Versace Model Jennifer Pamplona Spent Close To Rs 5 Crore To Be Kim Kardashian, Now She Is Paying Rs 95 Lakh - Sakshi
Sakshi News home page

ఆమెలా ఉంటేనే గుర్తింపు అనుకుని చివరికి.. ఈమెకిది పునర్జన్మే!

Published Tue, Jul 12 2022 7:04 PM | Last Updated on Wed, Jul 13 2022 8:18 AM

Brazil Model Spent Crores To Become Kim Kardasian Finally Realise - Sakshi

అందంగా ముస్తాబు కావాలని, స్టయిల్‌గా ఉండాలనే  తాపత్రయం ఎవరికి ఉండదు!. అయితే.. ఉన్నదాంతో సరిపెట్టుకునేవాళ్లు కొందరు.. రెట్టింపు చేయాలన్న ఆరాటంతో నానా ప్రయత్నాలు చేసేవాళ్లు మరికొందరు. కానీ, ఇక్కడ ఓ యువతి అలాంటి ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. 12 ఏళ్లుగా.. ఏకంగా 40 కాస్మోటిక్‌ సర్జరీలు చేయించుకుంది. ఒళ్లు హునం అయినా భరించింది. మన కరెన్సీలో నాలుగున్నర కోట్లు రూపాయల పైనే ఖర్చు చేసింది. చివరికి.. తత్వం బోధపడి తన రూపం తిరిగి కావాలంటూ మళ్లీ సర్జరీలు చేయించుకుంటోంది.

అమెరికన్‌ సోషల్‌ ఫిగర్‌, సెల్ఫ్‌ మేడ్‌ బిలియనీర్‌ కిమ్‌ కర్దాషియన్‌లా మారాలని ఓ యువతి కలలు కనింది. కానీ, అదంతా పైపై మెరుగులే అని గుర్తించేందుకు పదేళ్లు పైనే పట్టింది. ఆమె పేరు జెన్నిఫర్‌ పాంపలోనా(29). సొంత దేశం బ్రెజిల్‌. ఇటలీ టాప్‌ కంపెనీ వర్‌సేస్‌లో మోడల్‌గా పని చేసేది. కాలేజీ రోజుల్లో.. మంచి చదువుతో పాటు వృత్తిలోనూ ఒక సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ఉమెన్‌గా రాణించాలనుకుంది. కానీ, కిమ్‌ కర్దాషియన్‌లా ఉంటేనే తనకూ గుర్తింపు ఉంటుందని గుడ్డిగా నమ్మింది. అందుకే ఆమెలా మారిపోవాలని ఫిక్స్‌ అయ్యింది.

ఆనందమే..
పదిహేడేళ్ల వయసులోనే తొలి సర్జరీకి వెళ్లింది పాంపలోనా. ఎందుకంటే.. ఆ టైంకే కర్దాషియన్‌కు పేరుప్రఖ్యాతులు దక్కాయి కాబట్టి. కిమ్‌లా బాడీ షేప్స్‌ రావాలని సర్జరీలతో ఒళ్లు హూనం చేసుకుంది. పెదాలు, వక్షోజాలు, పిరుదులు.. ఇలా శరీర సౌష్టవాన్ని మార్చే సర్జరీలన్నీ చేయించుకుంది. నెమ్మనెమ్మదిగా.. కిమ్‌ కర్దాషియన్‌లా ఉందంటూ ఆమెకు పేరు కూడా దక్కడం మొదలైంది. మోడలింగ్‌లో బోలెడు అవకాశాలు దక్కాయి. ఇంకోవైపు సోషల్‌ మీడియాలోనూ ఫాలోవర్స్‌ పెరుగుకుంటూ వెళ్తున్నారు. సర్జరీల కోసం ఆరు లక్షల అమెరికన్‌ డాలర్లు(నాలుగున్నర కోట్ల రూపాయలపైనే) కానీ.. 


కిమ్‌ కర్దాషియన్‌(ఎడమ), జెన్నిఫర్‌ పాంపలోనా(కుడి)

అంతా ఆమెకు అనుకూలంగా సాగితే ఎలా?. పోనుపోనూ ఆమెకు పరిస్థితి అర్థం అయ్యింది. సహజత్వం కోల్పోయింది ఆమె శరీరం. తన శరీరం తన అదుపు తప్పిందని గుర్తించింది. సర్జరీలకు అలవాటు పడిపోయి.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపించడం మొదలైంది. పరిస్థితి అర్థం చేసుకున్న పాంపలోనా..  ఎలాగైనా తన మునుపటి రూపం వెనక్కి తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

మళ్లీ ఖర్చు చేసి..
ఇస్తాంబుల్‌లో ఓ ఫిజీషియన్‌ను కలిసి.. తన మునుపటి రూపానికి తీసుకురావాలని కోరింది. ఒకేసారి మొత్తం ఆపరేషన్లు చేయించుకుంది. గదిలోకి ఒకలా వెళ్లిన ఆమె.. మరోలా బయటకు వచ్చింది. డీట్రాన్సిషన్‌ కోసం దాదాపు మన కరెన్సీలో కోటి రూపాయాల దాకా ఖర్చు చేసింది. తన రూపం తిరిగి రాబోతున్నందుకు ఇప్పుడు సంతోషంగా ఉందామె.



జెన్నిఫర్‌ పాంపలాకు.. ఇప్పుడు తనలో తాను మధన పడాల్సిన అవసరం లేదు. జీవితమంటే ఏంటో తెలిసొచ్చింది. జీవితమంటే పరిపూర్ణం కాదు. ఎంతో కొంత లోపాలు ఉంటాయి. ఆ లోపాలను స్వీకరిస్తూ ముందకు సాగాలి. విజయ తీరాలను అందుకోవాలి. అంతేగానీ.. సహజ విరుద్దమైన పనులు చేయకూడదనే గుణపాఠం నేర్చిందట. అందుకే సర్జీలకు వెళ్లడం మంచిద కాదని మోడల్స్‌కు సలహా ఇస్తోంది. సర్జరీల వైపు మొగ్గుచూపే వాళ్ల కోసం ‘అడిక్షన్‌.. ఎబోట్‌ ది డేంజరస్‌ ఆఫ్‌ ది ఆపరేషన్స్‌’ పేరిట తీసే  డాక్యుమెంటరీలో ఆమె నటిస్తోంది. తన మునుపటి రూపం తిరిగి వస్తుండడాన్ని పునర్జన్మగా అభివర్ణిస్తోంది ఆ మోడల్‌. అంతేకాదు.. డీట్రాన్సిషన్‌ సెల్ఫీలను సోషల్‌ మీడియాలో సంతోషంగా పోస్ట్‌ చేస్తోంది కూడా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement