భువనేశ్వర్: సొంతగడ్డపై జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో కనీసం కాంస్య పతకమైనా సాధించాలని ఆశించిన భారత్‌కు నిరాశ ఎదురైంది. మూడో స్థానం కోసం ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–3 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఫ్రాన్స్ ఆటగాడు క్లెమెంట్ టిమోతి హ్యాట్రిక్ గోల్స్ (26, 34, 47వ నిమిషాల్లో)తో భారత్‌కు చెక్ పెట్టాడు. టీమిండియా తరఫున నమోదైన ఏకైక గోల్‌ను సుదీప్ (42వ నిమిషంలో) సాధించాడు.
చాంపియన్ అర్జెంటీనా
టైటిల్ పోరులో ఆరుసార్లు చాంపియన్ జర్మనీకి అర్జెంటీనా షాక్ ఇచ్చింది. ఫైనల్లో అర్జెంటీనా 4–2 తో జర్మనీపై గెలిచింది. జూనియర్ ప్రపంచకప్‌ను అర్జెంటీనా గెలవడం ఇది రెండోసారి. 2005లో తొలిసారి అర్జెంటీనా విజేతగా నిలిచింది.
చదవండి: ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే..
Comments
Please login to add a commentAdd a comment