Kannada Actor Lohitashwa Prasad Passes Away At Age 80 In Bangalore - Sakshi
Sakshi News home page

Actor Lohitashwa Prasad: సినీ పరిశ్రమలో విషాదం, ప్రముఖ నటుడు కన్నుమూత

Published Wed, Nov 9 2022 11:15 AM | Last Updated on Wed, Nov 9 2022 1:18 PM

Kannada Actor Lohitashwa Prasad Passes Away At 80 - Sakshi

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లోహితస్వ ప్రసాద్‌(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్‌ హస్పిటల్‌లో చికిత్స పోందుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచాడు. ఆయన మరణం కన్నడ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపట్ల కన్నడ ఇండస్ట్రీకి చెందిన సినీ, టీవీ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. కాగా ఆయన కన్నడలో దాదాపు 500లకు పైగా సినిమాల్లో నటించారు.

చదవండి: అప్పటి వరకు అల్లు శిరీష్‌ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్‌

అలాగే పలు సీరియల్స్‌లోనూ ఆయన అలరించారు. ఏకే47’, ‘దాదా’, ‘దేవ’, ‘నీ బరేడ కాదంబరి సంగ్లియానా’ వంటి  సినిమాలతో లోహితస్వ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమరుడు శరత్‌ లోహితస్వ కూడా మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల బాలకృష్ణ ‘అఖండ’ చిత్రంలో శరత్‌ లోహితస్వ ఎన్‌ఐఏ(NIA) ఆఫీసర్‌గా నటించారు. వీటితో పాటు ‘సాహో’, ‘అరవింద సమేత’, ‘జై లవకుశ’ వంటి సినిమాల్లో కూడా ఆయన నటించారు. 

చదవండి: విక్రమ్‌కు అరుదైన గౌరవం, పూర్ణ భర్త చేతుల మీదుగా ‘చియాన్‌’కు గొల్డెన్‌ వీసా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement