![Kaif Traders Wood Owner Kidnapped In LB Nagar - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/3/LB-Nagar.jpg.webp?itok=xr111aIk)
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్‌లో కిడ్నాప్ కలకలం రేపింది. ఎల్బీనగర్‌లో ఉన్న కైఫ్ ట్రేడర్స్ ఉడ్ యజమాని అరిఫ్ అక్బర్‌ను నలుగురు దుండగులు అర్ధరాత్రి కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం మరో కారులో వచ్చిన కొంతమంది షాప్‌లోకి చొరబడి రూ.50 లక్షల విలువైన ఉడ్‌ను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసుకున్నారు. 6 ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్‌కి కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment