
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.1.2 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలను రెయిన్‌బో ఆసుపత్రి విరాళంగా అందజేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌రావు వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఆపరేషన్ థియేటర్లలో ఎయిర్ పెట్రి శాంప్లింగ్ సిస్టమ్‌లను అమర్చేందుకు సహకారం అందించిన రెయిన్‌బోను అభినందించారు.
మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ..మొత్తం ఇన్‌ఫెక్షన్లలో మూడోవంతు పోస్ట్–ఆపరేటి వ్ ఇన్‌ఫెక్షన్స్ ఉన్నట్లు అధ్యయనాలు రుజువు చేశాయని తెలిపారు. ఈ ఎయిర్ పెట్రీ శాంప్లర్ల ద్వారా గాలిలో బ్యాక్టీరియా ఫంగస్ 13 రెట్లు తగ్గించొచ్చన్నారు. పరికరాలను హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి అందజేసిన అనంతరం.. రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ చైర్మన్, ఎండీ డాక్టర్ రమేశ్ కంచర్ల మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా ఈ విరాళం అందించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment