హైదరాబాద్ మహిళకు ఇన్ఫోసిస్ అవార్డ్.. భారీ ప్రైజ్ మనీ | Hyderabad Woman Receives 2023 Infosys Prize | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ మహిళకు ఇన్ఫోసిస్ అవార్డ్.. భారీ ప్రైజ్ మనీ

Published Tue, Jan 16 2024 9:45 AM | Last Updated on Tue, Jan 16 2024 9:55 AM

Hyderabad Woman Receives 2023 Infosys Prize - Sakshi

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్ మహిళ 'కరుణ మంతెన' (Karuna Mantena)కు టెక్ దిగ్గజం 2023 ఇన్ఫోసిస్ అవార్డు అందించింది. సైన్స్‌లో ఈమె చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.

బెంగళూరులో జరిగిన ఇన్ఫోసిస్ అవార్డుల ప్రదానోత్సవంలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అండ్ సోషల్ సైన్సెస్‌ వంటి పలు రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి అవార్డులు అందించడం జరిగింది. ఇన్ఫోసిస్ అవార్డు 2023లో గోల్డ్ మెడల్, 100000 డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.82,97,855) ప్రైజ్ మనీ ఉంటాయి. 

ఇదీ చదవండి: ప్రపంచ వ్యాపార సామ్రాజ్య పతనం! భయపడుతున్న సీఈఓలు..

హైదరాబాద్ మహిళ కరుణ మంతెన మాత్రమే కాకుండా.. ఈ అవార్డు గ్రహీతల్లో ఐఐటి-కాన్పూర్ ప్రొఫెసర్లు సచ్చిదా నంద్ త్రిపాఠి, అరుణ్ కుమార్ శుక్లా, సైన్స్ గ్యాలరీ బెంగళూరు డైరెక్టర్ జాహ్నవి ఫాల్కీ, అడ్వాన్స్‌డ్ స్టడీ ఇన్‌స్టిట్యూట్‌లో ఫెర్న్‌హోల్జ్ జాయింట్ ప్రొఫెసర్ భార్గవ్ భట్ మొదలైనవారు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement