం గుండా వచ్చిన కలపను అక్కడి నుంచి స్మగ్లర్లు వాహనాల్లో చెన్నూరు, మంచిర్యాల, గోదావరిఖని తదితర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకోవడం ఇప్పటికీ సాగుతోంది. చెన్నూరులో ‘బాపు’రే... మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున కలప అక్రమ రవాణా వెనుక చెన్నూరుకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి హస్తం ఉంది. మాజీ సర్పంచ్ కూడా అయిన ఈ నాయకుడి కనుసన్నల్లోనే మహారాష్ట్ర నుంచి చెన్నూరుకు నదీ మార్గంలో టేకు యథేచ్ఛగా వచ్చి చేరుతుందని సమాచా రం. సరిహద్దు ప్రాంతంలో పని చేస్తున్న ఫారెస్ట్ అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎక్కడికక్కడ ముడుపులు చెల్లించి కలపను అక్రమ రవాణా సాగిస్తాడనే పేరుంది. ఇచ్చోడలో అధికార, ప్రతిపక్ష నేతలు.. ఇచ్చోడ కలప స్మగ్లింగ్ రాకెట్ ఓ కాంగ్రెస్ నాయకుడి కనుసన్నల్లో సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఇటీవల ఇచ్చోడ కలప డిపోలో మాయమైన టేకు దుంగలు ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో దొరకడంతో కేసులు కూడా నమోదయ్యాయి. కేశపట్నం గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమారుడు కలప రవాణాలో కీలకంగా పనిచేస్తున్నాడు. ఇతనిపై ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి. రెండు నెలల కిత్రం కలప రవాణాకు పాల్పడుతుండగా అడ్డొచ్చిన అటవీశాఖ సిబ్బందిపై దాడిచేసిన సంఘటనలో కేసు నమెదు చేశారు. మండల కేంద్రంలో నివాసముంటున్న సదరు వ్యక్తి ఖరీదైన కారులో తిరుగుతూ అటవీశాఖ చెక్‌పోస్టుల వద్ద పెద్ద మొత్తంలో ముట్టచెప్పి కలప వాహనలను జిల్లా సరిహద్దులు దాటిస్తాడని ప్రచారంలో కూడా ఉంది. ఇదే కేసులో ఇతని వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకొని సీజ్ చేశారు. కేశవపట్నం గ్రామానికే చెందిన మరో అధికార పార్టీ నాయకుడు అనుచరులతో కలిసి అక్రమ కలప రవాణా చేస్తుండగా స్దానిక పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. అయితే నియోజకవర్గ నేత కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. జన్నారంలో అధికారులపై దాడులు కలప రవాణాకు సహకరిస్తూ సొమ్ము చేసుకుంటున్న అధికారులు ఓవైపు ఉండగా... అడవుల్లో జరుగుతున్న కలప స్మగ్లింగ్‌ను అడ్డుకుని దాడికి గురైన వారు మరికొందరు ఉన్నారు. 2014లో కామన్పల్లి బీట్‌లో పని చేస్తున్న బీట్ అధికారి సీతారాంను దేవునిగూడకు చెందిన కొందరు కలప దొంగలు కొట్టి గాయపరిచారు. ఈ సంఘటనలో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. 2016 నవంబర్ 12 న కవ్వాల్ బంగారు తాండా బీట్ అధికారి కిరణ్‌పై దేవునిగూడకు చెందిన కొందరు కలప స్మగ్లర్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో తొమ్మిది మందిపై కేసు నమోదైంది. అయితే స్మగ్లర్లకు కిరణ్ వెళ్లిన విషయం తెలిపింది అటవీశాఖలో పని చేస్తున్న ఓ వ్యక్తి అని ఆరోపణలు వినవచ్చాయి. అక్రమ రవాణా మార్గాలు ఇవే.. ► ఏజెన్సీ ప్రాంతంలోని తాటిగూడ, దంపూర్, ఎర్రబండ, మంగి, గుండాల, కొమ్ముగూడ, దండెపల్లి, పాత మామిడిపల్లి, తిర్యాణి, దేవాపూర్ మీదుగా మంచిర్యాలకు, అక్కడి నుంచి ఇందారం చెక్‌పోస్టు కళ్లు కప్పి పూర్వ కరీంనగర్ జిల్లాలోకి రవాణా చేస్తున్నారు. ► కవ్వాల్, కొత్తూరుపల్లి, కిష్టాపూర్, ఇందన్పల్లి, కలమడుగు, నార్లాపూర్‌లలో సేకరించిన టేకు కలపను ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, ట్రక్కుల ద్వారా లక్సెట్టిపేట గుండా ధర్మపురి, జగిత్యాల ద్వారా రవాణా చేస్తున్నారు. ► కల్లెడ, దోస్త్‌నగర్, ఉడుంపూర్, బీజీపూర్, గండిగోపాలపూర్ ద్వారా నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దులు దాటిపోతోంది. ►ఇచ్చోడ ప్రాంతంలో కలప స్మగ్లర్లు బోథ్ మండలం ఘన్పూర్ నుంచి మహారాష్ట్రకు, అలాగే బైంసా, బాసర నుంచి నిజామాబాద్‌కు తరలిస్తున్నారు. ►కలప స్మగ్లింగ్‌కు సంబంధించి కేశవపట్నం, గుండాల, జోగిపేట్, ఎల్లమ్మగూడ గ్రామాలకు చెందిన 230 మందిపై ఇచ్చోడ పోలీస్టేష్టన్లలో కేసులు నమోదయ్యాయి. నేరడిగొండ, గుడిహత్నూర్, పోలీస్టేషన్లలో కూడా మరో 50 మంది కలప స్మగ్లింగ్ కేసులు నమోదు చేశారు. -
జోరుగా కలప అక్రమ రవాణా
►జిల్లా సరిహద్దులు దాటిస్తున్న వ్యాపారులు ►బొగ్గు బట్టీలకు విలువైన వృక్షాల చేరవేత ►‘వాల్టా’కు తూట్లు పొడుస్తున్న అక్రమార్కులు ►మామూళ్ల మత్తులో అటవీశాఖ అధికారులు..! ►హరితహారం లక్ష్యం నెరవేరేనా.. జిల్లాలో ఒక్కశాతం ఉన్న అటవీ ప్రాంతాన్ని 33 శాతం వరకు పెంచాలనే ఉద్దేశంతో కలెక్టర్ శ్రీదేవసేన ఆధ్వర్యంలో అటు అధికారులు.. ఇటు ప్రజలు కృషి చేస్తుంటే.. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు అక్రమార్కులు ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరుతో ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తుంటే.. అటవీశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలువురు అధికారులకు ప్రతి నెలా ముడుపులు ముట్టచెబుతున్నామనే ధీమాతో అక్రమార్కులు విలువైన కలపను సరిహద్దులు దాటి న్నారు. జిల్లాలోని జనగామ, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, లింగాలఘణపురంతోపాటు పలు మండలాల నుంచి నిత్యం కలప రవాణా జోరుగా సాగుతోంది. అటవీ ప్రాంతంలోని వేప, తుమ్మ, చింత చెట్లను దర్జాగా నరికివేస్తూ లారీల ద్వారా చుట్టుపక్కల ప్రాంతా కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 25 మంది కలప వ్యాపారులు ఉండగా.. వీరికి ఏజెంట్లుగా వంద మందికి పైగా పనిచేస్తున్నట్లు సమాచారం. మామూళ్లు ఎవరికి..? కలప అక్రమ రవాణాపై అటవీశాఖ అధికారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దందా సాగిస్తున్న వ్యాపారుల నుంచి నెల నెలా మామూళ్లు పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారులు, కలప వ్యాపారులు చేతులు కలపడంతో వారి సంపాదన మూడు పువ్వులు.. ఆరుకాయలుగా వర్ధిల్లుతోందనే ప్రచారం జరుగుతోంది. ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా.. అప్పుడప్పుడూ తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తూ.. పెద్ద ఎత్తున కలపను పక్క జిల్లాకు దాటిస్తున్నాట్లు సమాచారం. బొగ్గుబట్టీల నిర్వహణ కోసం కంపతార, రేగి చెట్లకోసం అనుమతి తీసుకుంటున్న సదరు వ్యక్తులు విలువైన కర్రను అందులో ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇంతా జరుగుతున్నా అక్రమ కలప రవాణాను అరి కట్టేందుకు అటవీశాఖ అధికారులు తీసుకున్న చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికారులు మేలుకోకుంటే.. భవిష్యత్‌లో జిల్లాలో ఎన్ని మొక్కలు నాటినా నిష్ప్రయోజనమేనని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
పాడవుతున్నా పట్టించుకోరా?
టింబర్ డిపోలో వృథాగా ఉంటున్న కలప పట్టించుకోని ఎఫ్‌డీవో వినాయక్‌నగర్(నిజామాబాద్ అర్బన్): స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న టేకు కలపను వేలం వేయకుండా అటవీ అధికారులు వృథాగా పడవేశారు. రూ.లక్షల విలువ చేసే కలప ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ పాడవుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. స్మగ్లర్ల నుంచి కలపను అటవీశాఖ అధికారులు పట్టుకుని టింబర్ డిపోలో నిల్వ చేస్తారు. ప్రస్తుతం రూ.10 లక్షలకు పైగా విలువ చేసే కలప ప్రస్తుతం టింబర్ డిపోలో నిల్వ ఉన్నా అధికారులు స్పందించడం లేదు. దాదాపు మూడేళ్ల నుంచి పట్టుకున్న అక్రమ కలపను జిల్లా కేంద్రంలోని వర్నిరోడ్‌లో గల అటవీశాఖ సర్కిల్ కార్యాలయంలో అవరణలోని టింబర్ డిపోలో నిల్వ చేసి ఉంచారు. గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 10 సార్లు వేలం వేశారు. మిగిలిక కలప అలాగే ఉండిపోయింది. అటవీశాఖ అధికారులు ప్రతి నెలా 5వ తేదీన వేలంపాట నిర్వహిస్తారు. గత 8 నెలల నుంచి వేలం వేయకపోవడంతో ఉన్న కలప పాడవుతోంది. తమపకు ధర గిట్టుబాటు కావడం లేదనే కారణంతో వ్యాపారులు కొనుగోలు చేయడం లేదని అధికారులు అంటున్నారు. ఘన్ఫీట్కు రూ.1600 నుంచి రూ.2000 వరకు టేకులాట్ (సైజ్)ను బట్టి ధర నిర్ణయించారు. వేలం పాటలో పాల్గొనే వారు ఈ ధర తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. అప్సెట్ ప్రైస్ (నిర్ణయించిన ధర) నుంచి 20 శాతం తగ్గించే అధికారాలు ఎఫ్డీవోకు ఉంటాయి. అలా చేస్తే ఒకటి లేదా రెండు బీట్లలో కలప విక్రయం జరుగుతోంది. కానీ ప్రస్తుతం అలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కలప కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. గతంలో సబ్–డీఎఫ్‌వోగా విధులు నిర్వహించిన అధికారి ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌వోగా విధులు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత అటవీ శాఖలో కూడా బీట్ల స్థాయి నుంచి సర్కిల్ విభజించారు. ప్రస్తుతం ఆయన నిజామాబాద్ ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్‌గా నిజామాబాద్‌కు వచ్చారు. గతంలో ఉన్న టెరిటోరియల్, సోషన్ ఫారెస్టు, ఫ్లైంయింగ్ స్వా్కగ్ విభాగాలను ఒకే విభాగంగా మార్చారు. గతంలో ఆయన ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా పనిచేయడంతో టెరిటోరియల్ విభాగంపై అవగాహన తక్కువగా ఉండడం, నిర్లక్ష్య వైఖరి కారణంగా కలప వేలంపై దృష్టిసారించడం లేదని ఆ శాఖ నుంచే త్రీవ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేంజ్ పరిధులు విభజించి దాదాపు సంవత్సరం గడిచింది. వర్ని రేంజ్ కార్యాలయం జిల్లా కేంద్రంలోని బీడీ లిఫ్ గోదాం నుంచి నిర్వహిస్తున్నారు. ఆ గోదాం ఖాళీ చేయించి బీడీ ఆకు నిల్వకు తమకు ఇవ్వాలని నార్త్ రేంజ్ అధికారి (డీఎఫ్‌వో) లేఖ రాసినా ఖాళీ చేయించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలప వేలం వేయాలని పలువురు కోరుతున్నారు. -
ఇంటికి వెలుగునిచ్చే గాజులాంటి చెక్క!
లండన్: ఇంటిని అందంగా తీర్చి దిద్దడంలోనూ, అలంకరణ కోసమేకాక ఇంట్లో వెలుతురు నింపేందుకు గాజు పదార్థాన్నివినియోగించడం ఇప్పటి దాకా చూస్తున్నాం. అలా అమర్చిన గ్లాస్ పగిలి పోకుండా ఎంతో సున్నితంగా చూసుకుంటున్నాం. అయితే ఇప్పుడిక ఆ భయం లేదంటున్నారు పరిశోధకులు. గృహ నిర్మాణాల్లో గోడలకు, కిటికీలకు వాడే అద్దానికి బదులుగా గాజును పోలి ఉండే పారదర్శకమైన చెక్కను అందుబాటులోకి తెస్తున్నారు. భవన నిర్మాణం చేపట్టేవారు ఇక ఇంట్లో వెలుతురుతోపాటు, అందాన్ని తెచ్చుకునేందుకు గాజుకంటే బలమైన చెక్కను వాడి డబ్బును ఆదా చేసుకోవచ్చంటున్నారు. ఇంటి గోడల గుండా కాంతి ప్రసరించి ఇల్లు ప్రకాశవంతంగా ఉండేందుకు గృహ నిర్మాణంలో అద్దాలను వాడటం జరుగుతోంది. అయితే ఇప్పుడు అదే స్థానంలో ఎంతో ధృఢంగా ఉండి.. గాజులాంటి పారదర్శకంగా ఉండే చెక్కను వాడొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. కొత్తగా అందుబాటులోకి తెస్తున్న ఈ పదార్థాన్ని సోలార్ సెల్ విండోగా కూడ వినియోగించవచ్చని బయోమాక్రోమోలెక్యూల్స్ జర్నల్ లో వివరించారు. నిజానికి ఇంటిని ప్రకాశవంతంగా ఉంచుకునేందుకు, విద్యుత్తును ఆదా చేసేందుకు లేత రంగు అద్దాలను పైకప్పులకు అమర్చుకోవడం, దీపాలను ఆశ్రయించడం చేస్తుంటారు. అయితే ఈ పారదర్శకంగా ఉండే చెక్క తో అటువంటి సమస్యను తీర్చవచ్చని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యంగా గోడలు పారదర్శకంగా ఉంటే కృత్రిమ వెలుగుల అవసరాన్ని తగ్గిస్తాయి. ఇప్పటికే చెక్కనుంచి పారదర్శకమైన కాగితాన్ని తయారు చేస్తుండగా, ప్రస్తుత పరిశోధనల్లో అదే కాగితాన్ని ధృఢంగా, బలమైన పదార్థంగా తయారు చేయడం సాధ్యమని కనుగొన్నారు. స్వీడన్ లోని స్టాకోట్ కెటిహెచ్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన బెర్గ్ లండ్, అతడి సహచరులు జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఇందుకోసం ముందుగా వాణిజ్య బాల్సా చెక్క నమూనాలనుంచి పరిశోధకులు లైనిన్ తొలగించారు. సాధారణంగా మొక్కల్లో ఉండే లైనిన్ చెక్కనుంచి కాంతిని ప్రసరించకుండా చేస్తుంది. అయితే దీన్ని తొలగించడం వల్ల పూర్తి శాతం పారదర్శకత చేకూరదు. అందుకే చెక్కనుంచీ నేరుగా కాంతి లోపలకు ప్రసరించేందుకు వీలుగా యాక్రిలిక్ ను ఉపయోగిస్తున్నారు. దీంతో రెండు రెట్లు బలమైన గాజులాంటి చెక్క తయారవుతుందని చెప్తున్నారు. -
హరితం.. ఖతం
జిల్లాలో విలువైన వృక్షసంపద గొడ్డలివేటుకు నేలకొరుగుతోంది. అక్రమార్కులు పెద్దపెద్ద వృక్షాలను కొట్టేసి రాత్రిరాత్రే సరిహద్దులను దాటిస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం అడవులను పెంచేందుకు హరితహారం పేరిట మొక్కలునాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండగా మరోవైపు అటవీశాఖ అధికారుల చేతివాటంతో చెట్లు తరిగిపోతున్నాయి. సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో కలప అక్రమవ్యాపారం కొద్దిరోజులుగా మూడుపూలు, ఆరుకాయలుగా సాగుతోంది. అడవులు చాటుమాటున నరికివేతకు గురవుతున్నాయి. రాష్ట్రంలోనే పెద్దజిల్లాగా 18,432 చదరపు కిలోమీటర్ల మేర జిల్లా విస్తీర్ణం ఉంది. కానీ అడవులు మాత్రం తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. కేవలం 2,55,596 హెక్టార్లలో మాత్రమే విస్తరించి ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సరాసరిగా 18శాతం అడవులు ఉండగా, జిల్లాలో మాత్రం కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్నాయి. దీంతో జిల్లాలో ఆశించినస్థాయిలో వర్షాలు కురియక దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో 200 వరకు చిట్టడవులు, ఇతర వనాలు విస్తరించి ఉన్నాయి. కానుగ, చింత, చిరుమణి, వేప, తుమ్మ, నెమలి, నీలగిరి, జిట్టెడు, నల్లమద్ది తదితర విలువైన వృక్షాలు ఉన్నాయి. వీటిని కొల్లగొట్టేందుకు అక్రమార్కులు పక్కాప్లాన్‌ను అనుసరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన కొందరు బడా కలప వ్యాపారులు అటవీ సమీపప్రాంత గిరిజనులతో మాటామంతి కలుపుతున్నారు. వారితో సత్సంబంధాలు ఏర్పరుచుకుని మాయమాటలు చెప్పి వారి అండతోనే చెట్లను నరికివేస్తున్నారు. కలప రవాణాపై అనుమానం రాకుండా ఉండేందుకు అక్రమార్కులు పక్కాప్లాన్ వేస్తున్నారు. పట్టా భూముల్లోని కొంతకలపను కొనుగోలుచేసి వాటికి అనుగుణంగా సమీపంలో ఉన్న చెట్లను న రికివేస్తున్నారు. జిల్లాలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, కొడంగల్, అచ్చంపేట, కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందలకొద్దీ లారీల కలపను తరలిస్తున్నారు. ఒక్కోలారీకి రూ.12- 15వేలు పలుకుతోంది. ఇలా తరలించిన కలపను కర్ణాటక, హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట, కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న టింబర్ డిపోలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ వందలలారీల్లో విలువైన కలప జిల్లా సరిహద్దు దాటుతోంది. అధికారుల అండదండలు అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులు చెట్లను అడ్డంగా నరికించి దొడ్డిదారిన వెళ్లేలా మార్గం చూపుతున్నారు. అక్రమార్కుల నోట్ల కట్టలతో అధికారులు నోళ్లు మూసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా కలప వ్యాపారులకు ఫారెస్టు, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారుల ఆశీస్సులు మెండుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మూడు డిపార్టుమెం ట్లకు పెద్దఎత్తున మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బొంరాస్‌పేట, దౌల్తాబాద్ ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బంది ఏకంగా మామూళ్ల కోసం రిజిస్టర్‌ను నిర్వహిస్తుందనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జీఐఎస్ వినియోగిస్తే అడ్డుకట్ట జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) గూగుల్‌మ్యాప్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. జీఐఎస్ పరిజ్ఞానంతో అడవుల విస్తీర్ణం ఎంతమేర ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు అడవుల సరిహద్దులు అలాగే ఉంటున్నా లోపల మాత్రం చెట్టు ఉండటంలేదు. బయట ఒకలా లోపల మరోలా ఉంటుంది. కనుక జీఐఎస్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే ఈ అక్రమవ్యాపారానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. -
పచ్చధనం స్వాహా!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : పక్క ఫొటోలోని ట్రాక్టర్లో కనిపిస్తోన్న కలప గుత్తి చెరువులోనిది. ఏళ్లతరబడి ఏపుగా పెరిగిన భారీ తుమ్మ వృక్షాలు చెరువు నిండా విస్తరించి ఉన్నాయి. వీటిపై టీడీపీ నేతల కన్ను పడింది. ఇంకేముంది? అడ్డూ అదుపు లేకుండా 15 రోజులుగా వృక్షాలను నరికి విక్రయించేస్తున్నారు. చివరకు అడ్డొచ్చిన అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధి చిందులేశాడు. దీంతో అధికారులు కూడా నిశ్చేష్టులయ్యారు. గుత్తి శివారు ప్రాంతంతో పాటు కొజ్జేపల్లి, లచ్చానుపల్లి గ్రామాల పరిధిలో సర్వే నెంబరు 486లో 877.57 ఎకరాల విస్తీర్ణంలో గుత్తి చెరువు విస్తరించి ఉంది. 30-50 ఏళ్ల వయస్సున్న తుమ్మ చెట్లు చెరువు అంతటా ఉన్నాయి. ప్రస్తుతం చెరువును హంద్రీ-నీవా నీటితో నింపేందుకు అధికారులు యత్నిస్తున్నారు. దీనికి చెరువులోని తుమ్మ చెట్లు అడ్డొస్తాయని భావించారు. ఈ క్రమంలో ఉపాధి హామీ పథకం ద్వారా తొలగించేందుకు చిన్ననీటి పారుదల శాఖ అధికారులు డ్వామాకు సిఫార్సు చేశారు. కంపచెట్లు తొలగింపు మాత్రమే ఉపాధి హామీ ద్వారా చేపట్టొచ్చని, చెట్లను నరికేసేందుకు కుదరదని డ్వామా అధికారులు తిరస్కరించారు. నిబంధనలు ఇవీ! చెరువులోని చెట్లను నరికేసేందుకు మొదట అటవీ శాఖ అనుమతి తప్పనిసరి. ఆపై పంచాయతీ, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకోవాలి. తర్వాత టెండర్ పిలవాలి. టెండర్ దక్కించుకున్న వారు చెట్లను నరికి విక్రయించుకోవచ్చు. తద్వారా వచ్చిన ఆదాయంలో 50 శాతం గ్రామ పంచాయతికి ముట్టజెప్పాలి. తక్కిన 50 శాతం ‘పర్యావరణ పరిరక్షణ’ కింద చెరువు గట్టు, చెరువు పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు ఖర్చు చేయాలి. 15 రోజులుగా ఇలా జరుగుతోంది.. చె రువులోని వృక్ష సంపదపై టీడీపీకి చెందిన నియోజకవర్గ స్థాయి నేత కన్ను పడింది. ఎలాంటి అనుమతి లేకుండా తన అనుచరులతో వారం రోజులుగా చెట్ల నరికివేతకు ఉపక్రమించాడు. ఇదేంటని ప్రశ్నించిన కొందరు అధికారులపై రుబాబు చేశారు. ‘ఏం.. నీకేంటి పని.. నేను కలెక్టర్‌తో అనుమతి తీసుకున్నా.. నీకు చెప్పాల్సిన పనిలేదు.. దీంట్లో వేలు పెట్టొద్దు జాగ్రత్త..’ అంటూ హెచ్చరించారు. దీంతో అధికారులు కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధి వ్యవహారంతో మనకెందుకులే అన్నట్లు.. చూసీ చూడనట్లు వ్యవహరించారు. ఈ క్రమంలో రోజుకు 40 మంది కూలీల చొప్పున ఇప్పటి వరకు 30 ఎకరాల్లో చెట్లను నరికించారు. ట్రాక్టర్లలో తరలించి బహిరంగ మార్కెట్లో విక్రయించారు. వచ్చిన సొమ్మును జేబులో వేసుకున్నారు. వారం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఈ క్రమంలో కొజ్జేపల్లి సర్పంచ్ మహేశ్వరప్ప నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఫారెస్ట్ అధికారులు కూడా నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు శనివారం నీటి పారుదల శాఖ జేఈ షబ్నమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ సంఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ సంబంధిత అధికారులను సంప్రదిస్తే.. శుక్రవారం వరకూ చెట్లు నరికేస్తున్నారనే సంగతే తమకు తెలీదని చెప్పడం గమనార్హం. పోలీసులకు ఫిర్యాదు చేశాం కొజ్జేపల్లి సర్పంచ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు చెరువులోకి వచ్చి కూలీలను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై పూర్తి విచారణ చేపడతామన్నారు. ఇప్పటి వరకూ నరికేసిన చెట్లను వేలం వేయాలని నిర్ణయించుకున్నాం. కలెక్టర్ అనుమతి రాగానే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. - షబ్నమ్, జేఈ, చిన్న నీటి పారుదల శాఖ. మా అనుమతి తీసుకోలేదు చెరువులో చెట్లను నరికేసేందుకు మా అనుమతి తీసుకోలేదు. దీనిపై నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాం. చెట్లు మా పరిధిలోకి రావు. నీటి పారుదల శాఖ పరిధిలోకి వస్తాయి. కానీ అనుమతి మాత్రం అటవీ శాఖ నుంచి కూడా తీసుకోవాలి. - డేవిడ్, ఫారెస్ట్ ఆఫీసర్, గుత్తి రేంజ్. కలెక్టర్ అనుమతి ఉందని చెబుతున్నారు జేఈ షబ్నమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూలీలను అదుపులోకి తీసుకుని విచారించాం. కూలీలు కొందరి పేర్లు చెప్పారు. చెట్లను నరికేందుకు కలెక్టర్ అనుమతి కూడా ఉందన్నారు. ఇదే విషయాన్ని జేఈ షబ్నమ్‌కు చెప్పాం. అనుమతి పత్రాన్ని తీసుకురావాలని సూచించాం. ఎవరూ చెరువులోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నాం. -రమణారెడ్డి, ఎస్ఐ, గుత్తి.