మరోసారి వేలానికి మాల్యా విల్లా
ముంబై: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా విల్లా మరోసారి వేలానికి వస్తోంది. తమకు మాల్యా నుంచి రావలసిన బకారుుల వసూళ్ల కోసం ఇంతకు ముందు ఈ విల్లాను వేలానికి పెట్టారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా ఈ నెల 22న రిజర్వ్ ధరలో 5 శాతం డిస్కౌంట్‌తో మరోసారి వేలానికి పెడుతున్నారు. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్దనున్న కింగ్ ఫిషర్ విల్లాకు రిజర్వ్ ధరగా రూ.81 కోట్లను ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ నిర్ణరుుంచింది. ఈ ఏడాది అక్టోబర్ 19 నాటి రిజర్వ్ ధర రూ.85.29 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం తక్కువ.
ప్రతి సారీ 10 శాతం తగ్గింపు
భారీగా ఉన్న విజయ్ మాల్యా బ్యాంక్ బకారుులను రాబట్టుకోవడానికి బ్యాంక్‌ల కన్సార్షియమ్ ఆయనకు చెందిన పలు స్థిర, చరాస్థులను వేలం వేయడానికి ప్రయత్నిస్తోంది. ముంబైలోని కింగ్‌ఫిషర్ కేంద్ర కార్యాలయం, కింగ్ ఫిషర్ హౌస్‌ను, కింగ్ ఫిషర్ విమానయాన సంస్థకు చెందిన ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్లను వేలం వేసింది. వీటికి తగిన స్పందన లేకపోవడంతో రిజర్వ్ ధరలను 10 శాతం చొప్పున తగ్గిస్తూ వస్తోంది.