Nagashekar
-
రష్మిక బ్యాన్పై స్పందించిన డైరెక్టర్.. కామెంట్స్ వైరల్
సౌత్‌లో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన్నాపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించనున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ మీడియాతో తన ఫస్ట్ మూవీ గురించి రష్మిక చేసిన కామెంట్స్ ఈ వివాదానికి కారణమయ్యాయి. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ నాగశేఖర్ స్పందించారు. ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన రష్మిక బ్యాన్ గురించి ప్రశ్నించగా.. ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. నేను కూడా సంజు వెడ్స్ గీత సినిమా కోసం చాలామంది నటీనటులకు ఛాన్స్ ఇచ్చాను. వాళ్లు అది గుర్తుపెట్టుకుంటారా? లేదా అన్నది వాళ్ల వ్యక్తిగతొం. నేను అది పట్టించుకోను. ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం బాధపడతాం. రష్మికపై బ్యాన్ విషయానికి వస్తు.. దీని గుర్తించి నాకు పూర్తిగా క్లారిటీ లేదు. కానీ ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఇలాంటివి నేను సపోర్ట్ చేయను అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం డైరెక్టర్ నాగశేఖర్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
పోలీసుల ఎదుట లొంగిపోయిన దర్శకుడు
బెంగళూరు: కర్ణాటకలో తిప్పగుండనహళ్లి ఘటనకు సంబంధించి ముగ్గురు పోలీస్‌స్టేషన్ లో లొంగిపోయారు. మాస్తిగుడి సినిమా దర్శకుడు నాగశేఖర, స్టంట్‌మాస్టర్ రవివర్మ, అసిస్టెంట్ డైరెక్టర్ సిద్ధులు శనివారం మాగడి పొలీసు స్టేషన్లో లొంగిపోయారు. వీరిని స్థానిక న్యాయస్థానంలో హాజరపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈనెల 7న తిప్పగొండనహళ్లి చెరువు వద్ద జరిగిన దుర్ఘటనలో కన్నడ నటులు అనిల్, ఉదయ్‌లు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మాస్తిగుడి సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ సమయంలో హెలికాప్టర్ నుంచి చెరువులోకి అనిల్, ఉదయ్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి బెంగళూరు జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్ అనసూయ తవరెకెరె పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురిపై ఫిర్యాదు చేశారు. దీంతో ‘మాస్తిగూడి’సినిమా నిర్మాత సుందరగౌడ, దర్శకుడు నాగశేఖర, సహాయ దర్శకుడు సిద్ధు, స్టంట్‌మాస్టర్ రవివర్మ, యూనిట్ మేనేజర్ ఎస్.భరత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా యూనిట్ ఎటువంటి రక్షణ ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ అనిల్, ఉదయ్ ప్రాణాలు మృత్యువాత పడ్డారు. మరోవైపు మాస్తిగుడి సినిమా యూనిట్ షూటింగ్ చేయకుండా కర్ణాటక సినిమా అసోసియేషన్ నిషేధించింది.